internatinol
-
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనాపై అరెస్ట్ వారెంట్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్టు వారెంట్ జారీ అయింది. నవంబర్ 18న కోర్టుకు హాజరుకావాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. వచ్చే నెల 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ఆదేశించారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు.జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందగా, వాటిపై ట్రైబ్యునల్ ఇటీవల విచారణ ప్రారంభించింది. మరోవైపు ఆమె దౌత్య పాస్‌పోర్టు కూడా రద్దయింది.హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్‌లో ఉండటాన్ని వ్యతిరేకిస్తుండగా, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత్‌ను ఇటీవల కోరింది.ఆమెను బంగ్లాకు అప్పగించాలని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్పీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని ఓవరాక్షన్.. ఖండించిన భారత్ -
చరిత్ర సృష్టించిన ఏక్తా కపూర్!..ఆ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలు!
భారతీయ టెలివిజన్ రంగాన్ని మహారాణిలా ఏలుతున్నఏక్తా కపూర్ చరిత్ర సృష్టించింది. అమెరికా వెలుపల వివిధ దేశాల్లోని టెలివిజన్ కంటెంట్ నుంచి ఎంచి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్సులో ఆమెను ‘డైరెక్టరేట్ అవార్డ్’ వరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు ఏక్తా. మంగళవారం తెల్లవారుజామున (అమెరికాలో సోమవారం రాత్రి) న్యూయార్క్‌లో ఈ అవార్డు బహూకరించారు. ఏక్తా కపూర్ (48)కు ముందు అభినందనలు చెప్పాలి. టెలివిజన్ రంగంలో సుదీర్ఘకాలం నిలిచినందుకు, ఢక్కామొక్కీలు తిని విజయం సాధించినందుకు, వేల మందికి ఉపాధి కల్పించినందుకు, టెలివిజన్ చానల్స్ ప్రైమ్‌టైమ్‌ను ఏదో ఒక కాలక్షేపంతో నింపినందుకు, ఇంకా కొనసాగుతున్నందుకు. ఇప్పటివరకూ ఆమె 17,000 గంటల టెలివిజన్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసిందంటే దాని వెనుక శ్రమను, ప్యాషన్‌ను, వ్యాపార శ్రద్ధను అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు... 45 సినిమాలను కూడా ఆమె ప్రొడ్యూస్ చేసింది. వ్యాపార ఎత్తుగడల్లో భాగంగా నాసిరకం/సరసమైన కంటెంట్‌ను తయారు చేసి విమర్శలు ఎదుర్కొన్నా అన్ని రకాల జానర్స్‌లో కంటెంట్ తయారు చేస్తాను... దేనికి తగ్గ ప్రేక్షకులు దానికి ఉంటారు అనే ధోరణిలో ముందుకు దూసుకుపోతోందామె. అందుకే ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ గుర్తింపు అమెరికాలోని ‘ఇంటర్నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ప్రతి సంవత్సరం అమెరికా బయటి దేశాలలో టెలివిజన్ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు’లను బహూకరిస్తుంది. ఇవి టెలివిజన్ ఆస్కార్స్లాంటివి. ఈ అవార్డులు భారతీయులకు వరించడం తక్కువ. వివిధ కేటగిరీల్లో ఇచ్చే ఈ అవార్డుల్లో విశిష్టమైన ‘డైరెక్టరేట్ అవార్డు’ను ఈ సంవత్సరానికి ఏక్తా కపూర్‌కు ప్రకటించారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా. అకాడెమీ సీఈవో బ్రూస్ ప్రైస్నర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘భారతీయ మాస్ ప్రేక్షకులను, సౌత్ ఏసియా ప్రేక్షకులను ఏక్తా కపూర్ తన సీరియళ్ల ద్వారా చేరగలిగింది. టెలివిజన్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది’ అని కొనియాడారు. న్యూయార్క్‌లో అవార్డు అందుకున్న ఏక్తా ‘ఈ అవార్డు నా మాతృదేశం కోసం’ అంటూ భావోద్వేగానికి గురైంది. విభిన్న వ్యక్తిత్వం ఏక్తా కపూర్ టెలివిజన్ రంగంలో (1995) అడుగు పెట్టే సమయానికి అదంతా పురుష ప్రపంచం. తండ్రి జితేంద్ర (నటుడు) దగ్గర 50 లక్షలు తీసుకొని ‘బాలాజీ టెలి ఫిల్మ్స్’ కింద కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ తీస్తే అన్నీ రిజెక్ట్ అయ్యాయి. దాంతో 50 లక్షలూ వృథా అయ్యాయి. ఆ తర్వాత ఆమె ‘మానో యా మానో’, ‘హమ్ పాంచ్’ సీరియల్స్‌తో హిట్స్ మొదలుపెట్టింది. 2000 సంవత్సరంలో ‘కె’ అక్షరం సెంటిమెంట్‌తో మొదలెట్టిన ‘క్యూంకి సాస్‌భీ కభీ బహూ థీ’ టెలివిజన్ చరిత్రను తిరగరాసింది. ఇది పొందినంత టిఆర్పి మరే సీరియల్ పొందలేదు. ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘పవిత్ర రిష్టా’, ‘కుంకుమ్ భాగ్య’ లాంటి 134 సీరియల్స్ ఇప్పటి వరకూ తీసింది. పెద్ద పెద్ద సెట్లు, మహిళా పాత్రధారులకు ఖరీదైన చీరలు, ఆభరణాలు, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ ఏక్తా మొదలుపెట్టి మొత్తం దేశంలో అదే ట్రెండ్ ఫాలో అయ్యేలా చేసింది. సరోగసి ద్వారా ఏక్తా వివాహం చేసుకోలేదు. కాని 2019లో సరోగసి ద్వారా కుమారుడికి జన్మనిచ్చింది. కొడుక్కి తండ్రి పేరు ‘రవి కపూర్’ అని పెట్టుకుంది. అవార్డు వేదిక మీద ఏక్తా మాట్లాడుతూ ‘మా నాన్నకు, నేనిక్కడ ఉంటే నా కొడుకు కోసం బేబీ సిట్టింగ్ చేస్తున్న మా అన్నయ్య తుషార్కపూర్కు కృతజ్ఞతలు’ అంది. ప్రస్తుతం సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీ కోసం ఏక్తా ఎక్కువగా కంటెంట్‌ను తయారు చేస్తోంది. (చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే) -
ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!
