
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) యూఎస్‌లోని చిట్టచివరి షేల్ గ్యాస్ ఆస్తులను సైతం విక్రయిస్తోంది. ఇందుకు వీలుగా డెలావేర్ కంపెనీ ఎన్‌సైన్ ఆపరేటింగ్–3 ఎల్‌ఎల్‌సీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు.
అనుబంధ సంస్థ రిలయన్స్ ఈగిల్‌ఫోర్డ్ అప్‌స్ట్రీమ్ హోల్డిం గ్‌కు చెందిన షేల్ గ్యాస్ ఆస్తులను విక్రయించేందుకు డెలావేర్ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆర్‌ఐఎల్ పేర్కొంది. దీంతో యూఎస్‌లోని మొత్తం షేల్ గ్యాస్ ఆస్తుల నుంచి తప్పుకున్నట్లేనని ఆర్‌ఐఎల్ పేర్కొంది. తద్వారా ఉత్తర అమెరికా షేల్ గ్యాస్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు తెలియజేసింది. 2010– 2013 మధ్య కాలంలో మూడు భాగస్వామ్య సంస్థలలో ఆర్‌ఐఎల్ వాటాలు కొనుగోలు చేసింది.