additional tax
-
భారీగా సవరణ రిటర్నులు
న్యూఢిల్లీ: సవరణ రిటర్నులు ఆదాయపన్ను శాఖకు అదనపు పన్ను ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. గడిచిన రెండేళ్లలో 56 లక్షల మేర సవరించిన ఐటీ రిటర్నులు దాఖలు కాగా, వీటి ద్వారా రూ.4,600 కోట్ల పన్ను ఆదాయం సమకూరినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చీఫ్ నితిన్ గుప్తా ప్రకటించారు. తమ సేవలను మెరుగుపరుచుకుంటూ, వివాద రహిత వాతావరణం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఒకసారి దాఖలు చేసిన ఐటీఆర్‌లకు సంబంధించి సవరణలు చేసుకునే అవకాశాన్ని 2022–23 బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత నుంచి రెండు సంవత్సరాల వరకు ఇలా సవరణలు దాఖలు చేసుకునే వెసులుబాటు వచి్చంది. రూ.కోటికి పైగా పన్నుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారానికి వీలుగా కర్ణాటకలోని మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు గుప్తా వెల్లడించారు. 2014–15 నాటికి రూ.25వేల వరకు పెండింగ్‌లో ఉన్న పన్ను డిమాండ్లను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర బడ్జెట్లో మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. ఇలాంటి 1.1 కోట్ల పన్ను డిమాండ్ల ఉపసంహరణతో కేంద్రం రూ.2,500–3,600 కోట్లను కోల్పోనుంది. కానీ, ఈ వెసులుబాటు 80 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పస్తుందని నితిన్ గుప్తా తెలిపారు. ఏటా పన్నుల ఆదాయం రూ.19.5 లక్షల కోట్లతో పోలిస్తే ఇది స్వల్ప మొత్తమేనన్నారు. -
అప్డేటెడ్ ఐటీఆర్‌ల రూపంలో రూ.400 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల సవరణకు అనుమతించడం వల్ల.. కొత్తగా 5 లక్షల సవరించిన (అప్డేటెడ్) రిటర్నులు దాఖలు కావడంతోపాటు, రూ.400 కోట్ల అదనపు పన్ను ఆదాయం కేంద్రానికి వచ్చింది. ఫైనాన్స్ యాక్ట్, 2022లో సవరించిన రిటర్నుల క్లాజును ప్రవేశపెట్టడం తెలిసిందే. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఒకసారి రిటర్నులు సమర్పించిన అసెస్మెంట్ ఏడాది నుంచి, రెండేళ్లలోపు సవరణలు దాఖలు చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఐటీఆర్–యు పత్రం ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వచ్చింది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైనా ఆదాయం వెల్లడించకపోయి ఉంటే, ఈ నూతన ఫామ్ రూపంలో సవరణలు దాఖలు చేసుకునే అవకాశం లభించింది. దీంతో 5 లక్షల మంది ఐటీఆర్–యు దాఖలు చేసి రూ.400 కోట్ల పన్ను చెల్లించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. నిబంధనల అమలు సులభతరం అయిందని, కార్పొరేట్లు సైతం సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చన్నారు. ‘‘ఒక కంపెనీ సవరించిన రిటర్నులు సమర్పించి రూ.కోటి పన్ను చెల్లించింది. స్వచ్ఛందంగా నిబం«దనలను అనుసరిస్తున్న వారు పెరుగుతున్నారు. ప్రజలు పన్ను చెల్లించి స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నారు’’అని ఆ అధికారి వాస్తవ పరిస్థితి వివరించారు. సవరణ రిటర్నుల్లో, గతంలో పేర్కొనని ఆదాయ వివరాలు వెల్లడిస్తున్నట్టు అయితే అందుకు కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
రిలయన్స్‌కు భారీ దెబ్బ: బ్యారల్‌పై 12 డాలర్ల మార్జిన్ ఫట్!
