కొత్త సంవత్సరం వచ్చేసింది... 2024లో మనలో చాలా మంది కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారు. 2024 సంవత్సరంలో మనమంతా పలు ఆవిష్కరణలను చూడబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియోని మనం చూడబోతున్నాం. అదే సమయంలో పోషకాహార లోపాన్ని తొలగించగల దివ్య ఔషధం మన ముందుకు రాబోతోంది.
చర్చిలో మహిళా మతాధికారులు
కాథలిక్కులు మహిళలను మతాధికారులుగా నియమించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే 2024లో ‘కానన్ లా’లో మార్పు రానుంది. కాథలిక్ చర్చిలు ఈ చట్టం ప్రకారం నడుచుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో కాథలిక్ నియమాలలో పలు సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి.
పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధం
బిల్ గేట్స్ ఫౌండేషన్ పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధాన్ని తీసుకురానుంది. పోషకాహార లోపాన్ని నివారించే ఔషధంపై స్టేజ్-3 ట్రయల్ జరుగుతోంది. 2024లో ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందింది. ఈ ఔషధం వల్ల భారతదేశానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
చంద్రునిపైకి నలుగురు మానవులు
2024లో ‘నాసా’ నలుగురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపనుంది. 1972లో అపోలో-17 మిషన్‌లో ‘నాసా’ ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపింది. 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రునిపైకి మనుషులను పంపుతోంది.
అందుబాటులోకి సూపర్ కంప్యూటర్
యూరప్ తన మొదటి ఎక్సా-స్కేల్ సూపర్ కంప్యూటర్ 2024లో అందుబాటులోకి రానుంది. జర్మనీలోని జూలిచ్‌లోని నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ సూపర్‌కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్ కంప్యూటర్ మెరుపువేగంతో పనిచేయనుంది.
అతిపెద్ద వ్యోమనౌక
అతిపెద్ద అంతరిక్ష నౌక క్లిప్పర్ మిషన్ నిర్మితం కానుంది. ఈ వ్యోమనౌక బరువు ఇంధనం లేనపుడు 3241 కిలోలు ఉంటుంది. ఈ వ్యోమనౌక పొడవు బాస్కెట్‌బాల్ కోర్ట్ అంటే 30 మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. జూపిటర్ మిషన్ కోసం సిద్ధం చేసిన ఈ అంతరిక్ష నౌకలో 24 ఇంజన్లు ఉంటాయి.
మూడవసారి పారిస్‌లో ఒలింపిక్స్
2024లో పారిస్‌లో మూడవసారి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగిన ఏకైక నగరం లండన్. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు దాదాపు రూ.76 వేల కోట్లు ఖర్చు కానుంది.
అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో
2024లో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకానుంది. ఈ స్పేస్ స్టూడియో పేరు ఎస్‌ఈఈ-1. డిసెంబర్ 2024 నాటికి ఈ స్టూడియో సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్టూడియో సాయంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించనున్నారు.
ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment