నంబర్‌ వన్‌ విద్యార్థి | Number One student | Sakshi
Sakshi News home page

నంబర్‌ వన్‌ విద్యార్థి

Published Mon, Dec 12 2016 11:30 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

నంబర్‌ వన్‌ విద్యార్థి - Sakshi

నంబర్‌ వన్‌ విద్యార్థి

డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుణ్ణి గురువు ఎలా దారిలో పెట్టాడనే కథతో రూపొందనున్న సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’. కృష్ణచైతన్య, భానుచందర్, భానుప్రియ ముఖ్యతారలుగా రవికిరణ్‌ దర్శకత్వంలో కె.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మించనున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు కెమేరా స్విచ్చాన్‌ చేయగా, భానుచందర్‌ క్లాప్‌ ఇచ్చారు. దేవీప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘డ్రగ్స్‌ మాఫియా, మదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో తీస్తోన్న చిత్రమిది. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు రవికిరణ్‌. ‘‘నేను ఎన్టీఆర్‌ ఫ్యాన్‌. నా సినిమాకి ఆయన సినిమా టైటిల్‌ పెట్టడం హ్యాపీగా ఉంది’’ అన్నారు హీరో కృష్ణచైతన్య. నాజర్, ‘తాగుబోతు’ రమేశ్, తనికెళ్ల, అజయ్‌ ఘోష్‌ నటించనున్న ఈ చిత్రానికి మాటలు: గోపీకిరణ్, సంగీతం: తలారి శ్రీనివాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement