![Andhra Pradesh Govt Issues Guidelines To Theatres For Selling Movie Ticket - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/3/online-Tickett.jpg.webp?itok=VbctfFr0)
సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్‌డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలి.
అన్ని థియేటర్లు,ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి. విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం మాత్రం సర్వీస్ చార్జీ వసూలు చేయాలి. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలి. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మకాలు జరపాలి.
చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి
Comments
Please login to add a commentAdd a comment