హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరోక్షంగా అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు. తాను సీఎంగా ఉన్నంతవరకు ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉందని ఖరాఖండీగా చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఛాంజర్ స్వాగతించగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా స్వాగతించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ఏ సినిమాలకు బెనిఫిట్ షో ఉండవని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం హర్షాదాయకం. ఈ నిర్ణయంపై సగటు ప్రేక్షకులు, పరిశ్రమను నమ్ముకున్న ఎందరో తమ సంతోషం వ్యక్తపరిచారు. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ కూడా ఈ నిర్ణయం ఎంతో సంతోషం కలిగించింది. ఇన్నేళ్లు అధికారంలోని ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల థియేటర్లుకు వచ్చే ప్రేక్షకులు తగ్గారు. ఇప్పుడు ఈ నిర్ణయం వలన సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు కుటుంబ సభ్యులతో సంతోషంగా వస్తారు.
అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని చలనచిత్ర పరిశ్రమ ఉనికిని కాపాడాలి. ఒక కుటుంబం.. సినిమా అనే వినోదాన్ని సగటు ధరలను చెల్లించి చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి సినిమాకు రేట్స్ పెంచే విధానానికి స్వస్తి పలకాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా కొన్ని మార్గదర్శకాలు నిర్ధేశించుటకు.. నిపుణుల కమిటీని నియమిచి అ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కేతిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment