ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్టు వారెంట్ జారీ అయింది. నవంబర్ 18న కోర్టుకు హాజరుకావాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. వచ్చే నెల 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ఆదేశించారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు.
జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందగా, వాటిపై ట్రైబ్యునల్ ఇటీవల విచారణ ప్రారంభించింది. మరోవైపు ఆమె దౌత్య పాస్‌పోర్టు కూడా రద్దయింది.
హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్‌లో ఉండటాన్ని వ్యతిరేకిస్తుండగా, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారత్‌ను ఇటీవల కోరింది.
ఆమెను బంగ్లాకు అప్పగించాలని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్‌పీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: కెనడా ప్రధాని ఓవరాక్షన్.. ఖండించిన భారత్
Comments
Please login to add a commentAdd a comment