ఐదు వేల వస్తువులను చూడటానికి రెండు కళ్లు చాలవు. చుట్టి రావడానికి కనీసం రెండు గంటల సమయం కావాలి. పదిహేడు దేశాలను ఒక్క చోట ప్రతిక్షేపించిందీ మ్యూజియం. అందులో మన దేశమూ ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు. మనదేశంలో చూడలేకపోయిన బౌద్ధక్షేత్రాల ప్రతీకలను ఇక్కడ చూద్దాం. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం... శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉంది. క్యాండీలోని నేషనల్ మ్యూజియం భవనంలోనే ఉంది. ఇంటర్నేషనల్ మ్యూజియంలో శ్రీలంక, ఇండియా, జపాన్, చైనా , భూటాన్ దేశాలతోపాటు మొత్తం 17 దేశాల బౌద్ధ విశేషాలున్నాయి. ఇండియా గ్యాలరీ ఏర్పాటు బాధ్యతలను మన విదేశీ వ్యవహారాల శాఖ పూర్తి చేసింది. నిర్వహణ బాధ్యతను పదేళ్ల కిందట ‘శ్రీ దలాడ మలిగవ’కు అప్పగించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం ఇది. బౌద్ధానికి చెందిన ఫొటోలు, శిల్పాలు, ప్రతీకాత్మక శిల్పాలు, చిత్రాలు, నేషనల్ మ్యూజియంలో క్యాండీ రాజులు (17,18 శతాబ్దాల నాటివి) ఉపయోగించి ఆయుధాలు, ఆభరణాలు, దైనందిన జీవనం ఉపయోగించిన వస్తువులు, చారిత్రక శకలాలు... అన్నీ కలిసి ఐదు వేలకు పైగా ఉంటాయి. క్యాండీ రాజ్యం 1815లో బ్రిటిష్ రాజ్యంలో విలీనం అయినప్పుడు రాసుకున్న ఒప్పంద పత్రం ప్రతిని కూడా చూడవచ్చు. మ్యూజియంలోపల బ్రిటిష్ ఆనవాళ్లు మరేవీ కనిపించవు. కానీ మ్యూజియం ఏర్పాటులో కీలకంగా పని చేసిన సిలోన్ గవర్నర్ సర్ హెన్రీ వార్డ్ విగ్రహం ఉంది. తెలుగు– సింహళ బంధం ఇండియా విభాగంలో మన అమరావతి బౌద్ధ స్థూపం నమూనా కూడా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బౌద్ధం విలసిల్లిందని చెప్పడానికి దోహదం చేసే ఆధారాలను, ఆనవాళ్లను చూడవచ్చు. సాంచి స్థూపం నమూనా, సారనాథ్ స్థూపం దగ్గర అశోకస్తంభం మీద గర్జించే సింహం నమూనా శిల్పం, ఎల్లోరా గుహలు వాటిలోని శిల్పాలు, అజంతా గుహలు– అందులోని వర్ణ చిత్రాలు, అశోకుని ధర్మచక్రం, మనం జాతీయ చిహ్నం నాలుగు సింహాల ప్రతిమలను చూడవచ్చు. ఇంకా... చైనా బుద్ధుని విగ్రహాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మిగిలిన అన్ని దేశాల బుద్ధుడి ప్రతిమల్లోనూ ఏకరూపత ఉంటుంది. కానీ చైనా బుద్ధుడు భిన్నంగా ఉంటాడు. పెంగ్షుయ్ వాస్తులో భాగంగా లాఫింగ్ బుద్ధ మనకు పాతికేళ్ల కిందటే పరిచయమై ఉన్నాడు కాబట్టి ఆ రూపాన్ని బుద్ధుడిగా స్వీకరించడానికి పెద్దగా ఇబ్బంది పడమన్నమాట. ఇక ఆశ్చర్యంతోపాటు ఒకింత అయోమయానికి గురి చేసేది భవిష్యత్తు బుద్ధుడి ఊహాశిల్పం. ఆ బుద్ధుడు మల్టీటాస్కింగ్‌కి ప్రతీకగా ఉంటుందా శిల్పం. మ్యూజియంతోపాటు ఈ భవనంలోనే కొన్ని గదుల్లో సావనీర్ విభాగం ఉంది. శ్రీలంక గుర్తుగా కప్పులు, ఫ్రిజ్ మ్యాగ్నట్ల వంటివి చాలా రకాలున్నాయి. అప్పటి అతిథిభవనం! ఈ మ్యూజియం రెండస్థుల భవనం. మ్యూజియంగా మార్చకముందు ఈ భవనం గెస్ట్‌హౌస్‌గా రాజ్యాతిథుల విడిదిగా ఉండేది. రాణివాస మహిళలకు కూడా కొంతకాలం ఇందులో నివసించినట్లు చెబుతారు. క్యాండీ రాజ్యం ఆర్కిటెక్ట్‌ల నైపుణ్యానికి సగౌరవంగా అభివాదం చేయాల్సిందే. మ్యూజియం భవనం, యునెస్కో గుర్తించి వరల్డ్ హెరిటేజ్ సైట్ టూత్ రిలిక్ టెంపుల్, రాజుల ప్యాలెస్‌లు ఒకే క్లస్టర్లో ఉంటాయి. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!) -
Europe : వలసల వలలో యూరప్
యూరప్ ను వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ ఖండంలోని చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్లర్లు,నేరాలు,ఘోరాలు,అశాంతి ఆ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి.వీటికి పరిష్కారం లభించకపోగా,మరింత రగిలే ప్రమాదఘంటికలే వినిపిస్తున్నాయి. వలసలు ఏ ఖండానికి,ఏ దేశానికి కొత్తకాదు.ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చినవారితోనూ, సక్రమంగా వలస వచ్చినవారితోనూ సమస్యలు పెరుగుతూనే వున్నాయి.భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు. వలసలతో అశాంతి ప్రస్తుత అంశం యూరప్ విషయానికి వస్తే, వలసలు ప్రబలి,రోజుకొకరకమైన దుర్వార్త అక్కడి నుంచి వినాల్సివస్తోంది.ఇప్పటికే ఫ్రాన్స్ లో అల్లర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెదర్లాండ్ లో ప్రభుత్వమే కూలిపోయింది.స్వీడన్ లో ఘర్షణలు లేని రోజంటూ లేదు. స్విట్జర్లాండ్ లో అశాంతి రాజ్యమేలుతోంది. బెల్జియం,జర్ననీలో అల్లర్లు,నేరాలుఘోరాలకు అదుపే లేదు.మానవతా దృక్పధంతో శరణు ఇచ్చినందుకు యూరప్ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తోంది.శరణుకోరి ఆయా దేశాలలో ప్రవేశించినవారి సంఖ్య కోట్లకు చేరుకుంది.వీరంతా మిగిలిన సామాజిక సమస్యలను సృష్టించడమే గాక,రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్ధకమవుతోంది. శరణార్థుల దారి యూరపే.! యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంతో యుగొస్లావియా, ఉక్రెయిన్,సిరియా,ఆఫ్ఘనిస్థాన్ మొదలైన దేశాలలో బాధపడేవారు యూరప్ దేశాల వైపు వస్తున్నారు. అతి ప్రమాదకరమైన విధానాల్లో సముద్ర ప్రయాణాలు చేస్తూ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ముఖ్యంగా 2015లో వలసలు పెద్దఎత్తున పోటెత్తాయి.ఆ సంవత్సరాన్ని 'వలసల సంవత్సరం'గా అభివర్ణించారు.2007-2011మధ్య కూడా వలసలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరగడం కూడా వలసలపైన కీలక ప్రభావం చూపించింది, ఇంకా చూపిస్తూనే వుంది. లక్షల మంది వలస 2022నాటికి వలస వచ్చిన జనాభా చూస్తే, జర్మనీలో 10.9మిలియన్లు, స్పెయిన్ లో 5.4మిలియన్లు, ఫ్రాన్స్ లో 5.3మిలియన్లు,ఇటలీలో 5మిలియన్లు ఉన్నట్లు సమాచారం. ఒక్క 2022లోనే యూరోపియన్ యూనియన్ లో ఆశ్రమం కోరిన వారి సంఖ్య 6,32,430.అందులో ఆమోదం పొందిన వారి సంఖ్య 3.10 లక్షలు.ఇన్నేళ్ల పాటు వచ్చినవారు,వస్తున్నవారిలో అధికారికంగా కంటే అనధికారికంగా వచ్చిన వారి సంఖ్య అంచనాలకు మించి వుంటుంది. లక్షల్లో వలసవస్తున్న వీరిని కొన్ని దేశాలు అడ్డుకుంటున్నాయి. జర్మనీ వంటికొన్ని దేశాలు మాత్రం ఆదుకుంటున్నాయి. నాటి పాపం నేడు అనుభవిస్తున్నారు పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి పెద్దసంఖ్యలో వలసలు జరిగాయి. అరబ్ విప్లవం తర్వాత టునీసియా, లిబియా,ఈజిప్ట్,యెమెన్, అల్జీరియా వంటి దేశాల నుంచి వలసలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారిలో ఎక్కువమంది గ్రీస్ ద్వారా వెళ్లినట్లు తెలుస్తోంది.వలసల ప్రభావం ఆర్ధిక, సామాజిక,రాజకీయ వ్యవస్థలపై పడుతోంది.నివాసం,ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు పెనుసమస్యగా మారింది. వివిధ సమాజాల మధ్య సాంస్కృతిక ప్రయాణం పెద్దసవాల్ విసురుతోంది. ప్రస్తుతం యూరప్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ జాఢ్యం మిగిలిన ఖండాలలోనూ రేపోమాపో శృతిమించకపోదు. సున్నితం.. కీలకం భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమై,అనేక దాడులకు ఆలవాలమై,ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరిస్తున్న భారతదేశం వలసల విషయంలో,ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి అక్రమంగా చొరబడిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరప్ వలసల అంశంపై ప్రపంచ దేశాధినేతలు దృష్టి పెట్టాలి. ఆయా దేశాల అంతర్గత సమస్యలను అరికట్టడంలోనూ, మతోన్మాద ఉగ్రవాదం ప్రబలకుండా చూడడంలోనూ అందరూ కలిసి సాగాలి.యూరప్ అనుభవాలు మిగిలిన ఖండాలకు పెద్దగుణపాఠం కావాలి. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
ఆమె నియంత హిట్లర్‌కు గూఢచారి.. తన నృత్యాలతో కవ్విస్తూ..
‘మాతా హారీ’.. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన గూఢచారి. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్‌ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్‌కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢచార విద్యలో ఆరితేరినదే కాకుండా అందగత్తె, డ్యాన్సర్. నెదర్లాండ్‌లో 1876లో జన్మించిన మాతాహారి అసలు పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెలె. గూఢచర్యం ఆమె వృత్తి. మాతాహారీకి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకుంది. ఆమె తన అందచందాలతో కొద్దికాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఒక డాన్సర్, స్ట్రిప్పర్గానే ఉంది. ఆమె నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథమహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం, ఫ్రాన్స్ కోసం ఆమె గూఢచర్యం చేసేదని చెబుతుంటారు. మాతాహారీ హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహారీ జర్మనీకి గూఢచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడయ్యింది. గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపపణల మేరకు ఆమెను 1917లో అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు. ఇది కూడా చదవండి: బర్త్‌డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టుజుట్టూ పట్టుకున్న యువతులు! -
న్యాయం’పై నెతన్యాహూ కక్ష
అంతా అనుకున్నట్టే అయింది. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిసెంబర్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ న్యాయవ్యవస్థపై కత్తిగట్టారు. ఆ వ్యవస్థలో సంస్కరణల పేరిట దాని అధికారాలు తెగ్గోసేందుకు సిద్ధపడ్డారు. కొన్ని నెలలక్రితం నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్ పార్టీకి ఎగబడి ఓట్లేసిన జనమే ఇప్పుడు న్యాయవ్యవస్థ రక్షణ కోసం వీధుల్లోకొచ్చారు. పార్లమెంటు వెలుపల అయి దారు రోజులుగా ఎడతెగకుండా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ చట్టసభలో న్యాయసంస్కరణల బిల్లు ప్రాథమిక స్థాయిలో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 63 ఓట్లు, వ్యతిరేకంగా 47 వచ్చాయి. నెతన్యాహూ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద కూటమి ప్రభుత్వం పార్లమెంటులోని 120 స్థానాల్లో 64 గెల్చుకుంది. రాగల నెలల్లో న్యాయ సంస్కరణల బిల్లు మరో రెండు దశలు దాటాలి గనుక ఇప్పటికిప్పుడే అంతా అయిపోయినట్టు కాదు. అయితే అధికార కూటమి వరస చూస్తుంటే ఏదేమైనా చట్టం చేసితీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. ప్రచార సమయంలోనే నెతన్యాహూ తాము అధికారంలోకొస్తే న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించారు. దేశ శ్రేయస్సు కోసం చట్టాలు చేస్తుంటే సుప్రీంకోర్టు కొట్టివేస్తున్నదని, ఇందువల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోందని ఆయన భావన. అంతే కాదు... న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వా నిది పైచేయిగా ఉండాలన్నది ఆయన కోరిక. నెతన్యాహూ సుభాషితాల వెనకున్న అంతరార్థం వేరు. ఆ వ్యవస్థ తమకు సాగిలపడివుండాలన్నదే ఆయన మాటల్లోని సారాంశం. తాజా బిల్లు చట్టమైతే సుప్రీంకోర్టు కొట్టేసిన నిర్ణయాన్ని పార్లమెంటు తిరగదోడొచ్చు. కనీస మెజారిటీతో...అంటే పార్లమెంటులోని 120 మంది సభ్యుల్లో 61 మంది కాదంటే సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయొచ్చు. దేశ రాజ్యాంగంగా ఉండే మౌలిక చట్టంలోని అంశాలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టునుంచి తొలగించటం మరో ప్రతిపాదన. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ వర్గానిదే పైచేయి కావడం మూడో ప్రతిపాదన. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు సభ్యులుగా ఉండే నియామకాల కమి షన్ పనిచేస్తోంది. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించటం ఆనవాయితీగా వస్తున్నా న్యాయవ్యవస్థ ప్రతినిధుల ఆధిక్యత ఉన్నందువల్ల చాలాసార్లు ఆ వ్యవస్థ నిర్ణయమే అంతిమంగా అమలవుతోంది. ఇప్పుడు చేసిన ప్రతిపాదన దాన్ని తారుమారు చేస్తుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న అతి ఛాందసవాద యూదు పార్టీలు తమ మతంలోని యువకులను నిర్బంధ సైనిక శిక్షణనుంచి తప్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆ చట్టం తీసుకొస్తే సమాన న్యాయం పేరిట సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న భయాందోళనలు ఆ పార్టీలకున్నాయి. అందుకే ఆ పార్టీలు గట్టిగా మద్దతునిస్తున్నాయి. మరో కీలకమైనది పాలస్తీనా సమస్య. పాలస్తీనా పౌరులను ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా యూదుల్లో తమకు మద్దతు పెరుగుతుందని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తాయి. యూదుల్లో జాతీయ భావాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం వాటికి అలవాటుగా మారింది. ఒకపక్క ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలన్న డిమాండ్ ప్రపంచ దేశాలన్నిటి నుంచీ వస్తుంటే ఆ ఆక్రమణలను మరింత పెంచుకోవటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పాలక పక్షాలు పని చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఈ ఆక్రమణలు చట్టవిరుద్ధమైనవి. అయినా అవి ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంకు, తూర్పు జెరూసలెంలలో ఆక్రమిత భూభాగాల్లో దాదాపు ఏడున్నర లక్షలమంది ఇజ్రాయెల్ పౌరుల ఆవాసాలున్నాయి. వీటిని మరింత పెంచుకోవాలంటే సుప్రీంకోర్టు అడ్డంకిని తొలగించుకోవాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. న్యాయసంస్కరణల బిల్లుకు జనంలో పెద్దయెత్తున వ్యతిరేకత రావటం చూసి దేశాధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ఈ బిల్లుపై విపక్షాలతో చర్చించాకే తదుపరి చర్యలుండాలని హితవు పలికారు. అయితే నెతన్యాహూకు ఇది రుచించలేదు. విపక్షాలతో చర్చలకు సిద్ధమే అయినా చట్టం తీసుకురావటం ఖాయమని న్యాయశాఖ మంత్రి చెప్పారంటేనే ప్రభుత్వ సంకల్పం ఏమిటో అర్ధమవుతోంది. ఇప్ప టికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహూ శిక్షపడే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఈ బిల్లును తెచ్చారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణఇజ్రాయెల్కు నిర్దిష్టమైన రాజ్యాంగం లేదు. ఫెడరల్ వ్యవస్థ లేదు. దేశానికంతకూ ప్రాతినిధ్యంవహించే పార్లమెంటు నిర్ణయమే అంతిమం. ఇందువల్ల పార్లమెంటులో బలాబలాలే అన్నిటినీ నిర్ణయిస్తాయి. ఈ స్థితిలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలను సమీక్షించి సమతుల్యత సాధించే మరో వ్యవస్థ ఎంతో అవసరం. ఆ పాత్రను సుప్రీంకోర్టు సమర్థవంతంగా పోషిస్తోంది. దేశ జనాభా 90 లక్షలమందిలో అయిదోవంతుమంది అరబ్బులు. మరో 30 లక్షలమంది పాలస్తీనా పౌరులు వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్నారు. వీరందరి ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని నిర్ణ యాలు చేయాల్సిన నేపథ్యంలో మెజారిటీవాదమే చెల్లుబాటు కావాలనుకోవటం ఆత్మహత్యాసదృశమవుతుంది. స్వప్రయోజనాల కోసం దేశాన్నే పణంగా పెట్టిన నేతగా చరిత్రలో నిలుస్తారో, జనాభి ప్రాయానికి తలొగ్గుతారో నెతన్యాహూ తేల్చుకోక తప్పదు. -
ఈ ఏడాదంతా సైన్స్ విశేషాలే!
కొత్త సంవత్సరం రానున్నది. అంటే గడిచిన సంవత్సరంలో జరిగిన, గమనించదగిన అంశా లను సమీక్షించడానికి ఇది తగిన సమయం. 2022లో చాలా ఆసక్తికరమైన విషయాలే జరిగి నట్లు చూడవచ్చు. జనవరి మాసంలో టోంగాలోని ‘హుంగా టోంగా’ అనే అగ్నిపర్వతం పేలింది. 21వ శతాబ్దిలో ఇంతటి పేలుడు ఇదివరకు జరగలేదు. ఈ అగ్ని పర్వతం హోంగా ప్రధాన ద్వీపం పక్కన ఇంచుమించు సముద్రంలో ఉంటుంది. కనుక సునామీ పుట్టి 90 మీటర్ల ఎత్తు అలలు పుట్టాయి. నలుగురు మాత్రమే మరణించారు. జనవరి 24న రష్యావారు ఉక్రెయిన్ మీద దాడి చేశారు. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో అణు విద్యుత్కేంద్రాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన చెర్నోబిల్ కూడా అక్కడే ఉంది. ప్రపంచంలో అణు విద్యుత్తు ఉత్పత్తిలో ఆ దేశం 7వ స్థానంలో ఉంది. జపోరిజిజియా అనే చోట యూరోప్‌లోకెల్లా పెద్ద విద్యుత్కేంద్రం ఉంది. దాని మీద రష్యా దాడి ప్రభావం పడింది. అంటే యుద్ధం ఇంచుమించు అణు యుద్ధంగా మారే అవకాశం ఉంద నాలి. వీరి కేంద్రాలు నిజానికి పాతవి. కొత్తగా కడుతున్న కేంద్రాలలో ఇటువంటి తాకిడులను దృష్టిలో ఉంచుకుని తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తాకిడిలో మరీ పెద్ద ప్రమాదాలు ఏవీ జరగలేదం టున్నారు నిపుణులు. ఎవరికి వారు వంశ వృక్షాలు సిద్ధం చేసుకోవడం మామూలే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొత్తం మానవ జాతికి వంశ వృక్షం తయారు చేసే ప్రయత్నం మొదలయింది. మానవుల జన్యు వివరాలను పరిశీ లించడం ఇప్పుడు మామూలయింది. అటువంటి ఆధునిక పరీక్షలు 3,600 వరకు ఉన్నాయి. కొన్ని ప్రాచీన మానవ జన్యు పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ కొత్త వంశ వృక్షం తయారవుతున్నది. ఆక్స్ఫర్డ్ యూని వర్సిటీలో జరుగుతున్న ఈ పరిశోధనకు ప్రపంచం మొత్తం నుంచి సమాచారం అందుతున్నది అంటున్నారు పరిశోధకురాలు గిల్ మెక్ వీన్. ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లు దాటింది. పర్యావరణం పాడవుతున్నది. గడచిన ఫిబ్రవరి తరువాత మరోసారి సీఓపీ సభలు జరిగాయి. పరిస్థితి మాత్రం అసలు మార్పు లేకుండా ఉంది. వాతావరణ మార్పు ప్రభావాలకు గురవుతున్న బడుగు దేశాలకు సహాయం అందిం చడానికి గాను నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. నెల రోజుల యినా నిధులు ఇస్తున్నట్లు ఎవరూ ప్రకటించలేదు. పెట్రోలియం కంపెనీల మీద ఒత్తిడి తేవాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటరెస్ గట్టిగా అంటున్నారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి కూడా ఎటువంటి ఆశ కనిపించడం లేదు. ఏం జరుగుతుందని పేద దేశాలు ఆత్రంగా చూస్తున్నాయి. ఆస్టరాయిడ్లు అనే అంతరిక్ష శిలల వల్ల భూమికి ప్రమాదం జరిగే అవకాశాలు అప్పుడప్పుడు ఎదురువుతుంటాయి. నాసా వారు అటు వంటి శిలలను దారి మళ్లించే ప్రయత్నంలో విజయం సాధించారు. భూమికి 11 మిలియన్ కిలోమీటర్ల దూరం పయనించిన ‘డార్ట్’ అనే నౌక ‘డైమార్ఫస్’ అనే అంతరిక్ష శిలను పక్కకు కదిలించ గలిగింది. ఈ చిన్న శిల నిజానికి మరొక పెద్ద శిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు పెద్ద శిలకు కొంచెం దగ్గరగా జరిగింది. ఈ విజయం ఆధారంగా, రానున్న కాలంలో ఇటువంటి శిలలను దారి మళ్లించే ప్రయత్నాలు మరింత ఆశాజనకంగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. మానవ శరీర భాగాలను ఒకరి నుంచి మరొకరికి మార్చే ప్రయ త్నాలు ఈ మధ్యన బాగా జరుగుతున్నాయి. న్యూయార్క్ యూనివర్సిటీలో సర్జన్లు ఈ సంవత్సరం జనవరిలో జన్యు మార్పులకు గురి చేసిన పంది గుండెను ఒక మనిషికి అమర్చారు. డేవిడ్ బెనెట్ అనే ఆ వ్యక్తి రెండు నెలల తరువాత చనిపోయాడు. అయినా, అతను అంతకాలం బతకడం గమనించదగిన విషయమని పరిశోధకులు అభి ప్రాయపడుతున్నారు. 2021 వరకు జంతు శరీర భాగాలను మనుషులలో అమర్చడం అన్నది ఆలోచనగానే ఉండేది. ఇప్పుడది వాస్తవం కాబో తున్నది అంటారు బర్మింగ్‌హామ్ సర్జన్ ఆండర్సన్. భౌతిక శాస్త్ర పరిశోధకులు విశ్వంలోని పదార్థ నిర్మాణం గురించి అడ్వాన్స్డ్ పరిశోధనలు చేస్తుండటం తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం బోసాన్లు అనే పదార్థ కణాలు కనిపించాయని గొప్ప గోల పుట్టింది. ఈ సంవత్సరంలో డబ్ల్యూ బోసాన్ అనే కణం గురించిన పరిశో ధనలు, రంగంలో అందరినీ ఒక అడుగు వెనుకకు కదిపే రకం ఫలితా లనిచ్చాయి. జెనీవాలోని వార్జ్ వోడ్రాన్కీవైడర్లో ఈ పరిశోధనలు చాలా బలంగా జరుగుతున్నాయి. 2028 నాటికిగానీ, ఈ విషయం గురించి ఏమీ చెప్పలేము అన్నారు అక్కడి వారు. మైనస్ 12 డిగ్రీలు అంటే... అంటార్క్టికా లాంటి చోట తప్ప మరెక్కడా వీలుగాని వేడిమి. అది అసలు వేడిమి కాదు. చల్లదనం. దక్షిణ ధృవం నుంచి 1,600 కిలోమీటర్ల దూరంలోని కన్కార్డియా పరిశోధనా కేంద్రంలో ఆ టెంపరేచర్ 2022 సంవత్సరం మార్చిలో గమనించారు. అంటే అక్కడ వేడిమి మొదలయిందని అర్థం అంటు న్నారు. సముద్రాలు వేడెక్కుతున్నాయి. కనుక ధృవాలు కూడా వేడెక్కు తున్నాయి. ఇటు గ్రీన్లాండ్, అంటే ఉత్తర ధృవంలో ఫియోనా హరికేన్ కారణంగా బిలియన్ టన్నుల మంచు కరుగుతున్నట్టు ఈ సంవత్సరంలో గమనించారు. 2022 సంవత్సరంలో జేమ్స్‌వెబ్ టెలిస్కోప్ విశ్వంలో అంతకు ముందు చూచి ఎరుగని ప్రాంతాలను పరిశోధకులకు చూప గలుగుతున్నది. భూమి నుంచి రీలుగాలి పద్ధతిలో యంత్రం ఎగ్జో ప్లానెట్లను, అక్కడి వాయువులను గురించి సమాచారం అందించింది. టెలిస్కోప్‌లో మరో 25 సంవత్సరాలకు సరిపడా ఇంధనం ఉంది. అంటే మరెంతో సమాచారాన్ని అది అందజేయగలుగుతుంది. అణు విద్యుత్ కేంద్రాలలో అణువులను విచ్ఛిన్నం చేసి, అంటే పగులగొట్టి శక్తిని పుట్టిస్తారు. అణువుల కలయిక లేదా సంయోజనం ద్వారా కూడా శక్తి ఉత్పాదన వీలవుతుంది. అయితే అందుకు మరో ముప్ఫై సంవత్సరాలు పడుతుందని చాలా కాలంగా అంటున్నారని ఒక జోక్ ఉంది. 2022లో ఆ పరిస్థితి మారింది అంటున్నారు. ఈ ఏడాది యూకేలో ఈ రంగంలో మంచి ఫలితాలు కనిపించాయి. 2025లో అణు సంయోజన కేంద్రం ఒకటి పని మొదలు పెడుతుంది అంటున్నారు పరిశోధకులు. ప్రపంచంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున కరువులు ఈ సంవత్సరంలో కనిపించాయి. ఆఫ్రికా, చైనా, యూఎస్‌లలో నదులు ఎండిపోయినట్లు గమనించారు. విజ్ఞాన శాస్త్రంలో సమస్యలను, సమస్యలుగా గాక, అవకాశాలుగా భావించి ముందుకు సాగడం అలవాటు. వచ్చే ఏడాది ఏం జరుగనుందో వేచి చూడాలి. కె.బి. గోపాలం వ్యాసకర్త అనువాదకుడు, రచయిత -
ప్రెంచ్ రచయిత " అనీ ఎర్నాక్స్ " కు నోబెల్ ప్రైజ్
-
వెల్కం బ్యాక్ ఇండియన్ ట్రావెలర్స్.. ఆకట్టుకుంటున్న ఎస్ఎఫ్వో వీడియో
కరోనా దుర్దినాలు వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయాయి. ఎప్పుడైనా పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు ప్రారంభమైనా కొత్తగా కోవిడ్ వేవ్ వచ్చి పడటంతో పూర్తి స్థాయిలో ప్రయాణాలు సాధ్యం కాలేదు. అయితే రెండేళ్ల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఎస్ఎఫ్వో) ఇండియన్ ట్రావెలర్స్‌కి స్వాగతం పలుకుతూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. భారతీయ అమెరికన్ సంస్కృతులను ప్రతిబింబించేలా ఎస్ఎఫ్వో ప్రత్యేకంగా వీడియో రూపొందించింది. ఇందులో నటులందరూ భారతీయ మువ్వెల జెండాతో స్వాగతం పలుకుతూ కనిపించారు. ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కెచప్‌కి బదులు సమోసా పూదీన చట్నీ, బేస్ బాల్ బదులు క్రికెట్, పీట్స్ కాఫీ బదులు ఛాయ్ ఇలా అన్నింటా భారతీయులకు అనుగుణంగా మార్పులు చేశామంటూ హృదయ పూర్వక స్వాగతం పలుకుతూ వీడియోను రూపొందించింది ఎస్ఎఫ్వో. After 2 years, India has resumed regular international flights. As a major gateway for travelers to and from India, SFO can't wait to welcome back Indian travelers!#WelcomeBack#flySFO ✈️#travel#sanfranciscotravel 🌉#sfowagbrigade pic.twitter.com/hq2nHPZjBM — San Francisco International Airport (SFO) ✈️😷 (@flySFO) April 6, 2022 -
పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఒక చిన్న సైనిక విమానం మంగళవారం తెల్లవారుజామున రావల్పిండిలోని నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనిక సిబ్బంది సహా 19 మంది మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్ విమానం మోరా కలు గ్రామ శివారులో కూలడంతో ఐదారు నివాస గృహాలు ధ్వంసం అయ్యాయని పాకిస్తాన్ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ఐదుగురు సిబ్బంది మరణించారని వెల్లడించింది. అయితే 19 మంది మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు స్థానిక సహాయ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అగ్నిప్రమాదం సంభవించింది. -
చైనా బలహీనతకు ట్రేడ్‌వార్ కారణమా?
బీజింగ్ : చైనా ఆర్థిక వృద్ధి గత మూడు దశాబ్దాలతో పోల్చితే కనిష్ట స్థాయికి చేరింది. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి రెండవ త్రైమాసికంలో 6.2 శాతానికి పడిపోయింది. చైనా ప్రభుత్వం 1992లో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కనిష్ట స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చైనా వస్తువులపై అమెరికా టారిఫ్‌లు పెంచడం వల్లే చైనా వృద్ధి మందగించిందని పేర్కొన్నారు. పెంచిన టారిఫ్‌లు చైనాపై ప్రభావం చూపడమే గాక విదేశీ కంపెనీలు(వీటిలో అధిక భాగం అమెరికా కంపెనీలే) వేల సంఖ్యలో చైనాను వదిలి ఇతర దేశాలవైపు చూస్తున్నాయని తెలిపారు. అందుకే చైనా అమెరికాతో ఒప్పందం కోసం తహతహలాడుతోందని ఎద్దేవా చేశారు. గత నెలలో ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై అమెరికా సుంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో చైనా పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు ఈ సుంకాల సెగతో నెమ్మదించాయి. అయితే ఆర్థిక విశ్లేషకులు మాత్రం చైనా ఆర్థిక వృద్ధి తగ్గుదలకు అమెరికాతో ట్రేడ్‌వార్ ఒక్కటే కారణం కాదంటున్నారు. వారు ట్రంప్ వాదనతో ఏకీభవించట్లేదు. చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగియుందని, కేవలం ఒక దేశంతో ట్రేడ్‌వార్ వల్ల దానికొచ్చే నష్టం తక్కువేనని వీరి అభిప్రాయం. మరి తగ్గిపోతున్న ఆర్థిక వృద్ధికి కారణం ఏంటి? అంటే.. కొండలా పేరుకుపోతున్న ప్రభుత్వ అప్పులు, చైనీయుల పొదుపులే కారణం అంటున్నారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో చైనా ప్రారంభించిన భారీ ఉద్దీపన ప్యాకేజీ కోసం అధిక స్థాయిలో అప్పులు చేసుకుంటూ పోయింది. ఉద్దీపన ప్యాకేజీ చైనా ఆర్థిక వృద్ధిని పెంచినా, దీని ఫలితంగా మార్చి 2019 నాటికి చైనా జీడీపీలో 300% కంటే ఎక్కువ ప్రభుత్వ, కార్పొరేట్ మరియు గృహ రుణాలు పేరుకుపోయాయి. ఎంతలా అంటే దేశం మొత్తం అప్పు ప్రపంచ మొత్తం అప్పులో 15% వాటా కలిగి ఉంది. దీంతో అప్పులను తగ్గించుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో నిబంధనలను కఠినతరం చేయడం, బ్యాంక్ రుణాలను తగ్గించడం తదితర చర్యలను ప్రారంభించింది. అప్పులు చేసి వృద్ధిపై ఆధారపడటాన్ని తగ్గించే ఈ ప్రయత్నాలు దేశంలో కంపెనీలకు ఫైనాన్సింగ్ పొందడం మరింత కష్టతరం చేశాయి. ప్రత్యేకించి ప్రైవేటు రంగ సంస్థలు బ్యాంకుల నుంచి నిధులను సేకరించడం కష్టమైంది. గత సంవత్సరం చైనా కంపెనీల రుణ ఎగవేతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే రుణఎగవేతల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని చైనా ఆర్థిక డేటా చూస్తే తెలుస్తుంది. కొనేవారు కరువు అయ్యారు ఈ సంవత్సరం వృద్ధికి దెబ్బ తగిలింది ప్రధానంగా చైనా వినియోగదారుల నుంచే. వీరు చైనా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుతో పాటు వ్యక్తిగత రుణ స్థాయిల గురించి ఆందోళన చెందడంతో ఖర్చును తగ్గించారు. పెరిగిన ఆస్తి ధరలు కూడా వారి కొనుగోలు శక్తిని దెబ్బతీశాయి. రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే విపరీతంగా తగ్గిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల అమ్మకాలు కూడా చైనాలో నెమ్మదించాయి. ఉదాహరణకు చైనాలో ఆపిల్ ఉత్పత్తుల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. ఆపిల్ మొత్తం ఆదాయంలో గ్రేటర్ చైనా (హాంకాంగ్, తైవాన్లతో కూడిన చైనా) వాటా 18%. రెండవ త్రైమాసికంలో వాటి అమ్మకాలు ఏకంగా 21.5శాతం తగ్గిపోయాయి. అలాగే కార్ల అమ్మకాలలో తగ్గుదల కూడా చైనా వృద్ధి తగ్గుదలకు ఒక సంకేతం. ఫోర్డ్, జనరల్ మోటార్స్ తదితర దిగ్గజ కంపెనీలకు వినియోగదారులు లేక అమ్మకాలు నిలిచాయి. దశాబ్ద కాలంగా క్షీణిస్తూనే.. చైనా ఆర్థిక మందగమనం వాణిజ్య యుద్ధానికి చాలా సంవత్సరాల ముందు నుంచే మొదలైంది. 2007లో వృద్ధి రికార్డు స్థాయిలో 14.2శాతానికి చేరుకున్నా.. తర్వాత తన ఆర్థిక వ్యవస్థపై సాధించిన పట్టును క్రమంగా కోల్పోయింది. ఆ ప్రభావం గత ఐదు సంవత్సరాల నుంచి కనిపిస్తోంది. ఈ సంవత్సరానికి తన వృద్ధి లక్ష్యాన్ని 6.5శాతం నుంచి కనిష్టంగా 6శాతానికి సైతం తగ్గించింది. దీనికి కారణాలు అనేకం ఉన్నా.. మొదటి నుంచి తయారీపై దృష్టి కేంద్రీకరించిన చైనా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, సేవల ద్వారా నడిచే ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేసిన ప్రయత్నాలే ఆర్థిక మందగమనానికి దోహదం చేశాయనేది విశ్లేషకుల వాదన. స్టీల్, సిమెంట్, షిప్ బిల్డింగ్ వంటి భారీ పరిశ్రమలలో అధిక సామర్థ్యాన్ని తగ్గిస్తూ, అదే సమయంలో దేశీయ సంస్థలను ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. దీంతో టెన్సెంట్, అలీబాబా, హువావే వంటి దిగ్గజ కంపెనీలు ఇతర రంగాలలో తమ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకున్నా, సాంప్రదాయ ఉత్పాదక కంపెనీలు ఈ మార్పు కోసం కష్టపడుతుండటంతో వృద్ధికి బలమైన విఘాతం ఏర్పడింది. తిరిగి వృద్ధిని పెంచడానికి గత కొంతకాలంగా చైనా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవలే పన్నులను తగ్గించింది. అలాగే ఆర్థిక వ్యవస్థకు నూతన శక్తిని ఇవ్వడానికి మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచింది. కానీ, విశ్లేషకులు 2008 ఉద్దీపన ప్యాకేజీలాగా మరోసారి ఈ నమూనా పనిచేయకపోవచ్చని అంటున్నారు. దాని పాత పద్ధతులు కొత్తగా ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించలేక పోవచ్చనేది వారి భావన. ఏదేమైనా అనేక రంగాలలో దూసుకుపోతున్న చైనాను అమెరికా ట్రేడ్‌వార్‌తో నిలవరించలేదని, ఆర్థిక రంగాన్ని తిరిగి వృద్ధివైపు నడిపించగల శక్తి చైనా రాజకీయరంగానికి ఉందని అభిప్రాయపడుతున్నారు. -
బీర్ బాటిల్స్‌పై గాంధీ కార్టూన్.. తీవ్ర ఆగ్రహం!
ఇజ్రాయెల్‌లో బీరు బాటిల్స్‌పై మహాత్మాగాంధీ చిత్రాన్ని ముద్రించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇజ్రాయెల్ 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ బీర్ తయారీ కంపెనీలు మాల్కా బ్రేవరీ, నెగేవ్ బీర్స్ ఈ చర్యకు పాల్పడ్డాయి. తమ బీర్లకు పబ్లిసిటీ కల్పించేందుకు ఏకంగా వివిధ దేశాల ప్రముఖ వ్యక్తుల ముఖచిత్రాలను బీర్ బాటిళ్లపై ముద్రించాయి. ఇందులో భాగంగా టీ షర్ట్ వేసుకొని.. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్న మహాత్మాగాంధీ కార్టూన్‌ను బీర్ బాటిల్‌పై ముద్రించాయి. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఏకంగా బీర్ బాటిళ్లపై మహాత్మా గాంధీ కార్టూన్ ముద్రించి.. అవమానించడంపై భారతీయులు మండిపడుతున్నారు. ఈవిధంగా స్వాతంత్ర్యయోధులను కించపరిచిన ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహులకు లేఖలు రాశారు. ఇజ్రాయెల్‌లో పనిచేసే ఓ భారతీయుడు మొదట ఈ బీర్ బాటిల్‌ను ఆన్లైన్లో పోస్ట్ చేసి.. తన ఆవేదనను వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత జాతిపిత అయిన గాంధీని అవమానించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితమంతా మద్యం ముట్టనని తన తల్లికి వాగ్దానం చేసి.. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన గాంధీని ఇలా చేయడం నిజంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 సంవత్సరంలో కూడా అమెరికాకు చెందిన ఒక బీరు కంపెనీ గాంధీని అవమానించేలా ఓ వాణిజ్య ప్రకటనను రూపొందించింది. దీనిపై భారత ప్రభుత్వం నిరసన తెలపడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది. -
గ్రహ శకలాలతో ముంచుకొస్తున్న పెనుఉత్పాతం
