కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు.
అమ్రోహా, సంభాల్, బులంద్‌షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు.
అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్‌పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment