CBIC
-
బంగారం అక్రమ రవాణా తగ్గుతుంది..
న్యూఢిల్లీ: బంగారంపై భారీగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందని సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డ్) చైర్మన్ సంజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. అలాగే దేశంలోని రత్నాలు ఆభరణాల ఎగుమతులు పెరగడానికి, ఉపాధి వృద్ధికి సహాయపడుతుందని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24) కస్టమ్స్ శాఖ, డీఆర్ఐ కలిసి 4.8 టన్నుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2022–23లో ఈ పరిమాణం 3.5 టన్నులు కావడం గమనార్హం. యల్లోమెటల్సహా పలు విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ ఉపాధి కల్పన రత్నాలు, ఆభరణాల రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8 శాతం వరకూ ఉందని కుమార్ మల్హోత్రా తెలిపారు. దేశానికి 2023–24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. వెండి విషయంలో ఈ విలువ 5.44 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో ఆభరణాల ఎగుమతులు విలువ 13.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడి దిగుమతులను చేసుకుంటోంది. బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఈ దేశం వాటా దాదాపు 40 శాతం. తరువాతి 16 శాతానికిపైగా వాటాతో యూఏఈ రెండవ స్థానంలో ఉంది. 10 శాతం వాటాలో దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో నిలుస్తోంది. 2022లో పెరిగిన సుంకాలుదేశంలోకి వచీ్చ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భారీ పెరుగుదలను నివారించడానికి 2022 జూలైలో (10.75 శాతం నుంచి 15 శాతానికి) కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2022–23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతంగా ఉన్న క్యాడ్, 2023–24లో ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా మిగులు నమోదయ్యింది. -
గంగా జలంపై జీఎస్టీ.. ట్యాక్స్ బోర్డు స్పందన
ఢిల్లీ: కేంద్రం గంగా జలాన్ని సైతం వదలడం లేదని.. దానిపైనా జీఎస్టీ వేస్తోందంటూ కాంగ్రెస్ సంచలన ఆరోపణకు దిగింది. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ లాంటిదేం లేదని స్పష్టత ఇచ్చింది. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం గంగాజలం గురించి ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఉత్తరాఖండ్‌లో ఇవాళ మీరు పర్యటిస్తున్నారు. కానీ మీ ప్రభుత్వం ఇదే గంగాజలానికి 18 శాతం జీఎస్టీ విధిస్తోంది. ఇంట్లో పెట్టుకునే పవిత్ర గంగా జలానికీ జీఎస్టీ విధించడం తగదు’’ అంటూ ఖర్గే పోస్ట్ పెట్టారు. मोदी जी, एक आम भारतीय के जन्म से लेकर उसकी जीवन के अंत तक मोक्षदायिनी माँ गंगा का महत्त्व बहुत ज़्यादा है। अच्छी बात है की आप आज उत्तराखंड में हैं, पर आपकी सरकार ने तो पवित्र गंगाजल पर ही 18% GST लगा दिया है। एक बार भी नहीं सोचा कि जो लोग अपने घरों में गंगाजल मँगवाते हैं,… pic.twitter.com/Xqd5mktBZG — Mallikarjun Kharge (@kharge) October 12, 2023 అయితే.. ఈ నీటి మీదా 18 శాతం జీఎస్టీ (GST) విధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. కానీ, ఈ గంగాజలానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని సీబీఐసీ పేర్కొంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదని క్లారిటీ ఇచ్చింది. -
నిబంధనల ప్రకారమే గేమింగ్ కంపెనీలకు నోటీసులు
న్యూఢిల్లీ: చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ ఎగవేత నోటీసులు జారీ చేసినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేíÙంచిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్, కేసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించేలా సవరించిన నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అగర్వాల్ చెప్పారు. దీనికి సంబంధించిన చట్ట సవరణలను పార్లమెంటు ఇటీవలే ఆమోదించింది. అప్పటి నుంచి డ్రీమ్11 వంటి ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, డెల్టా కార్ప్ వంటి కేసినో ఆపరేటర్లకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగర్వాల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. రూ. 16,800 కోట్ల మేర పన్నులు కట్టాల్సి ఉందంటూ డెల్టా కార్ప్‌కు గత వారం నోటీసులు జారీ అయ్యాయి. రూ. 21,000 కోట్లు రాబట్టుకునేందుకు ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు గతేడాది షోకాజ్ నోటీసులు వచ్చాయి. వీటిని కర్ణాటక హైకోర్టు కొట్టేయగా, రెవెన్యూ డిపార్ట్మెంట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 10న దీనిపై తదుపరి విచారణ జరగనుంది. -
జీఎస్టీ రివార్డ్ స్కీమ్.. సెప్టెంబర్ 1 నుంచే..
