భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన కాంగ్రెస్, అన్నాడీఎంకే, లెఫ్ట్ పార్టీలు
న్యూఢిల్లీ: దేశ పరోక్ష పన్ను వ్యవస్థలో భారీ సంస్కరణలకు ఉద్దేశించిన ‘వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ’ బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. జీఎస్టీ బిల్లును అధ్యయనం చేసేం దుకు బీజేపీ సభ్యుడు భూపేందర్ యాద వ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన 21 మంది సభ్యు ల కమిటీ బుధవారం రాజ్యసభకు తన నివేదికను సమర్పించింది.
జీఎస్టీ అమలు వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు మొత్తం నష్టా న్ని పరిహారంగా ఇవ్వాలన్న ప్రతిపాదన సహా బిల్లులోని దాదాపు అన్ని ప్రతిపాదనలను కమిటీ ఆమోదించిది. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు గణనీయంగా ఆదాయాన్ని కోల్పోతాయని, ఆ మేరకు కేంద్రం పరిహారం అందించాలని టీఎంసీ సహా పలు పార్టీలు డిమాండ్ చేసిన విషయంతెలిసిందే.అంతర్రాష్ట్ర సరుకు రవాణా విషయంలో రాష్ట్రాలకు అదనంగా 1 శాతం లెవీ విధించుకునే అధికారానికి సంబంధించి కూడా కమిటీ ఒక సవరణ చేసింది.
అమ్మిన వస్తువులపైననే ఆ 1% అదనపు పన్ను విధిం చాలని, కంపెనీల మధ్య జరిగే వస్తు నిల్వల అంతర్రాష్ట్ర రవాణాపై ఆ అదనపు భారం వేయకూడదని సూచించింది. ఈ విషయాన్ని బిల్లులో వివరించాలంది. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,అన్నాడీఎంకే, లెఫ్ట్ సభ్యు లు నివేదికలో తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును యథాతథంగా అంగీకరించబోమన్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం లభించ గా.. రాజ్యసభలో మెజారిటీ ఉన్న విపక్షాల ఒత్తిడిపై ఎంపికసంఘానికి పంపించారు.
2016, ఏప్రిల్ 1నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. కమిటీచేసిన సూచనలు.. -అదనపుపన్ను విధింపు అధికారాన్ని ఇప్పుడు బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. పన్ను భారంపెరుగుతుంది. బిల్లులో పేర్కొన్న అన్ని రకాల సరఫరా’ అనే పదంలో ‘సరఫరా’ అనేపదాన్ని స్పష్టంగా నిర్వచించాలి.
* పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధింపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందన్న నిర్ణయం హర్షణీయం.
* రాష్ట్రాల ఆదాయ వనరులు పెంచేందుకు ‘బ్యాండ్ రేట్’ నిర్వచనాన్ని చట్టంలోనే పొందుపర్చాలి. స్థానిక అవసరాల కోసం ఎంపిక చేసిన వస్తు, సేవలపై రాష్ట్రాలు అదనపు పన్ను విధించుకోవచ్చు. అయితే, అది బ్యాండ్ రేట్ పరిధి లోపలే ఉండాలి.
జీఎస్టీ బిల్లుకు సెలెక్ట్ కమిటీ మద్దతు
Published Thu, Jul 23 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement