నూతన జిల్లాలను స్వాగతిస్తున్నాం | welcome to new distritcs | Sakshi
Sakshi News home page

నూతన జిల్లాలను స్వాగతిస్తున్నాం

Published Thu, Aug 25 2016 11:38 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

welcome to new distritcs

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలోని జోనల్‌ వ్యవస్థ రద్దును సమర్థిస్తూ, నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఎ.నర్సింహస్వామి పేర్కోన్నారు. గురువారం నగరంలో యూనియన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివద్దికి ఆటంకంగా ఉండడంతో పాటు నిరుద్యోగులకు ఆశనిపాతంలా ఉన్న జోనల్‌ వ్యవస్థ రద్దును సమర్థిస్తున్నామని, నూతన జిల్లాల ఏర్పాటు పూర్తిగా శాస్త్రీయంగా ఉందని వీటిని స్వాగతిస్తున్నామని అన్నారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్, నాయకులు జి.వేణుగోపాలస్వామి, సాదిక్‌మస్రత్‌ అలీ, నూనవత్‌ రాజు, వెంకటస్వామి, వేణుగోపాల్, సంతోష్‌కుమార్, మన్సూర్, గణేష్, అశోక్‌కుమార్, లక్ష్మయ్య, రాంమూర్తి, వెంకటేశ్వర్లు, చంద్రమోహన్‌ పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement