5న మగళీర్‌ మట్టుం | Mangalyar Mattam is coming to the screen on September 15. | Sakshi
Sakshi News home page

5న మగళీర్‌ మట్టుం

Published Sat, Aug 19 2017 1:21 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

5న మగళీర్‌ మట్టుం

5న మగళీర్‌ మట్టుం

తమిళసినిమా:  జ్యోతిక ప్రధానపాత్రలో నటిస్తున్న మగళీర్‌ మట్టుం సెప్టెంబర్‌ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.  వివాహానంతరం జ్యోతిక చేస్తున్న రెండో చిత్రమిది. మగళీర్‌ మట్టుం. ఇంతకు ముందు ఈమె నటించిన 36 వయదినిలే చిత్రం మంచి విజయాన్ని సాధించింది. 

ఈ సినిమాలో జ్యోతికతో పాటు భానుప్రియ, ఊర్వశి, శరణ్యపొన్‌వన్నన్‌లు నటిస్తుండడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, లివింగస్టన్‌ తదితరులు నటించగా, అతిథిగా సూర్య మెరవనున్నారు.సూర్య తన నిర్మాణసంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కుట్రం కడిదల్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన బ్రహ్మ కథ, దర్శకత్వం వహించారు. జిబ్రాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై  అంచనాలు ఎక్కువగానే  ఉన్నాయి.

జూలైలోనే ఈ  చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉన్నా, అనివార్యకారణాలతో ఆలస్యమైంది. దీంతో చిత్రాన్ని సెప్టెంబర్‌ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం తరువాత సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై తన తమ్ముడు కార్తీ హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరో పక్క తాను విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న తానాసేర్న్‌దకూటం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement