బంజారాహిల్స్‌: ఇంట్లో పని చేస్తున్న యువతిపై అత్యాచారం | Banjara Hills: Man Molested Young Woman Who Working As A Maid | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌: ఇంట్లో పని చేస్తున్న యువతిపై అత్యాచారం

Published Thu, Sep 30 2021 10:13 AM | Last Updated on Thu, Sep 30 2021 11:08 AM

Banjara Hills: Man Molested Young Woman Who Working As A Maid - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: ఇంట్లో పని చేస్తున్న యువతిని బ­లవంతంగా గదిలోకి లాక్కెళ్లిన ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా­ల ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఓ విల్లాలో ఈ నెల 15వ తేదీన యువతి పనిలో చేరింది. అదే ఇంట్లో శివ(38) వంట మనిషిగా పని చేస్తున్నారు.
చదవండి: Hyderabad: క్రికెట్‌ బెట్టింగ్‌ రాకెట్‌ బ్లాస్ట్‌: రూ.2.21 కోట్ల సొత్తు స్వాధీనం

ఎప్పటిలాగే బాధిత యువతి తెల్లవారుజామున గ్రౌండ్‌ ఫ్లోర్‌ క్లీన్‌ చేస్తుండగా శివ ఆమె వద్దకు వచ్చి బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానంటూ ఆమెను బెదిరించాడు. వెంటనే ఆమె తన సోదరుడికి విషయం చెప్పింది. ఈ మేరకు బాధితురాలు తన సోదరుడితో కలిసి పో­లీ­సులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్‌ పోలీసు­లు అత్యాచారానికి పాల్పడిన శివ కోసం గాలిస్తున్నారు.  
చదవండి: అమీర్‌పేట్‌లో స్కూల్‌ విద్యార్థిని అదృశ్యం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement