ఆర్‌ఐఎల్ సెల్ ‌‌- ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ.. బయ్‌  | HDFC AMC reshuffles portfolio in March- October period | Sakshi
Sakshi News home page

ఆర్‌ఐఎల్ సెల్ ‌‌- ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ.. బయ్‌ 

Published Tue, Nov 17 2020 2:18 PM | Last Updated on Tue, Nov 17 2020 2:43 PM

HDFC AMC reshuffles portfolio in March- October period - Sakshi

ముంబై: దేశంలోనే రెండో పెద్ద మనీ మేనేజింగ్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ.. గత ఏడు నెలలుగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులలో పలు మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగా ఇటీవల భారీగా ర్యాలీ చేసిన కొన్ని కౌంటర్లలో అమ్మకాలు చేపట్టగా.. వెనకడుగులో ఉన్న కొన్ని కంపెనీలలో వాటాలు కొనుగోలు చేస్తూ వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈడీ, సీఐవో ప్రశాంత్‌ జైన్‌ ఒక ఇంటర్వ్యూలో తమ పెట్టుబడు తీరుతోపాటు.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేదీ వివరించారు. జైన్‌ తెలిపిన వివరాలు, అభిప్రాయాల ప్రకారం..

నిఫ్టీలో 26 స్టాక్స్‌
ఈ ఏడాది మార్చి 24 మొదలు అక్టోబర్‌ 30వరకూ హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నిఫ్టీ-50కు ప్రాతినిధ్యంవహించే కనీసం 26 బ్లూచిప్‌ స్టాక్స్‌లో విక్రయాలు చేపట్టింది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు ప్రయాణించిన నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోలను పునర్‌నిర్మించుకుంది. మార్చి 24న 7,511కు పతనమైన నిఫ్టీ అక్టోబర్‌ చివరికల్లా 11,642కు చేరింది. దీంతో నిఫ్టీ పీఈ 34ను దాటేసింది. 10ఏళ్ల సగటు పీఈ 22.6 రెట్లుకావడం గమనార్హం. ఫలితంగా మార్చి కనిష్టాల నుంచి 120 శాతం ర్యాలీ చేసిన ఆర్‌ఐఎల్‌ కంపెనీలో6.57 లక్షల షేర్లను విక్రయించింది. ఈ బాటలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సిప్లా, టాటా మోటార్స్‌, విప్రో, యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్, బీపీసీఎల్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫసీ తదితరాలలో కొంతమేర వాటాలను తగ్గించుకుంది. ఈ కౌంటర్లు 28-110 శాతం మధ్య ర్యాలీ చేశాయి.  చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్‌ ఐడియా జోరు)

పెట్టుబడుల జాబితా
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీలలో కోల్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ ఉన్నాయి. మార్చి నుంచి చూస్తే కోల్‌ ఇండియా 10 శాతం క్షీణించగా.. ఎయిర్‌టెల్ 7 శాతం‌, ఎస్‌బీఐ 3 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చూపాయి. ఇదే విధంగా కొన్ని పీఎస్‌యూ బ్యాంకులు చౌకగా లభిస్తుంటే.. మంచి టెక్నాలజీ కలిగిన అతిపెద్ద బ్యాంకులు కొన్ని అందుబాటులో ట్రేడవుతున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఈ రంగం నుంచి రిటర్నులు లభించే అవకాశముంది. కాగా.. గత నెలలో 107 స్టాక్స్‌లో వాటాల విక్రయాన్ని చేపట్టగా.. 68 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్‌- 44,000 దాటేసింది!)

ఫార్మాలో
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఇటీవల సన్‌ ఫార్మా, సింజీన్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలలో వాటాలు పెంచుకోగా.. హిందాల్కో, మిశ్రధాతులో సైతం అదనపు పెట్టుబడులు చేపట్టింది. ఇదేవిధంగా టీసీఐ, ఆర్‌ఈసీ, చోళమండలం, టాటా కన్జూమర్‌, ఎండ్యూరెన్స్‌ తదితర కౌంటర్లలో వాటాలు సొంతం చేసుకుంది. మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో భారత్‌ ఫోర్జ్‌, కెమ్‌కాన్‌ స్పెషాలిటీ, డాబర్‌ ఇండియా, ఈఐహెచ్‌- రైట్స్‌, ఎంఆర్ఎఫ్‌, ఎన్‌ఎండీసీ, సన్‌ టీవీలలో వాటాలు మొత్తంగా విక్రయించింది. తాజాగా ఏబీ ఫ్యాషన్‌, సైయెంట్, డిక్సన్‌ టెక్నాలజీస్‌, ఫినొలెక్స్‌ కేబుల్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement