welcome
-
ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకోవాలి: కేతిరెడ్డి
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరోక్షంగా అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు. తాను సీఎంగా ఉన్నంతవరకు ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉందని ఖరాఖండీగా చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఛాంజర్ స్వాగతించగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా స్వాగతించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.ఏ సినిమాలకు బెనిఫిట్ షో ఉండవని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం హర్షాదాయకం. ఈ నిర్ణయంపై సగటు ప్రేక్షకులు, పరిశ్రమను నమ్ముకున్న ఎందరో తమ సంతోషం వ్యక్తపరిచారు. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ కూడా ఈ నిర్ణయం ఎంతో సంతోషం కలిగించింది. ఇన్నేళ్లు అధికారంలోని ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల థియేటర్లుకు వచ్చే ప్రేక్షకులు తగ్గారు. ఇప్పుడు ఈ నిర్ణయం వలన సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు కుటుంబ సభ్యులతో సంతోషంగా వస్తారు.అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని చలనచిత్ర పరిశ్రమ ఉనికిని కాపాడాలి. ఒక కుటుంబం.. సినిమా అనే వినోదాన్ని సగటు ధరలను చెల్లించి చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి సినిమాకు రేట్స్ పెంచే విధానానికి స్వస్తి పలకాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా కొన్ని మార్గదర్శకాలు నిర్ధేశించుటకు.. నిపుణుల కమిటీని నియమిచి అ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కేతిరెడ్డి కోరారు. -
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, ప్రియాంక!
కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. అమ్రోహా, సంభాల్, బులంద్‌షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది. -
ఖతార్‌లో ఎనిమిదిమంది భారతీయుల మరణశిక్ష రద్దు!
భారత్ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులు విడుదలయ్యారు. దీనిపై భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎనిమిది మంది భారతీయుల్లో ఏడుగురు భారత్‌కు తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లు దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్‌లో పనిచేశారు. గూఢచర్యం ఆరోపణలపై 2022, ఆగస్టులో వీరు అరెస్టయ్యారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ ఖతార్ సైనిక దళాలకు, ఇతర భద్రతా సంస్థలకు శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంది. ఏడాదికి పైగా జైలు జీవితం గడిపిన అనంతరం ఈ మాజీ మెరైన్లకు ఖతార్‌లోని దిగువ కోర్టు గత ఏడాది అక్టోబర్‌లో మరణశిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం భారత్‌కు ఇవ్వలేదు. దీంతో ఈ నిర్ణయంపై భారత్ అప్పీల్ చేసింది. #WATCH | Delhi: Qatar released the eight Indian ex-Navy veterans who were in its custody; seven of them have returned to India. pic.twitter.com/yuYVx5N8zR — ANI (@ANI) February 12, 2024 దీనిపై విచారణ జరిగిన నేపధ్యంలో ఆ ఎనిమిది మంది అధికారుల మరణశిక్షను ఖతార్ రద్దు చేసింది. ఈ విధంగా భారతదేశం దౌత్యపరంగా మరో విజయం సాధించింది. దుబాయ్‌లో జరిగిన కాప్-28 కాన్ఫరెన్స్‌లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల గురించి అమీర్‌తో మాట్లాడారు. #WATCH | Delhi: One of the Navy veterans who returned from Qatar says, "We are very happy that we are back in India, safely. Definitely, we would like to thank PM Modi, as this was only possible because of his personal intervention..." pic.twitter.com/iICC1p7YZr — ANI (@ANI) February 12, 2024 ఖతార్ అదుపులో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్‌పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ డిసెంబర్ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత్ వారి విడుదలకు విశేష కృషి చేసింది. అవన్నీ ఫలించి ఈరోజు వారు స్వదేశానికి చేరుకోవటంతో భారత్‌కు దౌత్యపరంగా గొప్ప విజయం లభించినట్లయింది. -
2024.. దునియాలో కొత్తగా జరగనుంది?
కొత్త సంవత్సరం వచ్చేసింది... 2024లో మనలో చాలా మంది కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారు. 2024 సంవత్సరంలో మనమంతా పలు ఆవిష్కరణలను చూడబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియోని మనం చూడబోతున్నాం. అదే సమయంలో పోషకాహార లోపాన్ని తొలగించగల దివ్య ఔషధం మన ముందుకు రాబోతోంది. చర్చిలో మహిళా మతాధికారులు కాథలిక్కులు మహిళలను మతాధికారులుగా నియమించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే 2024లో ‘కానన్ లా’లో మార్పు రానుంది. కాథలిక్ చర్చిలు ఈ చట్టం ప్రకారం నడుచుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో కాథలిక్ నియమాలలో పలు సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి. పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధం బిల్ గేట్స్ ఫౌండేషన్ పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధాన్ని తీసుకురానుంది. పోషకాహార లోపాన్ని నివారించే ఔషధంపై స్టేజ్-3 ట్రయల్ జరుగుతోంది. 2024లో ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందింది. ఈ ఔషధం వల్ల భారతదేశానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చంద్రునిపైకి నలుగురు మానవులు 2024లో ‘నాసా’ నలుగురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపనుంది. 1972లో అపోలో-17 మిషన్‌లో ‘నాసా’ ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపింది. 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రునిపైకి మనుషులను పంపుతోంది. అందుబాటులోకి సూపర్ కంప్యూటర్ యూరప్ తన మొదటి ఎక్సా-స్కేల్ సూపర్ కంప్యూటర్ 2024లో అందుబాటులోకి రానుంది. జర్మనీలోని జూలిచ్‌లోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ సూపర్‌కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్ కంప్యూటర్ మెరుపువేగంతో పనిచేయనుంది. అతిపెద్ద వ్యోమనౌక అతిపెద్ద అంతరిక్ష నౌక క్లిప్పర్ మిషన్ నిర్మితం కానుంది. ఈ వ్యోమనౌక బరువు ఇంధనం లేనపుడు 3241 కిలోలు ఉంటుంది. ఈ వ్యోమనౌక పొడవు బాస్కెట్‌బాల్ కోర్ట్ అంటే 30 మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. జూపిటర్ మిషన్ కోసం సిద్ధం చేసిన ఈ అంతరిక్ష నౌకలో 24 ఇంజన్లు ఉంటాయి. మూడవసారి పారిస్‌లో ఒలింపిక్స్ 2024లో పారిస్‌లో మూడవసారి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగిన ఏకైక నగరం లండన్. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు దాదాపు రూ.76 వేల కోట్లు ఖర్చు కానుంది. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో 2024లో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకానుంది. ఈ స్పేస్ స్టూడియో పేరు ఎస్ఈఈ-1. డిసెంబర్ 2024 నాటికి ఈ స్టూడియో సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్టూడియో సాయంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించనున్నారు. ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు -
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క!
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ములుగు జిల్లా ప్రారంభమయ్యే తొలి గ్రామం మహ్మద్‌గౌస్‌పల్లి నుంచి విజయోత్సవ ర్యాలీ మొదలైంది. ఇక్కడ కార్యకర్తలు మంత్రిని గజమాలతో సన్మానించారు. ర్యాలీ మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, జవహర్‌నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, పస్రా మీదుగా మేడారం వరకు కొనసాగింది. మహ్మద్‌గౌస్‌పల్లిలో గజమాలతో స్వాగతం గట్టమ్మకు చీర సారె.. గట్టమ్మ ఆలయం వద్ద మంత్రికి మహిళలు కోలాటాలు, బంజార, ఆదివాసీ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె గట్టమ్మ తల్లికి చీరసారె, పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి ప్రచార రథంలో ములుగు వరకు ర్యాలీగా వచ్చారు. మంత్రి పర్యటనకు ఎస్పీ గాష్‌ఆలం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కూచన రవళిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బానోత్ రవిచందర్, వంగ రవియాదవ్‌తోపాటు అధికార ప్రతినిధి అహ్మద్‌పాషా, సీనియర్ నాయకుడు బాధం ప్రవీణ్ కుమార్, ఒజ్జల కుమార్, ఇమ్మడి రాజుయాదవ్, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, రేవంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. ర్యాలీ సందర్భంగా మల్లంపల్లి, ములుగులో సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం నా ఇల్లు.. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా ఉండలేదని, అధికారం ఉందనే భావనను మరిచి ప్రజల మధ్యలో ఉండి వారికి సేవ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నా ములుగు ఆడబిడ్డగా, ఆత్మీయ సోదరిగానే ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకుసాగుతానన్నారు. సమ్మక్కకు మొక్కుతున్న మంత్రి సీతక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని పార్టీ ప్రజా ప్రతినిధులను కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ, ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమక్క–సారలమ్మలను దర్శించుకున్న తర్వాత ఐటీడీఏ అతిథి గృహంలో మేడారం జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవి కూడా చదవండి: పాలనలో మార్పు చూపిస్తాం! : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు -
ఇండిగో విమానంలో ‘నేషనల్ హీరో’: ఎయిర్ హోస్టెస్ చేసిన పనికి...
ISRO Chief S Somanath: చంద్రయాన్ -3 సక్స్‌స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లను ప్రశంసలను దక్కించుకుంటున్నారు. చందమామ దక్షిణ ధృవంపై కాలిడిన తొలి దేశంగా భారత్న తన ప్రత్యేకతను చాటుకుంది. ఆగష్టు 23, చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ చంద్రుడి పరితలంపై ల్యాండ్ అయ్యి కొత్త చరితను లిఖించింది. చంద్రయాన్ -3 లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూయడ్ రికార్డు దక్కించుకుందనే ఈ ప్రాజెక్ట్‌పై గ్లోబల్‌గా ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశీయ విమానంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. వివరాలను పరిశీలిస్తే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇండిగో విమానంలో పయనించారు. ఆయన విమానం ఎక్కగానే ఇండిగో సిబ్బంది,ప్రయాణీకుల నుండి అనూహ్యంగా ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా సోమనాథ్‌ను గుర్తుపట్టిన ఎయిర్ హోస్టెస్ నేషనల్ హీరోకి వెల్కం.. అందరూ ఆయనను ఆహ్వానించండి అంటూ గర్వంగా ప్రకటించింది. దీంతో ప్రయాణికులందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఇంతలో మరో ఫ్లైట్ ఎటెండెంట్ గూడీస్‌తో ఆయనను సత్కరించింది. ఈ విషయాన్ని పూజా షా తన సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఇస్రో బృందాన్ని స్వాగతించే అవకాశం లభించినందుకు గర్విస్తున్నామంటూ ఆమె ఇన్‌స్టాలో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈసందర్భంగా ఇస్రో టీంకు అభినందనలు తెలిపారు నెటిజన్లు. అలాగే అంతటి గొప్ప వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఉన్నారుఅంటూ కొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pooja Shah (@freebird_pooja) -
‘మేధావి’కి ఘన స్వాగతం