న్యూఢిల్లీ: దేశీయ ముడి చమురు ఉత్పత్తి, ఇంధన ఎగుమతులపై ప్రభుత్వం విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు (ఆర్ఐఎల్) రిఫైనింగ్ మార్జిన్లలో బ్యారెల్‌కు 12 డాలర్ల వరకూ కోత పెట్టనుంది (ప్రస్తుత మార్జిన్ 25 డాలర్లు). ఇక ఓఎన్జీసీ ఆదాయంపై కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త పన్నుల వల్ల ప్రభుత్వానికి రూ. 1.3 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను లేదా బ్యారల్‌కు 40 డాలర్లు (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధించింది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్‌పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలనార్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీనితోపాటు పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.75 శాతం నుంచి 15 శాతానికి చేరింది. ఆయా అంశాలపై బ్రోకరేజ్ సంస్థల నివేదికలు పరిశీలిస్తే... రవాణా ఇంధనాలపై రూ.68,000 కోట్లు గత సంవత్సరంలో డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతి పరిమాణం ఆధారంగా 2022–23 అంచనాలను మేము లెక్కగట్టాం. మేము మూడు రవాణా ఇంధనాలపై (పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్) రూ. 68,000 కోట్ల అదనపు ఆదాయాలను అంచనా వేస్తున్నాము. అదేవిధంగా, ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నులు అదనపు ఆదాయాలలో రూ. 70,000 కోట్లను పెంచే వీలుంది. దీనివల్ల రిలయన్స్ మార్జిన్ల విషయంలో బ్యారెల్‌కు 12 డాలర్ల మేర (వార్షిక ప్రాతిపదికన రూ. 47,000 కోట్లు) ప్రభావం చూపగలవని అంచనా. – నోమురా లోటు భర్తీ లక్ష్యం... : 2022 మేలో ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కేంద్రం ఆదాయాలు ఒక లక్ష కోట్లు తగ్గాయని అంచనా. అదనపు ఎక్సైజ్ సుంకం (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధింపు ప్రకటన ఇప్పుడు వెలువడింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 మేలో తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆదాయ అంతరాన్ని పూరించడమే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. తాజా నిర్ణయం వల్ల రూ. 1.2 లక్షల కోట్ల ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుందని భావిస్తున్నాం. దీనితోపాటు దేశీయ మార్కెట్ నుండి ఉత్పత్తుల ఎగుమతిని కూడా నిరుత్సాహపరచడానికి కూడా తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నాము. క్రూడ్ ఉత్పత్తిపై విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల రూ.65,600 కోట్లు, ఎగుమతి ఉత్పత్తులపై పన్నులు ఏడాది పాటు కొనసాగితే మరో రూ.52,700 కోట్ల ఆదాయం సమకూరుతుందని మా అంచనా. కొత్త పన్ను వల్ల ఓఎన్జీసీ ఆదాయాలు ఒక్కో షేరుకు రూ.30 తగ్గే అవకాశం ఉంది. ఆర్‌ఐఎల్‌పై దీని ప్రభావం రూ.36గా ఉంటుందని అంచనా. అయితే ఆర్ఐఎల్ దేశీయ మార్కెటింగ్ మార్జిన్లో నష్టం... ఎగుమతి పన్ను కంటే ఇంకా ఎక్కువగా ఉందని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల ఆర్ఐఎల్ గణనీయమైన మొత్తాలలో ఎగుమతి చేయడాన్ని కొనసాగించవచ్చని మేము భావిస్తున్నాము. – హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ భారీ పన్ను రాబడులు: ఇదే నిర్ణయం ఇకముందూ కొనసాగితే, పన్నుల వల్ల వార్షిక ప్రాతిపదికన కేంద్రానికి రూ. 1.3 లక్షల కోట్ల అదనపు పన్ను రాబడులు వస్తాయని భావిస్తున్నాం. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం ఒనగూడుతుందని అంచనా. - కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ 1.38 లక్షల కోట్ల అదనపు పన్ను : అదనపు పన్నుల ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 1.38 లక్షల కోట్లను సేకరించవచ్చన్నది మా అంచనా. – యూబీఎస్ అంచనా -
అక్రమ ఇళ్లపై అదనపు పన్ను
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేకుండా, అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన అక్రమ భవనాలు, గృహాలపై పురపాలక సంఘాలు కొరడా ఝళిపిస్తున్నాయి. అక్రమాలు, ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను జరిమానా కింద ప్రతి ఏటా అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో అక్రమ భవనాలు, గృహాల యజమానులు చెల్లించాల్సిన వార్షిక ఆస్తి పన్నులు 125 శాతం నుంచి 200 శాతం వరకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 142 పురపాలక సంఘాలు ఉండగా, జీహెచ్ఎంసీ నేరుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పరిధిలో ఉంది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్(సీడీఎంఏ) పరిధిలో మిగిలిన 141 పురపాలికలు ఉన్నాయి. ఈ 141 పురపాలికల్లో ఇప్పటివరకు గుర్తించిన అక్రమ భవనాలు, గృహాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.93.15 కోట్ల జరిమానాలు విధించగా, ఇందులో రూ.31.08 కోట్లను సంబంధి త భవన యజమానులు చెల్లించారు. జీహెచ్ఎంసీ లో సైతంఇదే తరహాలో అక్రమ భవనాలు, గృహాలపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ వీటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంది. వరంగల్, నిజామాబాద్‌ల్లో అత్యధిక జరిమానాలు అనుమతి లేకుండా లేదా బిల్డింగ్ ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను ప్రతి ఏటా జరిమానా కింద అదనంగా వసూలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ 2016 డిసెంబర్ 20న జీవో 299 జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని పురపాలికల్లోని అక్రమ, అనధికార కట్టడాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. 141 పురపాలికల్లో వార్షిక ఆస్తి పన్నుల మొత్తం రూ.538.47 కోట్లతో పోల్చితే జరిమానాలు 17 శాతానికి మించి పోయాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. అక్కడ వార్షిక ఆస్తి పన్నుల మొత్తం డిమాండ్ రూ.49.94 కోట్లు కాగా, జరిమానాలు రూ.33.01 కోట్లు ఉండడం విశేషం. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.29.61 కోట్ల వార్షిక ఆస్తి పన్ను ఉండగా, రూ.18.19 కోట్ల జరిమానాలు విధించారు. 60 శాతం వసూళ్లు జీహెచ్ఎంసీ మినహా ఇతర 141 పురపాలికల్లో 20,22,171 భవనాలు/గృహాలు ఆస్తి పన్నుల పరిధిలో ఉండగా, 2020–21లో రూ.538.47 కోట్ల ఆస్తి పన్ను, రూ.230.22 కోట్ల పాత బకాయిలు, రూ.93.15 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.861.84 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో రూ.359.81 కోట్ల ఆస్తి పన్ను, రూ.127.77 కోట్ల పాత బకాయిలు, రూ.31.08 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.518.66 కోట్లు వసూలయ్యాయి. మొత్తం డిమాండ్‌తో పోల్చితే ఇప్పటివరకు 60.18 శాతం వసూళ్లు జరిగాయి. వచ్చే మార్చి 31లోగా 100 శాతం వసూళ్లను సాధించేందుకు పురపాలక శాఖ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. జరిమానాలు ఇలా.. జీవో ప్రకారం..అనుమతించిన ప్లాన్ మేరకు నిర్మించిన భవన అంతస్తుల్లో 10 శాతానికి లోబడి సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 25 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన అంతస్తుల్లో 10 శాతానికి మించి సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 50 శాతం ఆస్తి పన్నును అధికంగా వసూలు చేస్తున్నారు. ప్లాన్‌లో అనుమతించిన అంతస్తులపై అనధికారికంగా అంతస్తులు నిర్మిస్తే.. అలా అనధికారికంగా నిర్మించిన అంతస్తులపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా నిర్మించిన అనధికార కట్టడాలపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. -
డీజిల్ కారు కొంటే 2 శాతం అదనపు పన్ను!
సాక్షి, హైదరాబాద్: డీజిల్ కారు కొంటే ఇకపై 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వానికి రవాణా శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించనుంది. ప్రస్తుతం రూ.10 లక్షల లోపు ధర ఉన్న డీజిల్ కారుకు 12 శాతం పన్ను విధిస్తుండగా.. ఇకపై అది 14 శాతానికి పెరుగుతుంది. అదే రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న డీజిల్ కార్లపై పన్ను 16 శాతంగా ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణలో అమ్ముడవుతున్న డీజిల్ కార్ల సంఖ్య ఆధారంగా బేరీజు వేసుకుంటే ప్రభుత్వానికి ఈ అదనపు పన్ను రూపంలో కనిష్టంగా ఏడాదికి రూ.130 కోట్ల ఆదాయం సమకూరనుంది. అంటే అంత మొత్తం వాహనదారులపై భారం పడినట్లేనన్నమాట. డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సమీప భవిష్యత్తులో ఏకంగా డీజిల్ కార్ల అమ్మకాలను నిషేధించే యోచన కూడా ఉంది. వాటితో వాతావరణ కాలుష్యం పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఢిల్లీ వంటి నగరాల్లో నిషేధం అమలులోకి కూడా వచ్చింది. తెలంగాణలో అంత ప్రమాదం లేనందున, డీజిల్ కార్ల కొనుగోలుపై వాహనదారుల్లో ఆసక్తి తగ్గించేందుకు పన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి 2 శాతం అదనపు పన్ను విధించాలంటూ రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రెండో వాహనం కొంటే అదనపు భారం లేనట్టే.. ఇక రెండో వాహనం కొనటాన్ని తగ్గించే యోచనతో గతంలో విధించిన రెండు శాతం అదనపు పన్నును ఎత్తేయబోతున్నారు. వాహనం ఏదైనా రెండోది కొంటే 2 శాతం అదనపు పన్ను చెల్లించే విధానం అమలులో ఉంది. దాని వల్ల కొత్త రిజిస్ట్రేషన్లు ఏమాత్రం తగ్గలేదని, ఆ ఆలోచన ఆశించిన ప్రయోజనం ఇవ్వలేదని రవాణా శాఖ అభిప్రాయపడుతోంది. పైపెచ్చు దాని వల్ల తీవ్ర గందరగోళం నెలకొని వాహనదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఓ వ్యక్తి ఎప్పుడో కొన్న తొలి వాహనాన్ని విక్రయించిన తర్వాత మరో వాహనం కొన్నా ఈ రెండు శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తోంది. తాను మొదటి వాహనాన్ని వాడటం లేదని, దాన్ని ఎన్నడో అమ్మేసినట్టు మొత్తుకున్నా అధికారులు వినటం లేదు. మరోవైపు కొన్ని వర్గాల్లో ఎక్కువ మందికి ఒకే రకం పేర్లు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వారి తండ్రుల పేర్లు కూడా ఒకేలా ఉంటున్నాయి. అలాంటి వారు తొలి వాహనం కొన్నా, అదే పేరున్న మరో వ్యక్తికి అప్పటికే ఓ వాహనం ఉంటే, దాన్ని మరొకరు రెండో వాహనం కొన్నట్టుగా పొరబడుతూ అధికారులు ఈ రెండు శాతం పన్ను విధిస్తున్నారు. తనకు మరో వాహనం లేదని మొత్తుకుంటున్నా, కంప్యూటర్లోని జాబితాలో ఆ పేరు గల వ్యక్తికి అప్పటికే ఓ వాహనం ఉన్నట్టు చూపుతోందని అధికారులు చెబుతున్నారు. దీనిపై వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులకు వెరిఫికేషన్ పెద్ద సమస్యగా మారింది. వీటిని దృష్టిలో ఉంచుకుని రెండో వాహనం కొంటే 2 శాతం అదనపు పన్ను చెల్లించే విధానం ఎత్తేయాలంటూ తాజాగా ప్రభుత్వానికి రవాణా శాఖ ప్రతిపాదించింది. దీన్ని ఎత్తేయటం వల్ల ప్రభుత్వం ఏడాదికి రూ.21 కోట్ల మేర అదనపు రాబడి కోల్పోతుందని నివేదికలో పేర్కొంది. డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించటం వల్ల వచ్చే రాబడితో పోలిస్తే ఇది పెద్ద నష్టం కాదని సూచించింది. -
రియల్టీ కంపెనీలపై జీఎస్టీ భారం..
