జననేతకు ఘన స్వాగతం
-
‘పశ్చిమ’ వెళ్లేందుకు విమానంలో వచ్చిన జగన్
-
మధురపూడికి పోటెత్తిన జనసందోహం
మధురపూడి (రాజానగరం) :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మధురపూడి విమానాశ్రయంలో ఆదివారం ఘనస్వాగతం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే నిమిత్తం ఆయన ఆదివారం మ«ధ్యాహ్నం 2.30 గంటలకు జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. జననేతకు స్వాగతం పలికేందుకు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. జగ¯ŒSకు స్వాగతం పలికినవారిలో ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పార్టీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కొల్లి నిర్మలకుమారి, యువజన విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయభాస్కర్, కో ఆర్డినేటర్లు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రఘురామ్, కర్రి పాపారాయుడు, గుత్తుల సాయి, మిండగుదిటి మోహన్, గుర్రం గౌతమ్, చెల్లుబోయిన శ్రీను, రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్‌మోహ¯ŒSరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజుబాబు, కాకినాడ నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్, పార్టీ నాయకులు అడపా శ్రీహరి, సుంకర చిన్ని, వాసిరెడ్డి జమీలు, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షులు సాయిబాల పద్మ, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, పొట్టు సత్యనారాయణ, బండి అబ్బులు, కో ఆర్డినేటర్లు తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.
అడ్డుకున్న పోలీసులు
జగ¯ŒSను చూసేందుకు వచ్చిన జనసందోహానికి పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారు. టెర్మినల్ భవనం లోపలికి వెళ్లేందుకు తమకు అనుమతివ్వకపోవడంపై, రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా నార్త్‌జో¯ŒS డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను కురసాల కన్నబాబు నిలదీశారు. దీంతో ప్రధాన నాయకులకు అనుమతులు ఇచ్చారు. తరువాత కొల్లి నిర్మలాకుమారి తదితరులను అనుమతించకపోవడంతో ఆమెకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ నిర్మలాకుమారిని అనుమతించలేదు. మెయి¯ŒSగేటు వద్దనే వాహనాలను నిలిపేశారు. దీంతో, అక్కడినుంచే అందరూ నడుచుకుంటూ టెర్మినల్‌కు చేరుకున్నారు. జగ¯ŒSను చూసేందుకు వచ్చిన అభిమానులు మెయి¯ŒS గేటు వద్దనే ఉండిపోయారు.