HDFC Mutual Funds
-
హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ నుంచి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఫండ్
హెచ్డీఎఫ్సీ మ్యుచువల్ ఫండ్ సంస్థ తాజాగా హెచ్డీఎఫ్సీ రియల్టీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో మార్చి 21తో ముగుస్తుంది. గత 6–7 ఏళ్లుగా లిస్టెడ్ రియల్టీ కంపెనీల ఫండమెంటల్స్, లాభదాయకత మెరుగుపడ్డాయి. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ, సెజ్ ప్రాజెక్టుల వ్యాప్తంగా దీర్ఘకాలిక వృద్ధికి రియల్టీ రంగానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉండగలదని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ నవ్‌నీత్ మునోత్ తెలిపారు. -
మెరుగైన రాబడుల కోసం.. హెచ్డీఎఫ్సీ బిజినెస్ సైకిల్ ఫండ్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా బిజినెస్ సైకిల్ ఫండ్ పేరిట కొత్త ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో నవంబర్ 25తో ముగుస్తుంది. సానుకూల పరిస్థితుల్లోకి మళ్లుతున్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందించేందుకు ఈ ఫండ్ కృషి చేస్తుంది. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఇటు కంపెనీల ఆదాయ వృద్ధిపరంగాను, అటు వేల్యుయేషన్ల వృద్ధిపరంగాను ఒనగూరే ప్రయోజనాలను అందుకోవచ్చని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ నవ్‌నీత్ మునోత్ తెలిపారు. మూడేళ్లు అంతకు పైబడిన వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారికి ఇది అనువైనదిగా ఉండనుంది. చదవండి: ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి! -
ఆర్ఐఎల్ సెల్ - ఎయిర్టెల్, ఎస్బీఐ.. బయ్
ముంబై: దేశంలోనే రెండో పెద్ద మనీ మేనేజింగ్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ.. గత ఏడు నెలలుగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులలో పలు మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగా ఇటీవల భారీగా ర్యాలీ చేసిన కొన్ని కౌంటర్లలో అమ్మకాలు చేపట్టగా.. వెనకడుగులో ఉన్న కొన్ని కంపెనీలలో వాటాలు కొనుగోలు చేస్తూ వచ్చింది. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఐవో ప్రశాంత్ జైన్ ఒక ఇంటర్వ్యూలో తమ పెట్టుబడు తీరుతోపాటు.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేదీ వివరించారు. జైన్ తెలిపిన వివరాలు, అభిప్రాయాల ప్రకారం.. నిఫ్టీలో 26 స్టాక్స్ ఈ ఏడాది మార్చి 24 మొదలు అక్టోబర్ 30వరకూ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ నిఫ్టీ-50కు ప్రాతినిధ్యంవహించే కనీసం 26 బ్లూచిప్ స్టాక్స్‌లో విక్రయాలు చేపట్టింది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు ప్రయాణించిన నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోలను పునర్నిర్మించుకుంది. మార్చి 24న 7,511కు పతనమైన నిఫ్టీ అక్టోబర్ చివరికల్లా 11,642కు చేరింది. దీంతో నిఫ్టీ పీఈ 34ను దాటేసింది. 10ఏళ్ల సగటు పీఈ 22.6 రెట్లుకావడం గమనార్హం. ఫలితంగా మార్చి కనిష్టాల నుంచి 120 శాతం ర్యాలీ చేసిన ఆర్ఐఎల్ కంపెనీలో6.57 లక్షల షేర్లను విక్రయించింది. ఈ బాటలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సిప్లా, టాటా మోటార్స్, విప్రో, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టైటన్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, హెచ్‌డీఎఫసీ తదితరాలలో కొంతమేర వాటాలను తగ్గించుకుంది. ఈ కౌంటర్లు 28-110 శాతం మధ్య ర్యాలీ చేశాయి. చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు) పెట్టుబడుల జాబితా హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలలో కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ ఉన్నాయి. మార్చి నుంచి చూస్తే కోల్ ఇండియా 10 శాతం క్షీణించగా.. ఎయిర్టెల్ 7 శాతం, ఎస్బీఐ 3 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చూపాయి. ఇదే విధంగా కొన్ని పీఎస్‌యూ బ్యాంకులు చౌకగా లభిస్తుంటే.. మంచి టెక్నాలజీ కలిగిన అతిపెద్ద బ్యాంకులు కొన్ని అందుబాటులో ట్రేడవుతున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఈ రంగం నుంచి రిటర్నులు లభించే అవకాశముంది. కాగా.. గత నెలలో 107 స్టాక్స్‌లో వాటాల విక్రయాన్ని చేపట్టగా.. 68 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!) ఫార్మాలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇటీవల సన్ ఫార్మా, సింజీన్ ఇంటర్నేషనల్ కంపెనీలలో వాటాలు పెంచుకోగా.. హిందాల్కో, మిశ్రధాతులో సైతం అదనపు పెట్టుబడులు చేపట్టింది. ఇదేవిధంగా టీసీఐ, ఆర్ఈసీ, చోళమండలం, టాటా కన్జూమర్, ఎండ్యూరెన్స్ తదితర కౌంటర్లలో వాటాలు సొంతం చేసుకుంది. మిడ్ క్యాప్ స్టాక్స్‌లో భారత్ ఫోర్జ్, కెమ్‌కాన్ స్పెషాలిటీ, డాబర్ ఇండియా, ఈఐహెచ్- రైట్స్, ఎంఆర్ఎఫ్, ఎన్ఎండీసీ, సన్ టీవీలలో వాటాలు మొత్తంగా విక్రయించింది. తాజాగా ఏబీ ఫ్యాషన్, సైయెంట్, డిక్సన్ టెక్నాలజీస్, ఫినొలెక్స్ కేబుల్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసింది. -
హెచ్డీఎఫ్సీ ఏఎంసీలో వాటా విక్రయం
హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో వాటాను ప్రమోటర్ సంస్థలో ఒకటైన స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో బుధ, గురువారాల్లో మొత్తం 2.82శాతం వాటాకు సమానమైన 60లక్షల ఈక్విటీ షేర్ల అమ్మకానికి సిద్ధమైంది. ఈ ఆఫర్ ఫర్ సేల్కు ఫ్లోర్ ధర రూ.2,362గా నిర్ణయించింది. ఈ విక్రయం ద్వారా స్టాండర్డ్ లైఫ్ మొత్తం రూ.1417 కోట్లను సమీకరించనుంది. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్లో మార్చి 31 నాటికి స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీలకు విడివిడిగా 26.89శాతం వాటాను కలిగి ఉన్నాయి. ‘‘డిమాండ్‌కు అనుగుణంగా ఆఫర్ ఫర్ సేల్ ఇష్యూ ద్వారా ప్రమోటర్ సంస్థ స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్ జూన్ 17-18తేదిల్లో మొత్తం 1.12 కోట్ల ఈక్విటీ షేర్లకు సమానమైన మొత్తం 5.64శాతం వాటాను ను విక్రయించనుంది. ఈ మొత్తం విక్రయంలో తొలుత 2.82శాతం వాటాను సమానమైన 60లక్షల షేర్లకు విక్రయించనుంది. తదుపరి డిమాండ్ అనుగుణంగా మరో 2.82శాతం వాటాను సైతం విక్రయించనుంది.’’ అని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. వాటా విక్రయ నేపథ్యంలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో హెచ్డీఎఫ్సీ అసెట్మేనేజ్మెంట్ నిన్నటి ముగింపు(రూ.2537.65)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.2477 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1784.15లు, రూ.3844.00గా నమోదయ్యాయి. -
ఐపీఓ నిధులు @ రూ.23,670 కోట్లు
న్యూఢిల్లీ: ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల ద్వారా నిధుల సమీకరణ జోరుగా జరుగుతోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం 18 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.23,670 కోట్లు సమీకరించాయి. అంతకు ముందటి ఏడాది ఇదే కాలంలో సమీకరించిన నిధులతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు. ఇక మిగిలిన ఆరు నెలల కాలంలో మరో 50 కంపెనీలు ఐపీఓకు వస్తాయని, మరిన్ని నిధులు సమీకరిస్తాయని అంచనా. ఈ నెల చివరి వారంలో హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ రానుండగా, తర్వాతి నెలల్లో లోధా డెవలపర్స్, రైల్ వికాస్ నిగమ్ తదితర కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. ఐపీఓలకు సెబీ అనుమతి కోసం 28 కంపెనీలు నిరీక్షిస్తుండగా, ఇప్పటికే మరో 18 కంపెనీలు ఐపీఓలకు అనుమతులు పొందాయి. పటిష్టంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్... మంచి నాణ్యత గల కంపెనీలు ఐపీఓకు వచ్చాయని, వాటి ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో ఐపీఓ మార్కెట్ జోరుగా ఉందని ప్రభుదాస్ లీలాధర్ వైస్ ప్రెసిడెండ్(ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్) జె. కళ్యాణివాలా వ్యాఖ్యానించారు. ఐపీఓ సంబంధిత నిబంధనలను మార్కెట్ నియంత్రణ సంస్థ సరళీకరించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో ఐపీఓల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ నిర్ణయం కాలవ్యవధిని మరింతగా తగ్గిస్తూ ఇటీవల సెబీ తీసుకున్న నిర్ణయం కూ డా ఐపీఓ మార్కెట్‌కు ప్రయోజనకరమేనని వారం టున్నారు. ప్రైస్‌బ్యాండ్ నిర్ణయానికి ఐదు రోజులుగా ఉన్న గడువును సెబీ 2 రోజులకు తగ్గించింది. విస్తరణ వ్యూహం... 2016 జనవరి–జూన్ కాలానికి 11 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.6,962 కోట్లు రాబట్టగా. గత ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం 13 కంపెనీలు రూ.12,000 కోట్లు సమీకరించాయి. ఇక ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 18 కంపెనీలు రూ.23,670 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీలన్నీ విస్తరణ వ్యూహంతోనే నిధులు సమీకరించాయి. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను సాధారణ వ్యాపార కార్యకలాపాలకు, రుణ భారం తగ్గించుకోవడానికి కూడా పలు కంపెనీలు వినియోగించాయి. మరింతగా పెరిగిన ‘బ్రాండ్’.... కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలు తమ వాటాను ఐపీఓ ద్వారా విక్రయించడం ద్వారా ఆయా కంపెనీల నుంచి వైదొలిగాయి. ఐపీఓకు రావడం ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టయి ప్రయోజనాలు పొందడమే కాకుండా పలు కంపెనీలు తమ బ్రాండ్ పేరును మరింతగా పెంచుకున్నాయి. మూడు ప్రభుత్వ రంగ సంస్థల ఐపీఓలు.. ఈ ఆరు నెలల కాలంలో మూడు ప్రభుత్వ రంగ సంస్థల ఐపీఓలు కూడా వచ్చాయి. భారత్ డైనమిక్స్, రైట్స్, మిధానిలు ఐపీఓ ద్వారా షేర్లను విక్రయించి స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. అతి పెద్ద ఐపీఓ.. బంధన్ బ్యాంక్... ఈ ఏడాది తొలి 6 నెలల కాలంలో వచ్చిన ఐపీఓల్లో అతి పెద్ద ఐపీఓగా బంధన్ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంక్ రూ.4,473 కోట్ల నిధులు రాబట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో హిందుస్తాన్ ఏరోనాటిక్స్(రూ.4,229 కోట్లు), ఐసీఐసీఐ సెక్యూరిటీస్(రూ.3,515 కోట్లు), వారోక్ ఇంజనీరింగ్ (రూ.1,995 కోట్లు), ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్(రూ.1,844 కోట్లు), లెమన్ ట్రీ హోటల్స్(రూ.1,040 కోట్లు) నిలిచాయి. లోధా డెవలపర్స్ ఐపీఓకు సెబీ ఆమోదం న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం లోధా డెవలపర్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.3,750 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు 1.8 కోట్ల ప్రమోటర్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తారు. అంతేకాకుండా ముందస్తు ఐపీఓ ప్లేస్మెంట్లో భాగంగా 95 లక్షల తాజా షేర్ల జారీ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని కూడా ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.5,500 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. 2007లో వచ్చిన రూ.9,200 కోట్ల డీఎల్ఎఫ్ ఐపీఓ తర్వాత రియల్టీ రంగంలో వస్తున్న రెండో అతి పెద్ద ఐపీఓ ఇదే. లోధా డెవలపర్స్ కంపెనీ హైదరాబాద్‌లో కూడా ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది. -
స్టాక్ మార్కెట్లో... రిస్క్‌తో పాటు అధిక రాబడులు
సాక్షి, హన్మకొండ: స్టాక్ మార్కెట్లో రిస్క్‌తో పాటు రాబడులు అధికంగా ఉంటాయని, అం దువల్ల అధిక రాబడుల కోసం షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) రీజనల్ మేనేజర్ వెనిశెట్టి శివప్రసాద్ అన్నారు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, సీడీఎస్ఎల్ సహకారంతో సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ స్టాక్మార్కెట్లో పెట్టుబడుల్లో రిస్క్ ఉందని, ప్రతీ వ్యక్తి తన వయసు ఆధారంగా రిస్క్ తీసుకోవాలని సూచించారు. తక్కువ వయసున్న వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చన్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే నిత్యం మార్కెట్ పోకడలను గమనిస్తూ ఉండాలని హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్స్, విజయవాడ బ్రాంచ్‌మేనేజర్ పద్మనాభముని అన్నారు. అదేవిధంగా షేర్ల క్రయవిక్రయాల్లో సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం కీలకమన్నారు. కంపెనీ వ్యాపారం, నిర్వహణ సామర్థ్యం, మార్కెట్ వ్యాల్యూ ( బిజినెస్, మేనేజ్మెంట్) వంటి చెక్పాయింట్ల ఆధారంగా షేర్లను కొనుగోలు చేయాలని హెచ్డీఎఫ్సీ సౌత్ రీజనల్ హెడ్, డీవీ సునీల్‌రెడ్డి సూచించారు. సదస్సులో స్టాక్ మార్కెట్‌కు సంబంధించి డీ మ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర అంశాల గురించి ఔత్సాహిక మదుపరులకు నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. సదస్సుకు వచ్చిన మదుపుదారులు పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.