చెన్నై: ప్రపంచకప్ చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. ప్రతిష్టాత్మక చదరంగ వేదికపై తనదైన ముద్ర వేసి తిరిగొచ్చిన ఈ 18 ఏళ్ల కుర్రాడిని సొంత నగరం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. అతనికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒకవైపు ఆత్మీయులు, సన్నిహితులు ఆనందంగా తమవాడికి వెల్కమ్ చెప్పగా, మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సాంప్రదాయ నృత్యాలు కరగట్టం, ఒయిలట్టంలతో విమానాశ్రయం బయట కళాకారులు ప్రజ్ఞానందకు స్వాగతం పలికారు. పూలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో మిత్రులు, అభిమానులు ప్రజ్ఞను ముంచెత్తారు. ‘నాకు లభించిన ఈ స్వాగతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ జాతీయ పతాకాన్ని చేతిలో ప్రదర్శిస్తూ ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. అతని తల్లి నాగలక్ష్మి కూడా తన ఆనందాన్ని దాచుకోలేకపోయింది. అనంతరం ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేశ్‌బాబులను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందకు జ్ఞాపికతోపాటు రూ. 30 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. -
ప్రపంచమంతా ఆ కుతూహలంతో ఉంది: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఇది బుద్ధుడు, గాంధీ లాంటి మహానుభావులు నడయాడిన నేల. శత్రువుల్ని సైతం చేరదీసే తత్వం మనది. అందుకే ‘భారత్ అసలు ఏమనుకుంటుందో?’ అని తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రపంచం ఇప్పుడు ఉంటోంది అని అన్నారు ప్రధాన మంత్రి నరేద్ర మోదీ. గురువారం ఉదయం ఢిల్లీ పాలం(ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) వద్ద బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన ప్రసంగించారు. మూడు రోజల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నేటి(గురువారం) ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా పాలం విమానాశ్రయం(దేశీయ) వద్దకు భారీగా బీజేపీ శ్రేణులు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికాయి. భారీ గజమాలతో మోదీని సత్కరించాయి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు ప్రసంగించారు. ప్రధాని మోదీ ఏమన్నారంటే.. తమిళం మన భాష. ప్రతీ భారతీయుడి భాష. ప్రపంచంలోనే పురాతనమైంది తమిళం. అలాంటిది పాపువా న్యూ గినియాలో టోక్ పిసిన్ తర్జుమా పుస్తకం ‘తిరుక్కురల్’ను ఆవిష్కరించే అవకాశం నాకు దక్కింది. నేను నా దేశ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు, నేను ప్రపంచం కళ్ళలోకి చూస్తాను. మీరు దేశంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున ఈ విశ్వాసం వచ్చింది. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్లు మోదీ మీద అభిమానంతో రావట్లేదు.. భారత్ మీద ప్రేమతో వస్తున్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లను ఎందుకు పంచాలో చెప్పాలంటూ కొందరు నిలదీస్తున్నారు. ఇది బుద్ధుడు, గాంధీ నడయాడిన నేల. శత్రువులను సైతం చేరదీసే తత్వం మనది. భారత్ అసలు ఏమనుకుంటుందో? అని తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రపంచం ఇప్పుడు ఉంటోంది. #WATCH | Tamil language is our language. It is the language of every Indian. It is the oldest language in the world. I had the opportunity to release the Tok Pisin translation of the book 'Thirukkural' in Papua New Guinea: PM Modi pic.twitter.com/GqyyHWBZEs — ANI (@ANI) May 25, 2023 మనదేశ సంస్కృతి, సంప్రదాయం గురించి మాట్లాడేటప్పుడు, బానిస మనస్తత్వంలో ఎప్పుడూ మునిగిపోవద్దు. ధైర్యంగా మాట్లాడాలని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచం ఆ గొప్ప విషయాలను వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది. మా పుణ్యక్షేత్రాలపై దాడి ఆమోదయోగ్యం కాదని నేను చెప్పిన సమయంలో.. ప్రపంచం నాతో ఏకీభవిస్తూ వస్తోంది. సిడ్నీలో జరిగిన భారతీయ ప్రవాసుల కార్యక్రమానికి.. ఆస్ట్రేలియా ప్రధాని మాత్రమే కాకుండా మాజీ ప్రధాని, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, అధికార పక్షం కూడా హాజరైంది. ఇదే ప్రజాస్వామ్య బలం. వాళ్లంతా మన కమ్యూనిటీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదీ మనకు దక్కిన గౌరవం. జేపీ నడ్డా ఏమన్నారంటే.. పాపువా న్యూ గినియా ప్రధాని మీ పాదాలను తాకిన తీరు.. మీకు అక్కడ ఎంత గౌరవం ఉందో తెలియజేస్తుంది. మన ప్రధానికి ఇలా స్వాగతం దక్కడంపై ఇక్కడి ప్రజలు గర్వపడుతున్నారు. మీ పాలనా నమూనాను ప్రపంచం మెచ్చుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మీ ఆటోగ్రాఫ్ అడిగారు. మీ నాయకత్వంలో భారత్‌ను ప్రపంచం ఎలా చూస్తుందో ఇక్కడే తెలిసిపోతోంది. "The way the PM of Papua New Guinea touched your feet, it shows how much respect you have there. People of India feel proud when they see that our PM is being welcomed like this," says BJP national president JP Nadda as he welcomes PM Modi at Palam airport pic.twitter.com/6eVFWKRzee — ANI (@ANI) May 25, 2023 జైశంకర్ ఏమన్నారంటే.. పాపువా న్యూ గినియా ప్రధాని, మన ప్రధాని మోదీని ‘విశ్వ గురువు’గా భావిస్తున్నానని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని అయితే ఏకంగా మన ప్రధానిని ‘ది బాస్’ అని సంబోధించారు. ప్రధాని మోదీ నాయకత్వం వల్లే ఈరోజు ప్రపంచం కొత్త భారతదేశాన్ని చూస్తోంది. -
మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని
ఫసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూగినియాలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరాపే.. మోదీని ఆలింగనం చేసుకుంటూ.. ఆయన పాదాలను తాకుతూ స్వాగతించారు. వాస్తవానికి పాపువా న్యూగినియాలో సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత దేశంలోకి వచ్చే ఏ నాయకుడికి ఉత్సవ స్వాగతం ఇవ్వదు. కానీ మోదీ కోసం ఆ సెంటిమెంట్‌ను పక్కనపెట్టారు. అక్కడి కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటలకు చేరకున్న ప్రధాని మోదీకి మాత్రం మినహయింపు ఇచ్చింది. అంతేగాదు పసిఫిక్ ద్వీప దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని అయిన మోదీకి న్యూగినియా ప్రధానిచే విశేష స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ఇతర ప్రముఖులను కలిసేందుకు వెళ్లేముందు కూడా మరాపే మోదీని మరోసారి ఆలింగనం చేసుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్టర్ వేదికగా..నేను పాపువా న్యూగినియా చేరుకున్నాను. విమానాశ్రయంలో నన్ను స్వాగతించినందుకు ప్రధాని జేమ్స్ మరాప్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు స్వాగతం పలికేందుకు ఆయన చేసిన ప్రత్యేక అభివాదాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా పర్యటన సందర్భంగా ఈ దేశంతో భారత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. న్యూగినియాలో మోదీకి 19 తుపాకులు గౌరవ వందనం, లాంఛనప్రాయం స్వాగతం గార్డ్ ఆఫ్ హానర్ తోసహా ప్రధాని జేమ్స్ మరాపే చేసిన ప్రత్యేక అభివాదాన్ని స్వీకరించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇదిలా ఉండగా, ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి-FIPIC) మూడో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆదివారం న్యూగినియా చేరుకున్నారు మోదీకి. సోమవారం ఈ శిఖరాగ్ర సమావేశాంలో నరేంద్ర మోదీ, జేమ్స్ మరాపే ఆతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడం తోపాటు పాపువా న్యూగినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో భేటీ కానున్నారు మోదీ. అదీగాక సోమవారం నాటి చర్చల్లో వాతావరణ మార్పులు, అభివృద్ధిపైన ఎక్కువగా దృష్టిసారించనున్నట్లు సమాచారం. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యమిచ్చింది. కాగా, అంతకుమునుపే మోదీ ఈ శిఖరాగ్ర సమావేశానికి హజరయ్యేందుకు 14 పసిఫిక్ ద్వీప దేశాలు(పీఐసీ) ఆహ్వానాన్ని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ ఫిజి పర్యటన సందర్భంగా ప్రారంభించిన ఎఫ్ఐపీఐసీ సదస్సులో మొత్తం 14 దేశాల నాయకులు పాల్గొంటారు. (చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!) -
రామ్ చరణ్‌కు ప్రభుదేవా బిగ్ సర్ప్రైజ్.. అదేంటంటే!
ఆస్కార్ వేడుకలు ముగించుకున్న రామ్ చరణ్ ఇటీవలే అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ ఇంటికి కూడా చేరుకున్నారు. ఆయన తదుపరి చిత్రంలో శంకర్ దర్శకత్వంలో పనిచేయనున్నారు. తాత్కాలికంగా ఈ సినిమాకు ఆర్సీ15 అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన చెర్రీకి ఘనస్వాగతం లభించింది. ప్రభుదేవా ఆధ్వర్యంలోని ఆర్సీ15 చిత్రబృందం నాటు నాటు స్టెప్పులతో వెల్కమ్ చెప్పింది. అ తర్వాత రామ్ చరణ్‌ను పూలమాలతో సత్కరించింది. (ఇది చదవండి: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ప్రముఖ నటి కూతురు, ఫోటో వైరల్) దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. రామ్ చరమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.' ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పలేను. నాకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్సీ15 షూటింగ్‌కి తిరిగి వచ్చినందుకు చాలా గొప్పగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించింది. స్వీటెస్ట్ వెల్కమ్ అంటూ కామెంట్ చేసింది. కాగా.. ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. కాగా.. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న RC15 పొలిటికల్ యాక్షన్ డ్రామాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, జయరామ్, అంజలి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
నాడు బహిష్కరణ.. నేడు కాళ్లు కడిగి.. పూలు చల్లి.. బ్రహ్మరథం
కావలి(నెల్లూరు జిల్లా): అది 2019 ఎన్నికల ప్రచార సమయం. వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరు మండలం ఆదినారాయణపురం గ్రామానికి వెళ్లడానికి బయలుదేరారు. అయితే గ్రామస్తులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గ్రామంలోకి రానివ్వమని భీష్మించుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. ఎన్నికలయ్యాయి.. ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు, సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలు గ్రామస్తులకు అందుతున్నాయి. ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి సొంత మండలంలోని ఆదినారాయణపురంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవసరమైన సేవలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చూపించారు. మత్స్యకార గ్రామమైన ఆదినారాయణపురం గ్రామస్తులంతా ఒక కట్టుబాటుతో ఉంటారు. దశాబ్దాలుగా తరతరాలుగా ఎన్నికల సమయంలో తమకు మేలు చేకూర్చిన వారికే మద్దతుగా ఉండడం వారి కుల కట్టుబాటు. ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని, ఆ పార్టీ నేతలను ఊరిలోకి రాన్వికపోయినా.. ఇప్పుడు ప్రభుత్వ పథకాలను అందించడం, తమకు అండగా నిలబడడంతో గ్రామస్తులు మంత్రముగ్ధులయ్యారు. ఎమ్మెల్యే ఇవన్నీ వద్దని వారించినా గ్రామస్తులు తాము చేయాలనుకున్న సత్కారం చేసి తీరుతామని మొండికేసి.. పూలు చల్లి పసుపు నీళ్లతో కాళ్లు కడిగి, హారతులు ఇచ్చారు. ఆదివారం ఆ గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గ్రామంలో పురుషులు ఈలలు, కేరింతలతో స్వాగతం చెప్పి అక్కున చేర్చుకున్నారు. మహిళలు అయితే పసుపు నీళ్లతో ఎమ్మెల్యే కాళ్లు కడిగి, పూలు చల్లి హారతులు ఇచ్చారు. నాడు బహిష్కరించిన గ్రామస్తులే.. నేడు బ్రహ్మరథం పట్టడంతో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి -
భారత రాష్ట్రపతి స్వాగతం కోసం స్వయంగా బ్రిటన్ రాణి
క్వీన్ ఎలిజబెత్-2 జీవితం.. బ్రిటన్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం గుర్తుంచుకోదగిన ఒక అధ్యాయం. సుదీర్ఘకాలంగా ఒక రాజ్యాన్ని పాలించిన సామ్రాజ్ఞిగా ఆమె తనకంటూ ఓ చెరగని ముద్రవేసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు.. తన హయాంలో పలు దేశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారామె. అందులో భారత్ కూడా ఉండగా.. ఆ ఆదరాభిమానాలకు అద్దం పట్టిన ఘటనే ఇది.. క్వీన్ ఎలిజబెత్-2 ప్రయాణంలో భారత ఆధ్యాయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆమె భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఒకప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లండన్ పర్యటన సందర్భంగా స్వయంగా ఆమె కదిలివచ్చి స్వాగతం పలికారు. 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1963లో బ్రిటన్‌లో పర్యటించారు. ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, సంస్కరణల వాదిగా ఎంతో పేరున్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మునుపెన్నడూ లేనంతగా బ్రిటన్‌లో రాయల్ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్-2 స్వయంగా విక్టోరియా రైల్వే స్టేషన్‌కు వచ్చి సర్వేపల్లికి స్వాగతం పలికింది. తనతో పాటు ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్‌ను కూడా స్టేషన్‌కు తోడ్కోని వచ్చింది. ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్లను పరిచయం చేసిన రాణి(photo credit : BFI) రాజకుటుంబ ప్రముఖులతో పాటు, దేశంలోని అత్యున్నత సైన్యాధికారులు వెంట రాగా సర్వేపల్లిని జాతీయ గీతం జనగణమన ఆలాపనతో రాజమర్యాదలు చేసి తన వెంట తీసుకెళ్లారు రాణి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మొత్తం 11 రోజుల పాటు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. బ్రిటన్ సాధనసంపత్తికి అద్దం పట్టే పరిశ్రమలు, భవనాలు, వంతెనలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో సర్వేపల్లి పర్యటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటి బ్రిటన్ సాంప్రదాయ గుర్రపు పందాలను చూడడానికి వచ్చినప్పుడు రాణి ఎలిజబెత్ స్వయంగా వెంట వచ్చారు. నాటి రాష్ట్రపతి సర్వేపల్లికి రాణి ఎలిజబెత్ ఆహ్వానం(photo credit : BFI) నాటి వీడియోలో ఎలిజబెత్ ఎంతో హుందాగా, మరెంతో అందంగా కనిపించారు. వీడియోలో మూడు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు బ్రిటీష్ వస్త్రధారణలో రాణి కనిపించగా, చాలా మంది భారతీయ మహిళలు ఆనాటి సంప్రదాయ చీరలో కనిపించారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎలిజబెత్ కన్నుమూసిన సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వీడియో నాటి చరిత్రను కళ్ల ముందుంచింది. కర్టెసీ : BFI (బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఆర్కైవ్ నుంచి సేకరించిన వీడియో ఆధారంగా) -
వెల్కం బ్యాక్ ఇండియన్ ట్రావెలర్స్.. ఆకట్టుకుంటున్న ఎస్ఎఫ్వో వీడియో
కరోనా దుర్దినాలు వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయాయి. ఎప్పుడైనా పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు ప్రారంభమైనా కొత్తగా కోవిడ్ వేవ్ వచ్చి పడటంతో పూర్తి స్థాయిలో ప్రయాణాలు సాధ్యం కాలేదు. అయితే రెండేళ్ల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఎస్ఎఫ్వో) ఇండియన్ ట్రావెలర్స్‌కి స్వాగతం పలుకుతూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. భారతీయ అమెరికన్ సంస్కృతులను ప్రతిబింబించేలా ఎస్ఎఫ్వో ప్రత్యేకంగా వీడియో రూపొందించింది. ఇందులో నటులందరూ భారతీయ మువ్వెల జెండాతో స్వాగతం పలుకుతూ కనిపించారు. ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కెచప్‌కి బదులు సమోసా పూదీన చట్నీ, బేస్ బాల్ బదులు క్రికెట్, పీట్స్ కాఫీ బదులు ఛాయ్ ఇలా అన్నింటా భారతీయులకు అనుగుణంగా మార్పులు చేశామంటూ హృదయ పూర్వక స్వాగతం పలుకుతూ వీడియోను రూపొందించింది ఎస్ఎఫ్వో. After 2 years, India has resumed regular international flights. As a major gateway for travelers to and from India, SFO can't wait to welcome back Indian travelers!#WelcomeBack#flySFO ✈️#travel#sanfranciscotravel 🌉#sfowagbrigade pic.twitter.com/hq2nHPZjBM — San Francisco International Airport (SFO) ✈️😷 (@flySFO) April 6, 2022 -
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. విద్యానగర్‌లోని ఐటీసీ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఐటీసీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఐటీసీ పలు అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. అందులో ఒకటిగా గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు నగరంలో ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను నెలకొల్పడం ఆనందం కలిగిస్తోందని సీఎం చెప్పారు. ఐటీసీ భాగస్వామ్యంతో ముఖ్యంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు వెళ్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: AP: మిడిల్‌క్లాస్‌కి జాక్'ప్లాట్' -
అడుగులేద్దాం... ఆశే ఊపిరిగా
తుది మొదలు లేని నిరంతర ప్రవాహమైన కాలం అగణితం. కానీ, మానవ జిజ్ఞాస, ప్రయత్నం దేన్నీ ఊరకే వదలదు! అందుకే, ఊహా విభజన రేఖలు గీసి... సెకండ్లని, నిమిషాలని, రోజులని, వారాలని, నెలలని, సంవత్సరాలని కాలానికి కొలతలు వేస్తాడు. యుగాల పరిణామాలకు మౌన సాక్షీభూతమైన కాలాన్ని తానేదో ఒడిసిపట్టినట్టు మనిషి భ్రమిస్తాడు. ఓ యేడు సుఖం, సంతోషం ఎక్కువైతే ఆనందిస్తాడు, కష్టం, బాధ అధికమైతే దుఃఖించి, శపిస్తాడు. కాలపు తునకలన్నీ మనిషి గీసుకున్న ఊహా రేఖలని గ్రహించడు. అదే విభజన గడుల సంధి కాలంలో నిలుచున్న మనం పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతమంటున్నాం. సరే, అందులో తప్పేమీ లేదు. మంచి చెడుల గతాన్ని వదిలి, ఆశాజనక భవిష్యత్తులోకి అడుగిడే ప్రతి మలుపులో మనకో బుల్లి సమీక్ష, సత్సంకల్పం ఉండాలి. అలా ఉంటేనే ఒకింత జాగ్రత్తగా, కాస్త పద్ధతిగా, కొంచెం వ్యూహాత్మకంగా.... వీటన్నింటికీ మించి ఆనందంగా–ఆహ్లాదంగా ముందుకు సాగే ఆస్కారం ఉంటుంది. గడచిన ఏడాదిలో ఏమేమి అనుకొని ఏమేర సాధించాం? ఇంకేమి మిగిలాయి? అని ఆత్మావలోకనంతో సమీక్షించుకుంటే నష్టమేమీ లేదు. ఆశల అల్లికతో భవిష్యత్ ప్రణాళికా రచన నేరమేమి కాదు. అది ప్రతి 365 రోజులకొకమారు అయితే తప్పేంటి అన్నది హేతుబద్ధ యోచనే! 2021కి వీడ్కోలు చెబుతూ 2022 లోకి అడుగిడుతున్న శుభవేళ ఇది! కొత్త సంకల్పాలు తీసుకొని, వాటి సాధనకోసం పురోగమించాలి. దేశం యావత్తు ఓ ఆశావహ భావనతో భవితను చూస్తోంది. ప్రతి జనవరి ఒకటికీ చేసేది ఇదే అయినా.... మంచి–చెడుల గడుల పరిధి ఒక్కోమారు భిన్నంగా ఉండొచ్చు. ఏదీ తెలిసి జరుగదు. అన్నీ అధిగమించి ముందుకు సాగడం మానవనైజం. మానవేతి హాసంలోనే పెద్ద మహమ్మారిగా చెబుతున్న కరోనా సృష్టించిన విలయానికి గడచిన రెండు సంవత్సరాలు దూదిపింజల్లా కొట్టుకుపోయాయి. ఎన్నెన్ని కుటుంబాల్లో అది తీరని విషాదం నింపిందో, మరెన్ని మానవ హృదయాలను భయంతో కల్లోలపరిచిందో లెక్కే లేదు. మూడో సంవత్సరం ముంగిట్లోకి వచ్చిన మనకు... కొంచెం కష్టం, కొంచెం ఇష్టం అనిపించే సమాచారం అందుతోంది. వైరస్ కొత్త వైవిధ్యమైన ‘ఒమిక్రాన్’ వేగం వల్ల, గతవారం (22–29 డిసెంబరు) సగటున రోజూ 9 లక్షల కొత్త కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. మరోవైపు చిగురుటాశ ఏమంటే, పలు పరివర్తనాల వల్ల కొత్త వైవిధ్యమై వచ్చిన ఒమిక్రాన్ అంతగా ప్రమాదకారి కాదూ అని! భయంకర ‘మహమ్మారి’ కాస్తా ఆయా కాలాల్లో తరచూ వచ్చే సాంక్రమిక అంటు వ్యాధిలా పలుచబారిందని శాస్త్ర, వైద్యవర్గం చెప్పడం ఉన్నంతలో ఊరటనిచ్చే పరిణామం. ప్రపంచంలో ఒక బలీయ ఆర్థిక, మార్కెట్ శక్తిగా ఎదుగుతున్న భారత్ వివిధ విభాగాల్లో సాధిస్తున్న ప్రగతి, తాజా లక్ష్యాలు కొంత ఆశావహ వాతావరణం కల్పిస్తున్నాయి. పలు రంగాల్లో విజయాల సరళి కొత్త ఆశలు రేపుతోంది. విపత్తులూ కొన్ని అవకాశాలు కల్పిస్తాయనడానికి కోవిడ్–19 నిదర్శనం. టీకాల తయారీ నుంచి వైద్యారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవడం వరకు స్వావలంబనకు అరుదైన అవకాశం లభించింది. ఆ దిశలో అడుగులు పడుతున్నాయి. స్వాతంత్రానంతరం దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన వైద్యం, విద్య వంటి కీలకాంశాలను తగిన బడ్జెట్ కేటాయింపులతో, ప్రణాళికాబద్ధంగా తీసుకువెళితే మంచి ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. వైద్యం విషయంలో సర్కార్లు ఇపుడైనా, కరోనా దెబ్బతో ‘కాలికి తట్టుతగిలింది ఇక బట్టకట్టడం ఖాయం’ అనుకోవాలి. కేరళ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ వైద్యం, కొత్తగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్రామసచివాలయ స్థాయి వరకు వైద్యారోగ్య వ్యవస్థ విస్తరిస్తూ భరోసా కల్పిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. విద్యకు సంబంధించి ఎన్నో లోపాలు, వైఫల్యాల్ని నేడు క్షీణించిన క్షేత్ర పరిస్థితులు అడుగడుగునా ఎత్తి చూపిస్తున్నాయి. ప్రాథమిక, సెంకడరీ విద్య నుంచి ఉన్నత, సాంకేతిక విద్య వరకు... తాజా జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరచిన అంశాలతో కొత్త ఆశలు పల్లవి స్తున్నాయి. ప్రభుత్వ రంగంలో అలవిమాలిన అలక్ష్యంతో, ప్రయివేటు రంగంలో ఫక్తు వ్యాపారమై కునారిల్లిన భారత విద్యారంగం పూర్వపు వైభవోజ్వల దశను పుణికి పుచ్చుకుంటుందని ఆశిద్దాం. ఏపీలో ‘నాడు–నేడు’తో సర్కారు బడుల స్వరూప స్వభావాల్నే మారుస్తున్న తీరొక వేగుచుక్క! క్రీడా రంగంలో... ఇటీవలి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన ఏడు అథ్లెటిక్స్ పతకాలొక కొత్త ఆశారేఖ! క్రికెటొకటే క్రీడ కాదు, భారత్ కీర్తికిరీటాన్ని ధగధగలాడించే మట్టిలో మాణిక్యాలు ఆట ఆటలో ఉన్నాయని తేల్చి చెప్పే భవిష్యత్తు వైపు భారత యువతరం పరుగులు తీయాలి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. తగిన శిక్షణ, ఉద్యోగ, ఉపాధి, మేధోపరిణతి అవకాశాలు కల్పిస్తూ యువశక్తిని ఓ బలీయమైన మానవ వనరుగా తీర్చిదిద్దాలి. ప్రపంచం దృష్టి మనవైపు మళ్లేలా తగిన వ్యూహాలు, విధానాలు, కార్యాచరణ ఉంటే మనకిక తిరుగుండదు. ప్రపంచమంతా ఐటీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక పరిణామాలతో పురోగమిస్తున్న ఈ తరుణంలో విలువలు, నైతికత ప్రశ్నార్థకమౌతున్నాయి. గొప్ప సనాతన, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం ఉన్న దేశంగా ఆధునిక శాస్త్ర–సాంకేతిక పురోగతిని మేళ విస్తూ ముందుకు వెళితే భారత్ ఒక ప్రపంచ చోదక శక్తిగా నిలిచే అవకాశాలు పుష్కలం. ఈ క్రమంలో 2022 ఓ గొప్ప మేలుమలుపు కావాలని మనమంతా ఆశిద్దాం. ఆశే మనిషికి దిక్సూచి! -
ఎయిర్‌పోర్టులో కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. వైరల్ వీడియో..
ఇస్లామాబాద్: సాధారణంగా ఎవరైన మనవారు విదేశాల నుంచి వస్తే.. ఎయిర్‌పోర్టులో చేసే స్వాగత సత్కారాలు మాములుగా ఉండవు. కొందరు పూల బోకేలు ఇచ్చి స్వాగతం పలికితే.. మరికొందరు సర్ప్రైజ్ గిఫ్ట్‌లు, ఫ్లెక్సీలు, బ్యాండ్లను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొందరైతే తమ వారిని చూడగానే.. ఎమోషనల్‌గా ఫీలై వారిని ఆనందంతో గట్టిగా హత్తుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా వేరేదేశం నుంచి స్వస్థలానికి వచ్చిన.. ఒక తల్లి ఎయిర్‌పోర్టులో తనకు స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు పట్ల వెరైటీగా స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఘటన పాక్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. కాగా, అన్వర్ జలాని అనే వ్యక్తి ఎయిర్ పోర్టులో తన తల్లికోసం బోకే పట్లుకోని, మిస్‌యూ అమ్మ.. అంటూ ఫ్లకార్డు పట్టుకోని మరీ ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతని తల్లి బయటకు వచ్చింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు అన్వర్‌ను ఆ తల్లి చెప్పుతో చితక్కొట్టింది. ఆ తర్వాత.. ఎమోషనల్‌తో అతడిని హత్తుకుంది. దీన్ని అన్వర్ జిలానీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘ వావ్.. ఎంతలా మిస్ అయ్యిందో..’,‘ భలే.. కొట్టింది.. ఆ తల్లి..’, ‘నవ్వు ఆపుకోలేక పోతున్నాం..’, ‘నిన్ను ఇలా ఆశీర్వదించింది..’, ‘నీకు వెరైటీగా థైంక్స్ చెప్పిందంటూ..’ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anwar Jibawi (@anwar) -
మోదీకి ఘనస్వాగతం పలికిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా
-
PV Sindhu: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం
-
మోదీకా దమ్.. నమస్తే ట్రంప్!
-
250 కేజీల యాపిల్ దండతో..
సాక్షి, బెంగళూరు: తిహార్ జైలు నుంచి విడుదలై సొంత గడ్డకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు డీకే శివకుమార్‌కు ఘనస్వాగతం లభించింది. శనివారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కార్యకర్తలు పూల మాలలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 250 కేజీల యాపిల్ పండ్లతో తయారు చేసిన భారీ దండను క్రేన్ సహాయంతో గాల్లోకి లేపి ఆయనకు అలంకరించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి హల్చల్ చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కేపీసీసీ కార్యాలయం వరకు తీసుకెళ్లారు. అక్కడ తన మద్దతుదారులను ఉద్దేశించి శివకుమార్ ప్రసంగించారు. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సెప్టెంబర్ 3న ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో అదేరోజు సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. 57 ఏళ్ల శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందారు. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు బెంగళూరు రూరల్, రామనగర, మాండ్య ప్రాంతాల్లో గట్టి పట్టుంది. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రాంతాల్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన వారు ఆయనకు సంఘీభావంగా ర్యాలీలు, ధర్నాలు చేశారు. కర్ణాటక స్పెషల్ యాపిల్ దండ యాపిల్స్ స్వాగతం పలకడం కర్ణాటకలో ట్రెండ్‌గా మారింది. గతంలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామిలతో పాటు పలువురు అగ్రనేతలు భారీ యాపిల్ దండలతో స్వాగతాలు అందుకున్నారు. బాదం పప్పు దండలతో కూడా రాజకీయ నాయకులను స్వాగతించడం కన్నడిగులు మొదలుపెట్టారు. ఇదంతా చూసినవారు ఇదేం పిచ్చి అంటూ కామెంట్లు చేస్తుంటారు. -
బెయిల్‌పై నిందితులు.. మంత్రి ఘన స్వాగతం
రాంచీ : ఓ వైపు కేంద్రం నకిలీ వార్తలు, వదంతుల వల్ల దేశంలో పెరిగిపోతున్న హింసను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే... మరోవైపు స్వయంగా అధికార పార్టీ నేతలే హింసాత్మక చర్యలకు పాల్పడిన వారికి ఘనస్వాగతం పలకడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో ఓ ముస్లిం వ్యక్తిని చంపి జైలుకెళ్లి, ఆపై బెయిల్‌పై వచ్చిన వారికి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఆ వివరాలిలా.. గో మాంసం అమ్ముతున్నాడనే నేపంతో గతేడాది జూన్ 29న జార్ఖండ్ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్ అన్సారీ(40) అనే వ్యక్తిపై 12 మంది దాడి చేశారు. ఈ దాడిలో అన్సారీని తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. మరొకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోంకు తరలించింది. శిక్ష పడిన వారిలో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నారు. అయితే కోర్టు తీర్పును జయంత్ సిన్హా వ్యతిరేకించారు. కేసును మరోసారి సమీక్షించాలని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు వీరిలో 8 మందికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సిన్హా తన ఇంటి వద్ద వీరికోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెయిల్ మీద వచ్చిన వారికి స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడమే కాక వారిని పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మేల్యే శంకర్ చౌదరీ ‘మీ ఎనిమిది మంది తరుపున వాదించి, మీకు బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్ బీబీ త్రిపాథికి మీరు కృతజ్ఞతలు తెలపాలి. అతను మీ పాలిట దేవుడు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా జయంత్ సిన్హా ఎన్నికైంది కూడా రాంఘడ్ నియోజక వర్గం నుంచే కావడం గమనార్హం. -
ట్రంప్‌కు చైనా ఘన స్వాగతం
బీజింగ్: ఆసియా పర్యటనలో భాగంగా చైనా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం లభించింది. బుధవారం బీజింగ్ విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు చైనా అధికార పార్టీ నాయకులు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలకగా, చైనా ఆర్మీ గౌరవ వందనం సమర్పించింది. ఆ తరువాత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ట్రంప్ దంపతులకు చారిత్రక ‘ఫర్బిడెన్ సిటీ’ ప్యాలెస్‌లో ఆతిథ్యమిచ్చారు. అక్కడికి చేరుకున్న ట్రంప్ దంపతులకు జిన్‌పింగ్ దంపతులు స్వాగతం పలికారు. ట్రంప్ దంపతుల గౌరవార్థం చైనా సాంస్కృతిక కార్యక్రమం పెకింగ్ ఒపేరా నిర్వహించారు. చైనా గణతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుంచి ఏ విదేశీ అధ్యక్షుడికి కూడా ఈ చారిత్రక ప్యాలెస్‌లో ఇలాంటి గౌరవం దక్కలేదని సీఎన్ఎన్ పేర్కొంది. గురువారం ట్రంప్ జిన్‌పింగ్‌తో అధికారికంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా వారు ఉ.కొరియా అణు ముప్పు, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై చర్చలు జరిపే అవకాశముంది. చైనా అధికారిక భాష మాండరిన్లో ప్రావీణ్యం సంపాదించిన ఇవాంకా, కుష్నర్‌ల ఆరేళ్ల కూతురు అరబెల్లాకు జిన్‌పింగ్ ఏ గ్రేడ్ ఇచ్చారు. తన మనవరాలు అరబెల్లా మాండరిన్లో పాట పాడుతున్న ఓ వీడియోను ట్రంప్ జిన్‌పింగ్‌కు చూపారు. తమ భాషపై పట్టు సాధించిన అరబెల్లాను చైనా అధ్యక్షుడు ప్రశంసించారు. -
బీఎస్ఎన్ఎల్ ‘వెల్కమ్’ ఆఫర్
అనంతపురం రూరల్ : బీఎస్ఎన్ఎల్ సిమ్ కొనుగోలు చేసే వినియోగదారులకు సంస్థ వెల్కమ్ ఆఫర్ కింద 350 ఎంబీ 3జీ డేటాను అందిస్తున్నట్లు సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ మంగళవారం నుంచి ఆగస్టు 28 వరకు వర్తిస్తుందన్నారు. అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
గవర్నర్‌కు ఘన స్వాగతం
అనంతపురం న్యూసిటీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం అనంతపురం చేరుకున్నారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, మేయర్ స్వరూప, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు, జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్దీన్‌లు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్‌కు మేయర్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. కాసేపటికి మంత్రి పరిటాల సునీత గవర్నర్‌కు పుష్పగుచ్చానందించారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నేటి పర్యటనిలా.. గవర్నర్ నరసింహన్ మంగళవారం గార్లదిన్నె మండలం ముకుందాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 నుంచి ‘పంట సంజీవని’ ఫారంపాండ్ పనులను పరిశీలిస్తారు. 10 నుంచి 10.30 గంటల వరకు మల్చింగ్ పద్ధతిలో సాగుచేసిన పంటలను పరిశీలిస్తారు. 10.30 నుంచి 11 గంటల వరకు బిందు, తుంపర సేద్యం ద్వారా వినూత్నంగా సాగు చేసిన పండ్ల తోటలను సందర్శిస్తారు. 11 నుంచి 11.45 గంటల వరకు గార్లదిన్నెలో భూగర్భ జలాలను కొలిచే ఫిజో మీటర్లను పరిశీలిస్తారు. 11.45 గంటలకు గార్లదిన్నె నుంచి అనంతపురం బయలుదేరుతారు. 12 గంటలకు ఆర్అండ్బీ అతిథి గృహం చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌కు బయలుదేరుతారు.