
ఎంపీ కవితకు ఘనస్వాగతం
చిట్యాల
నల్లగొండలో తెలంగాణ జాగృతి దశమ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న ఆ సంఘం అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవితకు చిట్యాలకు చెందిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కూనూరు సంజయ్‌దాస్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు జ్ఞాపికను అందజేశారు. అనంతరం నల్లగొండలో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు నాయకులు తరలి వెళ్లారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బైరు శివ, చింతకాయల మహేష్, అమరోజు మధు, నీల మణికంఠ, పుల్లెంల శ్రీకాంత్, అనిల్ పాల్గొన్నారు.