portfolio changes
-
ఆర్ఐఎల్ సెల్ - ఎయిర్టెల్, ఎస్బీఐ.. బయ్
ముంబై: దేశంలోనే రెండో పెద్ద మనీ మేనేజింగ్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ.. గత ఏడు నెలలుగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులలో పలు మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగా ఇటీవల భారీగా ర్యాలీ చేసిన కొన్ని కౌంటర్లలో అమ్మకాలు చేపట్టగా.. వెనకడుగులో ఉన్న కొన్ని కంపెనీలలో వాటాలు కొనుగోలు చేస్తూ వచ్చింది. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఐవో ప్రశాంత్ జైన్ ఒక ఇంటర్వ్యూలో తమ పెట్టుబడు తీరుతోపాటు.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేదీ వివరించారు. జైన్ తెలిపిన వివరాలు, అభిప్రాయాల ప్రకారం.. నిఫ్టీలో 26 స్టాక్స్ ఈ ఏడాది మార్చి 24 మొదలు అక్టోబర్ 30వరకూ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ నిఫ్టీ-50కు ప్రాతినిధ్యంవహించే కనీసం 26 బ్లూచిప్ స్టాక్స్‌లో విక్రయాలు చేపట్టింది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు ప్రయాణించిన నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోలను పునర్నిర్మించుకుంది. మార్చి 24న 7,511కు పతనమైన నిఫ్టీ అక్టోబర్ చివరికల్లా 11,642కు చేరింది. దీంతో నిఫ్టీ పీఈ 34ను దాటేసింది. 10ఏళ్ల సగటు పీఈ 22.6 రెట్లుకావడం గమనార్హం. ఫలితంగా మార్చి కనిష్టాల నుంచి 120 శాతం ర్యాలీ చేసిన ఆర్ఐఎల్ కంపెనీలో6.57 లక్షల షేర్లను విక్రయించింది. ఈ బాటలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సిప్లా, టాటా మోటార్స్, విప్రో, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టైటన్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, హెచ్‌డీఎఫసీ తదితరాలలో కొంతమేర వాటాలను తగ్గించుకుంది. ఈ కౌంటర్లు 28-110 శాతం మధ్య ర్యాలీ చేశాయి. చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు) పెట్టుబడుల జాబితా హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలలో కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ ఉన్నాయి. మార్చి నుంచి చూస్తే కోల్ ఇండియా 10 శాతం క్షీణించగా.. ఎయిర్టెల్ 7 శాతం, ఎస్బీఐ 3 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చూపాయి. ఇదే విధంగా కొన్ని పీఎస్‌యూ బ్యాంకులు చౌకగా లభిస్తుంటే.. మంచి టెక్నాలజీ కలిగిన అతిపెద్ద బ్యాంకులు కొన్ని అందుబాటులో ట్రేడవుతున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఈ రంగం నుంచి రిటర్నులు లభించే అవకాశముంది. కాగా.. గత నెలలో 107 స్టాక్స్‌లో వాటాల విక్రయాన్ని చేపట్టగా.. 68 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!) ఫార్మాలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇటీవల సన్ ఫార్మా, సింజీన్ ఇంటర్నేషనల్ కంపెనీలలో వాటాలు పెంచుకోగా.. హిందాల్కో, మిశ్రధాతులో సైతం అదనపు పెట్టుబడులు చేపట్టింది. ఇదేవిధంగా టీసీఐ, ఆర్ఈసీ, చోళమండలం, టాటా కన్జూమర్, ఎండ్యూరెన్స్ తదితర కౌంటర్లలో వాటాలు సొంతం చేసుకుంది. మిడ్ క్యాప్ స్టాక్స్‌లో భారత్ ఫోర్జ్, కెమ్‌కాన్ స్పెషాలిటీ, డాబర్ ఇండియా, ఈఐహెచ్- రైట్స్, ఎంఆర్ఎఫ్, ఎన్ఎండీసీ, సన్ టీవీలలో వాటాలు మొత్తంగా విక్రయించింది. తాజాగా ఏబీ ఫ్యాషన్, సైయెంట్, డిక్సన్ టెక్నాలజీస్, ఫినొలెక్స్ కేబుల్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసింది. -
