
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ. 13,756 కోట్లకు చేరాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 10,674 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. 2019–20లో భారత్‌లో విక్రయాలపై యాపిల్ నికర లాభం రూ. 926 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 262 కోట్లు. భారత ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్లో శాంసంగ్, వన్‌ప్లస్ వంటి సంస్థలకు మరింత గట్టి పోటీనివ్వడంపై యాపిల్ దృష్టి పెడుతోన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా భారత్‌లోనే ఐఫోన్ 11 ఫోన్ల అసెంబ్లింగ్‌ను మొదలుపెట్టింది. ఈమధ్యే దేశీయంగా తమ తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ స్టోర్‌కి మంచి స్పందన లభించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల పేర్కొన్నారు. కొత్త ఐఫోన్ 12కి ప్రి–ఆర్డర్లు వెల్లువెత్తడమూ కంపెనీకి లాభించినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి.
చదవండి: ఐఫోన్13 ఫీచర్లు హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment