అమెరికా ఉత్పత్తులపై 15% టారిఫ్‌లు ప్రకటించిన చైనా | China to impose additional tariff on US products | Sakshi
Sakshi News home page

అమెరికా ఉత్పత్తులపై 15% టారిఫ్‌లు ప్రకటించిన చైనా

Published Tue, Mar 11 2025 5:15 AM | Last Updated on Tue, Mar 11 2025 5:15 AM

China to impose additional tariff on US products

వాషింగ్టన్‌: చైనా ఉత్పత్తులపై 20 శాతం టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 4న చేసిన ప్రకటనకు చైనా బదులు తీర్చుకుంది. అమెరికా వ్యవసాయోత్పత్తులు ముఖ్యంగా సోయా, బీఫ్, పోర్క్, చికెన్‌ ఉత్పత్తులపై అదనంగా 15 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. 

ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న ఉత్పత్తులపై ఈ నెల 12వ తేదీ వరకు టారిఫ్‌లను మినహాయించనున్నట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ ప్రకటనతో అమెరి కా పెట్టుబడిదారుల్లో భయాలు మొదలయ్యాయి. గతవారం మెక్సికో, కెనడాల దిగుమతులపై ట్రంప్‌  టారిఫ్‌లను విధించడం ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై తిరిగి టారిఫ్‌లను విధించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement