భానుప్రియ ‘అరెస్ట్‌’పై సోదరుడి స్పందన | Bhanupriya Brother Responds On Rumors Of Her Arrest | Sakshi
Sakshi News home page

రూమర్లు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం

Published Sat, Jan 26 2019 1:48 PM | Last Updated on Sat, Jan 26 2019 1:53 PM

Bhanupriya Brother Responds On Rumors Of Her Arrest - Sakshi

పనిమనిషిని తేనాంపేట పోలీసులకు అప్పగించాము

చెన్నై : ప్రముఖ నటి భానుప్రియ అరెస్టాయ్యారంటూ వినిపిస్తోన్న వదంతులపై ఆమె సోదరుడు గోపాలకృష్ణ ఫైర్‌ అయ్యారు. తన సోదరి గురించి అబద్దాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం భానుప్రియ షూటింగ్‌ నిమిత్తం చెన్నైలో ఉన్నారని తెలిపారు. అంతేకాక తమపై ఫిర్యాదు చేసిన పనిమనిషిని తేనాంపేట పోలీసులకు అప్పగించినట్లు గోపాలకృష్ణ వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం, పండ్రవాడ గ్రామానికి చెందిన పెనుపాకల ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పని చేయడానికి పంపించారు. అయితే ఓ ఏడాది నుంచి భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తమ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడటమే గాక తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నట్టు ప్రభావతి రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఆరోపణలపై భానుప్రియ స్పందించారు. ఆ బాలిక చెన్నైలోని తమ ఇంట్లో వస్తువులు, డబ్బు, నగలు దొంగతనం చేసిందని తెలిపారు భానుప్రియ. ఈ విషయం గుర్తించిన తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో బాలిక తల్లి ఐప్యాడ్‌, వాచ్‌లు, కెమెరా తెచ్చి ఇచ్చిందని.. నగలు, డబ్బు మాత్రం ఇవ్వలేదన్నారు. అవి కూడా ఇవ్వాలని అడగడంతో.. వాటిని తెస్తానని వెళ్లి తమపై తప్పుడు కేసు పెట్టిందని భానుప్రియ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement