
వెల్‌కం గ్రూపు దెబ్బపడింది: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవల ఎవరు కన్పించినా ‘వెల్‌కం’ గ్రూపు దెబ్బకు బలయ్యామని వాపోతున్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ‘వెల్‌కం’ గ్రూపును దెబ్బతీయాలంటే తెలంగాణలోనూ తామంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంద న్నారు. దీంతో ఓ విలేకరి ‘‘అన్నా అసలు ‘వెల్‌కం’ అంటే ఏంది?’’అని అడగడటంతో... ‘‘వెల్‌కం అంటే వెలమ+ కమ్మ సామాజిక వర్గమే. మా పార్టీలో ఈ రెండు గ్రూపులను మోస్తూ వచ్చాం. ఇప్పుడు మాకే దెబ్బపడింది. మా రాజ్యాధికారం పోయింది’’ అని చెప్పారు.