కేంద్ర కేబినెట్లో కీలక మార్పులు
-
కేంద్ర కేబినెట్లో మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా పీయూష్ గోయల్‌కు అధనపు బాధ్యతలు అప్పగించారు. మూత్రపిండ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కొలుకునే వరకు పీయూష్ గోయల్ ఆర్థిక శాఖ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆయన రైల్వేశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఎస్ఎస్ అహ్లువాలియాకు ఎలక్ట్రానిక్స్ & ఐటి శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం సమాచార శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీని తప్పించి.. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు సమాచార శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇకపై ఆమె జైళీ శాఖ మంత్రిగానే కొనసాగనున్నారు. -
బడ్జెట్ తర్వాత భారీ మార్పులు
* సన్నిహితుల వద్ద కేసీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాబోయే బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రివర్గంలో భారీ స్థాయిలో మార్పులు, చేర్పులు జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్లు, ఇతర పదవుల్లో ఆశించిన ప్రాధాన్యత దక్కనివారికి, ఇంకా పదవులను ఆశిస్తున్నవారికి కేసీఆర్ ఇదే విషయాన్ని చెబుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి కొత్తగా ఆరుగురు చేరనున్న నేపథ్యంలో... సామాజికవర్గాలు, జిల్లాలు, రాజకీయ ప్రయోజనాలపై టీఆర్ఎస్లోనూ, రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేబినెట్లోకి కచ్చితంగా వస్తామని, ప్రధాన పోర్టుఫోలియో దక్కుతుందన్న ధీమాతో ఉన్న పలువురు... తమకు ఇతర పదవులతో సరిపెట్టడం, మరికొందరు అనూహ్యంగా తెరపైకి రావడంతో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అలాంటి వారికి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు, కార్పొరేషన్లు కట్టబెడుతున్నారు. రాబోయే కాలంలో మంచి అవకాశాలుంటాయంటూ సర్దిచెబుతున్నారు. కొప్పుల ఈశ్వర్‌కు చీఫ్ విప్ పదవిని ఇవ్వడంతో పాటు వచ్చే బడ్జెట్ సమావేశాలదాకా ఓపిక పట్టాలని సీఎం కేసీఆర్ బుజ్జగించారు. ఆశావహులను సీనియర్ మంత్రులు ఈటెల రాజేందర్, టి.హరీశ్‌రావు బుజ్జగిస్తున్నారు. ‘‘వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గంలో మార్పులుంటాయి. పనితీరు, ఆరోపణలు, సమస్యలు, సామాజిక సమీకరణలపై ఆధారపడి మార్పులుంటాయి. ఒకట్రెండు బడ్జెట్ సమావేశాలదాకా చూసి, పనితీరుపై సమీక్షించాలన్న అభిప్రాయం మేరకు కొందరిని భరిస్తున్నాం. వారిని వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత తప్పించే అవకాశాలున్నాయి’’ అని చెబుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో సామాజిక కూర్పు వెలమ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (మెదక్), తారక రామారావు (కరీంనగర్), హరీశ్‌రావు (మెదక్) మైనారిటీ: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ (హైదరాబాద్) మాదిగ: డిప్యూటీ సీఎం టి.రాజయ్య (వరంగల్) రెడ్డి: నాయిని నర్సింహారెడ్డి (హైదరాబాద్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (నిజామాబాద్), పట్నం మహేందర్‌రెడ్డి (రం గారెడ్డి), జి.జగదీశ్‌రెడ్డి (నల్లగొండ) బీసీ: ఈటెల రాజేందర్ (కరీంనగర్), జోగు రామన్న (ఆదిలాబాద్), టి.పద్మారావుగౌడ్ (హైదరాబాద్)