కరోనా దుర్దినాలు వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయాయి. ఎప్పుడైనా పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు ప్రారంభమైనా కొత్తగా కోవిడ్ వేవ్ వచ్చి పడటంతో పూర్తి స్థాయిలో ప్రయాణాలు సాధ్యం కాలేదు. అయితే రెండేళ్ల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఎస్‌ఎఫ్‌వో) ఇండియన్ ట్రావెలర్స్‌కి స్వాగతం పలుకుతూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.
భారతీయ అమెరికన్ సంస్కృతులను ప్రతిబింబించేలా ఎస్‌ఎఫ్‌వో ప్రత్యేకంగా వీడియో రూపొందించింది. ఇందులో నటులందరూ భారతీయ మువ్వెల జెండాతో స్వాగతం పలుకుతూ కనిపించారు. ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కెచప్‌కి బదులు సమోసా పూదీన చట్నీ, బేస్ బాల్ బదులు క్రికెట్, పీట్స్ కాఫీ బదులు ఛాయ్ ఇలా అన్నింటా భారతీయులకు అనుగుణంగా మార్పులు చేశామంటూ హృదయ పూర్వక స్వాగతం పలుకుతూ వీడియోను రూపొందించింది ఎస్‌ఎఫ్‌వో.
After 2 years, India has resumed regular international flights. As a major gateway for travelers to and from India, SFO can't wait to welcome back Indian travelers!#WelcomeBack#flySFO ✈️#travel#sanfranciscotravel 🌉#sfowagbrigade pic.twitter.com/hq2nHPZjBM
— San Francisco International Airport (SFO) ✈️😷 (@flySFO) April 6, 2022
Comments
Please login to add a commentAdd a comment