సాక్షి : హాలివుడ్ సినిమాలో చూపినట్లుగా మనం ముందే మేల్కొనకపోతే గ్రహశకలాలతో భూమికి ప్రమాదం రాబోతోందా? మొత్తం మానవ సమాజం తుడిచిపెట్టుకుపోయేంత విపత్తు మనకు ఈ గ్రహశకలాలతో ఎదురుకానుందా?.. అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మొత్తం నాలుగు గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోకపోయినా గ్రహశకలాల వల్ల విపత్తు తలెత్తే అవకాశం ఉండటంతో జూన్ 30ని అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జూన్ 30నే ఎంచుకోవడానికి కారణం ఈ రోజే అతిపెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టింది కనుక. 1908 సంవత్సరం రష్యాలోని టుంగ్సుకా ప్రాంతంలో వేల ఎకరాల అడవిని నాశనం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రస్తుతానికి భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న ఈ నాలుగు గ్రహశకలాలకు 1979XB, అపోఫిస్, 2010RF12, 2000SG344 అని పేరు పెట్టారు. 1979xb గ్రహశకలం 900 మీటర్ల వ్యాసం గల ఈ గ్రహ శకలం మన భూగ్రహాన్ని ఢీకొడితే వినాశనమేనని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది గంటకు 70,000కిమి వేగంతో సౌర వ్యవస్థలో ప్రయాణిస్తుంటుంది. ప్రతి సెకనుకు 30 కిలోమీటర్లు భూమికి దగ్గరవుతూ భయపెడుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భూమికి ప్రమాదం తెచ్చే గ్రహశకలాల జాబితాలో దీనికి రెండవ స్థానం ఇచ్చింది. ఈ శతాబ్ధం మధ్యలో ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినా, ఖగోళ నిపుణులు మాత్రం ఇది 2024లోపే భూవాతావరణంలోకి ప్రవేశించొచ్చని అనుమానిస్తున్నారు. అపోఫిస్ నాలుగు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణం ఉన్న ఇది భూ కక్ష్యకు చాలా దగ్గరలో ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రస్తుతం భూమికి 200 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూ సెకన్‌కు 0.5 కిలోమీటర్ల చొప్పున భూమి దిశగా వస్తోంది. ఈ గ్రహ శకలం క్రమం తప్పకుండా భూ కక్ష్యలో వెళ్తుంది. తాజా రాడార్ సిగ్నల్ ప్రకారం ప్రకారం ఇది 2029లో భూమికి కేవలం 30,000 కి.మి చేరువకు వస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ మధ్యలో మన భూ కక్ష్య మీదుగా వెళ్తుంది. ఇక్కడ సంతోషకర విషయం ఏమంటే ఈసారి భూమికి 30 మిలియన్ కి.మి దూరంలో వెళ్లడం. ఇది గానీ భూమిని ఢీకొడితే 15,000 అణుబాంబుల శక్తి ఉత్పన్నం అవుతుంది. 2010 RF12 ఖగోళ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని సందేహాస్పద గ్రహశకలం ఇది. ఎర్త్ ఇంపాక్ట్ మానిటరింగ్ మరియు ఈఎస్‌ఏలు రెండింటిలోనూ దీన్ని ప్రమాదకర గ్రహశకలంగా నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం భూమికి 215 మిలియన్ కి.మి దూరంలో గంటకు 1,17,935 కి.మి వేగంతో ప్రయాణిస్తోంది. దీంతో ప్రమాదాన్ని ఈ శతాబ్దం చివరి వరకూ అంచనా వేయకపోయినా 500 టన్నుల బరువు, 7 మీటర్ల వ్యాసం గల ఇది భూమిని ఢీకొడితే 2013లో రష్యా పట్టణం చెల్యాబిస్క్‌పై ఉల్కపాతం పడినప్పుడు జరిగిన నష్టం కన్నా ఎక్కువే ఉంటుంది. అనుకోకుండా ఒక ఉల్కపాతం ఈ రష్యా నగరంపై పడి వేలాది భవనాలు దెబ్బతినడమే గాక వందల మంది గాయాలు పాలయ్యారు. 2010RF12 ఆగస్టు 13 2022లో భూమికి దగ్గరగా ప్రయాణిస్తుందని, అప్పుడు దీని భవిష్యత్ గమనాన్ని అంచనా వేయడానికి వీలుంటందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. 2000 Sg344 50 మీటర్ల వ్యాసం కలిగినా చాలా తక్కువ పరిమాణం ఉండటంతో ఇది కలిగించే ప్రమాదం కొంచెం తక్కువే. రష్యా పట్టణానికి కలిగిన నష్టంతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఇది భూమికి ప్రతి సెకనుకు 1.3 కి.మి చేరువ అవుతోంది. 2000 SG344 అనేది అటెన్ ఆస్టరాయిడ్స్ అని పిలువబడే ఒక సమూహంలో భాగం. ఈ సమూహంలోని గ్రహశకలాల కక్ష్యలు భూమి కక్ష్యకు చాలా దగ్గరగా ఉంటాయి. రాబోయే మూడు లేదా నాలుగు దశాబ్దాల్లో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. ఇంకా గుర్తించనివి.. మనకు ఇంకా తెలియని గ్రహశకలాలు చాలా ఉన్నాయి. ఇవి మనం గుర్తించక ముందే ఏ సెకను అయినా భూ వాతావరణంలోకి ప్రవేశించవచ్చు. మన సాంకేతికత ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ఉదాహరణకు రష్యా మీదకు వచ్చిన ఉల్కపాతాన్నిఅంచనా వేయలేకపోయాం. ఇది జపాన్‌పై 1945లో వేసిన అణుబాంబు కన్నా30 రెట్లు శక్తివంతమైంది. అలాగే డిసెంబరులో బేరింగ్ సముద్రంలో ఒక గ్రహశకలం పడింది. ఇది సముద్రంలో అణుబాంబు కన్నా10 రెట్లు శక్తివంతమైన అలజడిని రేపింది. గ్రహశకలాలతో మనకు ఏర్పడబోయే ప్రమాదాన్ని పసిగట్టిన ఐక్యరాజ్యసమితి గ్రహశకలాల ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అవగాహన కల్పించడానికే జూన్ 30ని అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవంగా ప్రకటించింది. -
సైన్యం అన్ని మతాలను స్వాగతిస్తుంది
-
ఘనంగా అంతర్జాతీయ గణిత దినోత్సవం
కోదాడఅర్బన్l: గణిత శాస్త్రజ్ఞుడు నీల్హెన్రిక్ ఎబెల్ జన్మదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలో హె^Œ ఆర్ టెక్నో పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబెల్ చిత్రపటానికి పాఠశాల చైర్మన్ డాక్టర్ రాజేశ్, సీపీఎం నాయకుడు జుట్టుకొండ బసవయ్యలతో పాటు పలువురు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణిత శాస్త్రంలో ఎబెల్ విశేష కృషి చేసి అనేక సిద్ధాంతలు, సూత్రాలు కనుగొన్నాడాన్నరు. గణితంలో ప్రాశస్తమైన ఎబెల్ ప్రైజ్‌ను ఆయన పేరుమీద ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో మెళుకువలు నేర్చుకుని రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూర్ణ, గణిత ఉపాధ్యాయులు గోలి సైదయ్య, గుర్నాధం, రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.