GST reward scheme: జీఎస్టీ బిల్లు అప్‌లోడ్ చేస్తే నగదు బహుమతులిచ్చే 'మేరా బిల్ మేరా అధికార్' (Mera Bill Mera Adhikaar Scheme) జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. కొనుగోలుదారులు ప్రతి ఒక్కరూ బిల్లును అడిగి తీసుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకం తొలుత ఆరు రాష్ట్రాల్లో అమలు కానుంది.
అమలయ్యే రాష్ట్రాలు ఇవే..
'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను మొదటి దశలో అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) తెలిపింది. ఈ మేరకు స్కీమ్ వివరాలతో ట్వీట్ చేసింది.
అందుబాటులోకి మొబైల్ యాప్
'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్‌ను సీబీఐసీ ఇప్పటికే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైన వస్తువు కొలుగోలు చేసినప్పుడు విక్రేత ఇచ్చిన బిల్లును ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా నగదు బహుమతులు పొందవచ్చు. అప్‌లోడ్ చేసే బిల్లులో విక్రేత జీఎస్టీఐఎన్, ఇన్‌వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తానికి సంబంధించిన వివరాలు ఉండాలి.
రూ. కోటి వరకూ ప్రైజ్ మనీ
జీఎస్టీ నమోదు చేసుకున్న దుకాణాలు, సంస్థలు ఇచ్చే బిల్లులను 'మేరా బిల్ మేరా అధికార్' యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఇలా అప్‌లోడ్ బిల్లులన్నీ నెలకోసారి, మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీస్తారు. విజేతలకు రూ. 10 వేల నుంచి రూ. 1 కోటి వరకు నగదు బహుమతులు అందజేస్తారు. లక్కీ డ్రాకు అర్హత పొందేందుకు కనీస కొనుగోలు విలువ రూ. 200 ఉండాలి. ఒక నెలలో గరిష్టంగా 25 బిల్లులను అప్‌లోడ్ చేయవచ్చు.
ఇదీ చదవండి: ‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట?
Mera Bill Mera Adhikaar Scheme!
— CBIC (@cbic_india) August 22, 2023
👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23.
👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/imH9VkakiY
Comments
Please login to add a commentAdd a comment