కోల్‌కతా: రియల్ ఎస్టేట్ కంపెనీలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నోట్ల రద్దు తర్వాత మళ్లీ ఇప్పుడు జీఎస్టీ వల్ల రియల్టీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. జీఎస్టీ అమలు వల్ల రియల్ ఎస్టేట్ కంపెనీలపై 5–6 శాతం అదనపు పన్ను భారం పడుతోంది. కంపెనీలు దీన్ని భరించడానికి సన్నద్ధమౌతున్నాయి. ‘మేం పలువురు బిల్డర్లతో మాట్లాడాం. వీరు జీఎస్టీ అమలు వల్ల కలిగే అదనపు పన్ను భారాన్ని మోయడానికి తగిన మార్గాలు అన్వేషిస్తున్నారు’ అని నైట్ ఫ్రాంక్ చీఫ్ ఎకనమిస్ట్, నేషనల్ డైరెక్టర్ సమంతక్ దాస్ తెలిపారు. కాగా రియల్ ఎస్టేట్‌పై పన్ను జీఎస్టీకి ముందు 6–7 శాతంగా ఉంటే.. జీఎస్టీ తర్వాత 12 శాతంగా ఉంది. -
వాహనాల రిజిస్ట్రేషన్లలో స్తబ్దత
- ‘రెండో వాహనం’పై కొనసాగుతున్న గందరగోళం - ఒకే తరహా పేర్లతో చిక్కులు... విచారణలో జాప్యం సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ ఆర్టీయేకు తలనొప్పిగా మారింది. ఒకే తరహా పేర్లుండటం... రెండో వాహనానికి రెండు శాతం అదనపు పన్ను చెల్లించాల్సి రావడం... వెరసి అటు ఆర్టీఏ... ఇటు వాహనదారులను గందరగోళంలోకి నెట్టేసింది. నిబంధనల ప్రకారం రెండో వాహనం కొంటే 12 శాతం లైఫ్ టాక్స్‌కు 2 శాతం పన్ను అదనంగా కట్టాలి. ఇందుకు ఆర్టీఏ అధికారులు ఆన్లైన్ డేటా ఆధారంగా రిజిస్ట్రేషన్ సమయంలో వాహన దారుల వివరాలు బయటకు తీస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే తరహా పేర్లతో గతంలో వాహనాలు రిజిస్టర్ అయినట్టు చూపిస్తోంది. దీంతో సదరు వాహనదారుడుకి ఉన్నది ఒకటే వాహనం అయినా... తమ వద్దనున్న డేటా ప్రకారం అతడికి రెండో వాహనం ఉన్నట్టు అధికారులు పరిగణిస్తున్నారు. రెండు శాతం అదనపు పన్ను కట్టాలని చెబుతున్నారు. దీంతో వాహనదారులు కంగుతింటున్నారు. తమకిదే తొలి వాహనమని, తమ పేరున్న ఆ వ్యక్తెవరో తెలియదని మొత్తుకుంటే... ఆ వ్యక్తి వివరాలు తెమ్మని తిప్పి పంపుతున్నారు. లేదంటే అఫిడవిట్ ఇవ్వమని అడుగుతున్నారు. తమకు సంబంధం లేని వివరాలు తామెక్కడి నుంచి తెస్తామని కొత్త వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు డీలర్లు, వాహనదారులు 2 శాతం అదనపు పన్ను ఎగవేతకు తప్పుడు పేర్లు, అడ్రస్‌లతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కూడా ఈ చిక్కులకు కారణమవుతోంది. ఈ గందరగోళం మధ్య రిజిస్ట్రేషన్లు మందగిం చి... ఆర్టీఏ ఆదాయానికి గండి పడింది. 25 శాతానికి పైగా బ్రేక్... గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో రోజూ 1,000 నుంచి 1,200 కొత్త వాహనాలు నమోదవుతాయి. ఒకే తరహా పేర్లున్న వ్యక్తులపైన విచారణ కారణంగా రిజిస్ట్రేషన్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాహనదారులు ఒకటికి నాలుగుసార్లు ఆర్టీఏ చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్లు 25 శాతానికి పైగా పడిపోయినట్లు సమాచారం. రెండో వాహనంపైన చెల్లించవ లసిన అదనపు పన్ను వసూలు చేయకుండా వాహనదారులకు సహకరించారనే కారణంపై ప్రభుత్వం ఇటీవల 10 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసి, మరి కొందరికి షోకాజ్ నోటీస్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీఏ సిబ్బంది రిజిస్ట్రేషన్లంటేనే జంకుతున్నారు. కంప్యూటర్, డీలర్ల వద్ద జరిగే పొరపాట్లకు తాము బలవుతున్నా మంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం లేదా... మొత్తంగా ఈ రెండో వాహనం వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు 6 నెలల క్రితమే ఒక ప్రతిపాదన చేశారు. డీజిల్ వాహనాలపైన ఇప్పుడున్న 12 శాతం పన్ను ను 13 శాతానికి పెంచి, రెండో వాహనంపై అదనపు పన్ను నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం కేసీఆర్ సైతం సంతకం చేశారు. దీని అమలు ఆరు నెలలకు పైగా పెండింగ్‌లోనే ఉంది. -
డీజిల్ కార్లకు అదనపు పన్ను
- రెండో వాహనానికి మరింత వడ్డింపు - పెట్రోలు కార్లకు మాత్రం మినహాయింపు - ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. త్వరలో ఉత్తర్వు జారీ సాక్షి, హైదరాబాద్: డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా డీజిల్ కార్ల పెరుగుదలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వు వెలువడనుంది. దేశ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తీవ్రమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని పెరుగుదలకు దోహదం చేస్తున్న డీజిల్ వాహనాలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశంతో... దేశంలో డీజిల్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి వాతావరణ కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ వాహనాలపై నియంత్రణ చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు భారత్ స్టేజ్–3 (బీఎస్–3) వాహనాలను పూర్తిగా నిషేధిం చారు. తెలంగాణలో క్రమంగా కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు డీజిల్ కార్ల కొను గోలుకే మక్కువ చూపుతున్నారు. దీంతో ఇక్కడ కూడా వాటిపై మోజు తగ్గేలా చేసేందు కు డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు సమాచారం. రెండో డీజిల్ వాహనానికి మరింత పన్ను రెండో వాహనం కొంటే అదనపు పన్ను విధించే నిబంధనను కూడా సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్ వాహనాలకు ఈ పన్ను ను మరింతగా పెంచనున్నారు. ప్రస్తుతం రూ. 10 లక్షలు, అంతకంటే తక్కువ ధర ఉన్న కార్లకు 12 శాతం పన్ను విధిస్తున్నారు. అంతే విలువైన రెండో కారు కొంటే అదనంగా 2 శాతం పన్ను చెల్లించాలి. ఇప్పుడు పెట్రోలు కార్లకు ఈ అదనపు పన్ను ఉండదు. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం కార్యాలయంలో ఉంది. సీఎం సంతకం కాగానే ఉత్తర్వు వెలువడనుంది. ‘రెండో వాహనం పన్ను’ అక్రమాలపై మళ్లీ విచారణ ‘రెండో వాహనం పన్ను’ అక్రమాలపై మళ్లీ విచారణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014–15 సంవత్సరానికి గాను రెండో వాహనం కొన్నవారికి ఈ పన్ను భారం పడకుండా కొంతమంది రవాణాశాఖ సిబ్బంది కమీషన్లు దండుకుని కథ నడిపారు. అప్పటికే ఓ వాహనం ఉందని గుర్తించే సాఫ్ట్వేర్ లేకపోవడం, వివరాల నమోదు లోపభూయిష్టంగా ఉండటాన్ని సిబ్బంది ‘క్యాష్’చేసుకున్నారు. దీంతో నాటి రవాణా కమిషనర్ సుల్తానియా విచారణకు ఆదేశించారు. ఇందులో 200 వాహనాలకు పన్ను వసూలు చేయలేదని, దీనికి పది మంది బాధ్యులని గుర్తించారు. కానీ ఉన్నట్టుండి విచారణను అక్కడితో నిలిపి వేయటమే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఆ విచారణను అటకెక్కించేం దుకు సిబ్బంది తరపున కొందరు వకాల్తా పుచ్చుకుని తెరవెనక తతంగం నడిపారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ వ్యవహారం పై కూడా విచారణ జరపాలని నిర్ణయించి నట్టు సమాచారం. అసలు మధ్యలో ఆ విచారణను ఎందుకు ఆపారో తేల్చి సీఎంకు Sనివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. -
పెట్రోల్, డీజిల్ పై ‘లెవీ’ మోత!
దొడ్డిదారిన రూ.480 కోట్లు సమకూర్చుకునేందుకు సర్కారు ఎత్తుగడ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నుల ద్వారా రూ.480 కోట్లు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘లెవీ’ విధించాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రాష్ట్రంలో విక్రయించే పెట్రోల్, డీజిల్‌లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా లీటర్‌పై ఒక రూపాయి ‘లెవీ’ విధించాలని సూచించింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేయడమే మిగిలింది. పెట్రోల్, డీజిల్‌లపై వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న వ్యాట్‌కు ఈ ‘లెవీ’ అదనం. ఏటా రూ.6,500 కోట్లు రాష్ట్రంలో వినియోగమవుతున్న పెట్రోల్, డీజిల్‌పై ‘వ్యాట్’ ద్వారా 2015 ఏప్రిల్ నుంచి 2016 ఫిబ్రవరి వరకు రూ.5,956 కోట్లు వసూలైంది. మార్చి నెలలో మరో రూ.550కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా. పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్ ద్వారానే ఈ మొత్తం సమకూరింది. వాస్తవానికి 2015-16లో పెట్రోల్, డీజిల్‌మీద రూ.7,850కోట్లు వస్తుందని అంచనా వేయగా... ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో సుమారు రూ.6,500కోట్ల (82 శాతం) వరకు వసూలవుతోంది. ఈ నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో వెయ్యి కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ మీద లీటర్‌కు ఒక రూపాయి చొప్పున ‘లెవీ’ వసూలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా సంవత్సరానికి రూ.480కోట్లు వసూలవుతుందని అంచనా వేశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచకుండా రూ.4 అదనంగా వసూలు చేస్తున్నారు. అలా తెలంగాణలో కన్నా లీటరుకు ఒక రూపాయి ఎక్కువగా సమకూరుతోంది. దీంతో వ్యాట్‌ను పెంచడం కన్నా, ‘లెవీ’ వసూలు చేయడమే మేలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ఫైలు సీఎంవోలో ఉన్నట్లు సమాచారం. మరిన్ని అంశాల్లోనూ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ వసూళ్ల లక్ష్యం రూ.42,073కోట్లుగా తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) సంబంధించి ఫిబ్రవరి వరకు రూ.27,873 కోట్లు వసూలుకాగా... ఈనెలాఖరుకల్లా మరో రూ.3వేల కోట్లు సమకూరుతుందని అంచనా. అయితే పెరిగిన వసూళ్ల అంచనాలకు అనుగుణంగా ఆదాయం సమకూర్చుకునే పనిలో వాణిజ్య పన్నుల శాఖ పడింది. లీజు లావాదేవీలపై పన్నుల ద్వారా రూ.60కోట్లు సమకూర్చుకునే బిల్లును ఇటీవలే అసెంబ్లీ ఆమోదించింది. ఇన్వాయిస్ ట్రాకింగ్ విధానం ద్వారా రూ.120కోట్లు వసూలు చేసే ప్రతిపాదనను మే నుంచి అమలు చేయనున్నారు. డీటీహెచ్ మీద వినోదపన్ను రూపంలో మరో రూ.24 కోట్లు, హెచ్ఆర్బీటీ చట్టం అమలు ద్వారా రూ.10 కోట్లు, కేబుల్ కనెక్షన్లపై వినోద పన్నును రూ.5 నుంచి రూ.10కి పెంచడం ద్వారా మరో రూ.20 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. మొత్తంగా రూ.864 కోట్లు అదనంగా వసూలు చేసే ఈ ప్రతిపాదనల్లో కొన్ని ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వాటికి ఆమోదం లభించనుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ధాన్యం సేకరణ పన్నుపైనా లెవీ రైతుల నుంచి ధాన్యం సేకరణపై కొనుగోలు పన్ను (పర్చేస్ ట్యాక్స్)ను ఇప్పటికే వసూలు చేస్తుండగా, అదనంగా ‘లెవీ’ వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రతిపాదించింది. తద్వారా ఏడాదికి రూ.150కోట్లు వసూలవుతుందని భావిస్తున్నారు. రైతు పండించిన పంటకు ఎలాంటి పన్ను వసూలు చేయని ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి విక్రయించే వారిపైన, రైస్‌మిల్లర్లు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారిపై పన్ను విధిస్తోంది. తద్వారా వసూలవుతున్న పన్నుకు అదనంగా ‘లెవీ’ని విధించనుంది. -
జీఎస్టీలో ‘అదనపు పన్ను’ సరికాదు: రంగరాజన్
హైదరాబాద్: అంతర్రాష్ట్ర అమ్మకాలపై ఒక శాతం అదనపు పన్ను ప్రతిపాదన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్పూర్తికి వ్యతిరేకమని ప్రముఖ ఆర్థికవేత్త సీ రంగరాజన్ ఇక్కడ పేర్కొన్నారు. ఈ తరహాలో జీఎస్టీని అమలు చేయరాదని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన రంగరాజన్ జీఎస్టీ విషయంపై తాజాగా తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. జీఎస్టీ వ్యవస్థ ఎంతో మంచి చొరవన్నది తన అభిప్రాయమన్నారు. దీని అమలు విషయంలో ఒక ఏకాభిప్రాయ సాధన సత్వరం అవసరమని అభిప్రాయపడ్డారు. నల్లధనం వెలికితీతకు తగిన చర్యలు అమలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. అయితే ఈ విషయంలో రెండు చర్యలు అవసరం అని మాత్రం అన్నారు. ఇందులో ఒకటి విదేశాల నుం చి నల్లదనాన్ని వెనక్కు తీసుకురావడానికి ఉద్దేశించిందన్నారు. ఇక రెండవది దేశంలో నల్లధనం నిరోధానికి చేపట్టాల్సిన చర్యలని వివరించారు. -
జీఎస్టీ బిల్లుకు సెలెక్ట్ కమిటీ మద్దతు
భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన కాంగ్రెస్, అన్నాడీఎంకే, లెఫ్ట్ పార్టీలు న్యూఢిల్లీ: దేశ పరోక్ష పన్ను వ్యవస్థలో భారీ సంస్కరణలకు ఉద్దేశించిన ‘వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ’ బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. జీఎస్టీ బిల్లును అధ్యయనం చేసేం దుకు బీజేపీ సభ్యుడు భూపేందర్ యాద వ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన 21 మంది సభ్యు ల కమిటీ బుధవారం రాజ్యసభకు తన నివేదికను సమర్పించింది. జీఎస్టీ అమలు వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు మొత్తం నష్టా న్ని పరిహారంగా ఇవ్వాలన్న ప్రతిపాదన సహా బిల్లులోని దాదాపు అన్ని ప్రతిపాదనలను కమిటీ ఆమోదించిది. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు గణనీయంగా ఆదాయాన్ని కోల్పోతాయని, ఆ మేరకు కేంద్రం పరిహారం అందించాలని టీఎంసీ సహా పలు పార్టీలు డిమాండ్ చేసిన విషయంతెలిసిందే.అంతర్రాష్ట్ర సరుకు రవాణా విషయంలో రాష్ట్రాలకు అదనంగా 1 శాతం లెవీ విధించుకునే అధికారానికి సంబంధించి కూడా కమిటీ ఒక సవరణ చేసింది. అమ్మిన వస్తువులపైననే ఆ 1% అదనపు పన్ను విధిం చాలని, కంపెనీల మధ్య జరిగే వస్తు నిల్వల అంతర్రాష్ట్ర రవాణాపై ఆ అదనపు భారం వేయకూడదని సూచించింది. ఈ విషయాన్ని బిల్లులో వివరించాలంది. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,అన్నాడీఎంకే, లెఫ్ట్ సభ్యు లు నివేదికలో తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును యథాతథంగా అంగీకరించబోమన్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం లభించ గా.. రాజ్యసభలో మెజారిటీ ఉన్న విపక్షాల ఒత్తిడిపై ఎంపికసంఘానికి పంపించారు. 2016, ఏప్రిల్ 1నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. కమిటీచేసిన సూచనలు.. -అదనపుపన్ను విధింపు అధికారాన్ని ఇప్పుడు బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. పన్ను భారంపెరుగుతుంది. బిల్లులో పేర్కొన్న అన్ని రకాల సరఫరా’ అనే పదంలో ‘సరఫరా’ అనేపదాన్ని స్పష్టంగా నిర్వచించాలి. * పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధింపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందన్న నిర్ణయం హర్షణీయం. * రాష్ట్రాల ఆదాయ వనరులు పెంచేందుకు ‘బ్యాండ్ రేట్’ నిర్వచనాన్ని చట్టంలోనే పొందుపర్చాలి. స్థానిక అవసరాల కోసం ఎంపిక చేసిన వస్తు, సేవలపై రాష్ట్రాలు అదనపు పన్ను విధించుకోవచ్చు. అయితే, అది బ్యాండ్ రేట్ పరిధి లోపలే ఉండాలి. -
బాబు మార్కు బడ్జెట్!
హద్దూ, అదుపూ లేకుండా ఇచ్చిన హామీలకూ... కళ్లముందున్న వాస్తవాలకూ పొంతన కుదరనప్పుడు జనం ముందు తప్పు ఒప్పుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. పారదర్శకంగా వ్యవహరించడం తప్ప మార్గం లేదు. అయితే, అందుకు చిత్తశుద్ధి ఉండాలి. అదిలేకపోబట్టే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2015-16 ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు భారీ గణాంకాల మాటున దాగవలసివచ్చింది. అందమైన మాటల వెనక వైఫల్యాలను కప్పెట్టే యత్నం చేయాల్సివచ్చింది. ఒకపక్క లక్షా 13 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ పరుస్తూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకుగానీ, అధికారంలోకొచ్చాక కురిపించిన వరాలకుగానీ ఆయన చోటివ్వలేకపోయారు. నిరుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కూ, ఇప్పటికీ చంద్రబాబు సర్కారు సాధించిన పురోగతి ఏమైనా ఉంటే అది జనం తలసరి అప్పును అమాంతం పెంచడమే! ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి అప్పులు రూ. 1,29,264 కోట్లుంటే...వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 17,588 కోట్లు అప్పుతీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఇదింకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే రూ. 12,000 కోట్ల వరకూ అప్పు తప్పదని నిరుడు అంచనావేసిన ప్రభుత్వం దాన్ని రూ. 20,000 కోట్లకు పెంచింది. ఈ అప్పులనైనా ఆస్తుల కల్పనకు ఖర్చుచేసి ఉంటే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉండేది. కానీ, ఎక్కువ భాగాన్ని రెవెన్యూ వ్యయానికే ఉపయోగిస్తున్నారు. పర్యవసానంగా పెరిగేవి అప్పులే. వాటిపై కట్టాల్సిన వడ్డీలే. కనుక ఈసారి ద్రవ్యలోటు రూ. 17,584 కోట్లుగా అంచనావేసినా చివరకు అది అంతకన్నా ఎక్కువగా పెరిగే అవకాశం లేకపోలేదు. అప్పులు చేయడంపై విధించిన 14వ ఆర్థిక సంఘం పరిమితులను కూడా మించిపోవడమంటే వ్యయంపై ప్రభుత్వానికి అదుపు లేకపోవడమే. పాలనలో సుదీర్ఘ అనుభవమున్నదని తరచు చెప్పుకునేవారు చేయాల్సిన పనేనా ఇది?! అదనపు పన్నుల భారాన్ని మోపడం లేదంటూనే...వచ్చే ఏడాదిలో పన్నుల ద్వారా అదనంగా రూ. 7,000 కోట్లు వస్తుందని యనమల అంచనావేస్తున్నారు. ఈ అదనపు ఆదాయాన్ని రాబట్టడానికి ‘ఇతర మార్గాలు అన్వేషిస్తామ’నడం తప్ప ఏం చేయదల్చుకున్నదీ ఆయన చెప్పలేదు. పన్నుల రూపంలో మొత్తం రూ. 44,432 కోట్లు వస్తుందంటూనే వ్యాట్ పద్దులో రూ. 4,000 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ద్వారా రూ. 1,000 కోట్లు, యూజర్ చార్జీల ద్వారా రూ. 500 కోట్లు అదనంగా రాగలవని మాత్రం ఆయన చూపారు. ఈ చూపిన మొత్తాలతో కలుపుకుని పన్నులు, చార్జీల ద్వారా మొత్తం రూ. 7,000 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆశిస్తూనే కొత్త పన్నులు ఉండబోవని చెప్పడం వంచన తప్ప మరేమీ కాదు. ఇక నిరుద్యోగ భృతి, అంగన్వాడీ కార్యకర్తల జీతాల పెంపు ఊసే లేదు. కొత్తగా మరో లక్షమందికి పింఛన్లు ఇస్తామని ఊదరగొట్టిన సర్కారు తీరా అమల్లో ఉన్నవాటికే అరకొర కేటాయింపులు చేసింది. రైతుల రుణమాఫీ విషయంలో ఏదో అమలు చేస్తున్నామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం...డ్వాక్రా రుణాల విషయంలో ఆ మాత్రం కూడా మాట్లాడటం లేదు. ఆ ఊసెత్తకుండా దాని స్థానంలో రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటుచేయబోతున్నట్టు ప్రకటించింది. అసలు డ్వాక్రా రుణమాఫీ విషయంలో నియమించిన కమిటీ నివేదిక ఏమైందన్నది కూడా చెప్పలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేత రుణమాఫీ కూడా డిటోయే. చేనేత రుణమాఫీకి రూ. 168 కోట్లు అవసరమని అంచనా వేస్తే అందుకోసం కేటాయించిన మొత్తం అత్యంత స్వల్పం. ఇక చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్లతో నిధి హామీ ఎటుపోయిందో తెలియదు. ఇవి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల దుస్థితి. అధికారానికొచ్చాక ఇచ్చిన హామీల పరిస్థితి కూడా అంతంతమాత్రమేనని బడ్జెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసమని భూ సమీకరణ కింద రైతులనుంచి ‘స్వచ్ఛందంగా’ 33,000 ఎకరాలు తీసుకున్నామని ఘనంగా ప్రకటించినా వారికివ్వాల్సిన నష్టపరిహారం కోసం చేసిన కేటాయింపు రూ. 60 కోట్లు మాత్రమే! ఒకపక్క అంతర్జాతీయ శ్రేణి రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటనలిస్తూ అందుకోసం కేటాయించింది రూ. 303 కోట్లు! తమ నిర్వాకమే ఇలావుంటే రాజధాని నిర్మాణానికి కేంద్రాన్ని అడగడం, సాధించడం సాధ్యమవుతుందా?! వర్షాభావ పరిస్థితులనూ, హుద్‌హుద్ తుపానువంటి విలయాన్ని ఎదుర్కొని కూడా 5.9 శాతం వృద్ధిని నమోదుచేసిన వ్యవసాయరంగంపై ప్రభుత్వం శీతకన్నేసింది. శుక్రవారం రూ. 14,184 కోట్లతో ప్రవేశపెట్టిన వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్లో అధిక భాగం ప్రణాళికేతర వ్యయమే ఉంది. అదంతా జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోతుంది. ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఉపాధి హామీ తదితరాలుండే ప్రణాళికా వ్యయానికి కేటాయింపులు తక్కువున్నాయి. వాస్తవానికి ఎన్నికల ముందు చంద్రబాబు ధరల స్థిరీకరణ కోసమే ప్రత్యేకంగా రూ. 5,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆ హామీ కాస్తా అటకెక్కిందని ఈ ప్రత్యేక బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఉచిత విద్యుత్‌కు రూ. 6,455 కోట్లు అవసరమని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరితే అందుకోసం ప్రభుత్వం కేటాయించింది రూ. 3,000 కోట్లు. కనుక ఉచిత విద్యుత్‌కు కోతపడుతుందన్నమాట! వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ రంగం ఎంత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదో అర్థమవుతుంది. సమస్యలు లేవని కాదు...కొత్త రాష్ట్రం గనుక ఎన్నో పరిమితులూ, ఇబ్బందులూ ఉంటాయి. కానీ, ఆ సవాళ్లను ఎదుర్కొనడం తమకే సాధ్యమని కదా అధికారంలోకొచ్చింది! ఇప్పటికైనా వాస్తవాలను చెప్పి, వైఫల్యాలను అంగీకరించక భారీ లక్ష్యాలు, గణాంకాల వెనక దాగడం దేనికి?!