GST reward scheme: జీఎస్టీ బిల్లు అప్లోడ్ చేస్తే నగదు బహుమతులిచ్చే 'మేరా బిల్ మేరా అధికార్' (Mera Bill Mera Adhikaar Scheme) జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. కొనుగోలుదారులు ప్రతి ఒక్కరూ బిల్లును అడిగి తీసుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకం తొలుత ఆరు రాష్ట్రాల్లో అమలు కానుంది. అమలయ్యే రాష్ట్రాలు ఇవే.. 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను మొదటి దశలో అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) తెలిపింది. ఈ మేరకు స్కీమ్ వివరాలతో ట్వీట్ చేసింది. అందుబాటులోకి మొబైల్ యాప్ 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్‌ను సీబీఐసీ ఇప్పటికే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైన వస్తువు కొలుగోలు చేసినప్పుడు విక్రేత ఇచ్చిన బిల్లును ఈ యాప్‌లో అప్లోడ్ చేయడం ద్వారా నగదు బహుమతులు పొందవచ్చు. అప్లోడ్ చేసే బిల్లులో విక్రేత జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తానికి సంబంధించిన వివరాలు ఉండాలి. రూ. కోటి వరకూ ప్రైజ్ మనీ జీఎస్టీ నమోదు చేసుకున్న దుకాణాలు, సంస్థలు ఇచ్చే బిల్లులను 'మేరా బిల్ మేరా అధికార్' యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా అప్లోడ్ బిల్లులన్నీ నెలకోసారి, మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీస్తారు. విజేతలకు రూ. 10 వేల నుంచి రూ. 1 కోటి వరకు నగదు బహుమతులు అందజేస్తారు. లక్కీ డ్రాకు అర్హత పొందేందుకు కనీస కొనుగోలు విలువ రూ. 200 ఉండాలి. ఒక నెలలో గరిష్టంగా 25 బిల్లులను అప్లోడ్ చేయవచ్చు. ఇదీ చదవండి: ‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట? Mera Bill Mera Adhikaar Scheme! 👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23. 👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/imH9VkakiY — CBIC (@cbic_india) August 22, 2023 -
Fraud Alert: కస్టమ్స్ డ్యూటీ, వారికి బలైపోకండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్ల మోసాలకు సంబంధించి ప్రభుత్వం మరో అలర్ట్ జారీ చేసింది. మోసపూరిత ఆన్లైన్ వ్యాపారుల మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ( సీబీఐసీ)తాజాగా హెచ్చరిక చేసింది. భారతీయ కస్టమ్స్ నుండి వచ్చినట్లు , వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోసపూరిత కాల్లు, ఇమెయిల్‌లు, సందేశాలుతో వచ్చే సోషల్ మీడియా పోస్ట్‌లకు బలైపోకండి అని ప్రకటించింది. నకిలీ ఆదాయపు పన్ను రిటర్న్ ( ఐటీఆర్) రీఫండ్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) భారత కస్టమ్స్ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ‘‘వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నుంచి కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కస్టమ్స్ విభాగం ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయదు. ఎస్ఎంఎస్ పంపదు. దేశ కస్టమ్స్ శాఖ నుండి వచ్చే సమాచారం, సందేశాలు మొత్తం సీబీఐసీ వెబ్సైట్ ధృవీకరించబడే డీఐఎన్ (డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్)ను కలిగి ఉంటాయి’ అని ఆర్థిక శాఖ ప్రకటన స్పష్టం చేసింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) -
రూ.1.50 లక్షల కోట్ల జీఎస్టీ ఇక సాధారణం
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.5 లక్షల కోట్లు అన్నది ఇక మీదట సర్వసాధారణమని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చీఫ్ వివేక్ జోహ్రి పేర్కొన్నారు. పన్ను ఎగవేతల నిరోధానికి తీసుకున్న సమిష్టి చర్యలు, నూతన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వసూళ్ల విస్తరణకు తోడ్పడినట్టు చెప్పారు. జీఎస్టీ, కస్టమ్స్ వసూళ్లకు సంబంధించి 2023–24 బడ్జెట్లో ప్రకటించిన గణాంకాలు వాస్తవికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. సాధారణ జీడీపీ వృద్ధి, దిగుమతుల ధోరణుల ఆధారంగా వీటిని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించారు. జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు కఠిన ఆడిట్, పన్ను రిటర్నుల మదింపు, నకిలీ బిల్లులు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌పై చర్యలు అనే విధానాన్ని రూపొందించినట్టు చెప్పారు. ‘‘పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టాం. జీఎస్టీ విధానం తీసుకొచ్చినప్పటి నుంచి పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో పెరుగుదల మెరుగ్గా ఉన్నప్పటికీ, కొన్ని రంగాల్లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరిగేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కనుక జీఎస్టీ ఆదాయం విషయంలో మేమింకా సంతృప్త స్థాయికి చేరుకోలేదు. ఆదాయం పెంచుకునే అవకాశాలున్నాయి’’ అని చెప్పారు. జీఎస్టీ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలవారీగా రూ.1.45 లక్షల కోట్లు ఉండడం గమనార్హం. 2023 జనవరికి రూ.1.56 లక్షల కోట్లు వసూలైంది. జీఎస్టీ చరిత్రలో 2022 ఏప్రిల్‌లో వచ్చిన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత నెలవారీగా అత్యధిక ఆదాయం రికార్డు ఇదే కావడం గమనించొచ్చు. 2022–23 సంవత్సరానికి జీఎస్టీ ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.9.56 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్లో భాగంగా మంత్రి సీతారామన్ ప్రకటించారు. విండ్‌ఫాల్ ట్యాక్స్ ద్వారా 25,000 కోట్ల ఆదాయం: కేంద్రం విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్ ద్వారా మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 25,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ పెరిగినందున పన్ను ప్రస్తుతానికి కొనసాగుతుందని సీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రీ మరో ప్రకటనలో స్పష్టం చేశారు. భారతదేశం 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. తొలుత దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250 (బ్యారెల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపు జరిగింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా కొత్త పన్ను అమలు జరుగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. చమురు అన్వేషణ, ఉత్పత్తికి ఈ పన్ను విఘాతమని పేర్కొంటూ, దీనిని తక్షణం తొలగించలని పారిశ్రామిక వేదిక – ఫిక్కీ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం క్రూడాయిల్, డీజిల్ వంటి వాటిపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై ఈ పన్ను టన్నుకు రూ. 1,900 నుంచి రూ. 5,050కి పెరిగింది. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 5 నుంచి రూ. 7.50కి కేంద్రం ట్యాక్స్‌ను పెంచింది. ఇక విమాన ఇంధన (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ. 3.5 నుంచి రూ. 6కి పెంచింది. ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చాయి. క్రూడాయిల్ అధిక రేట్లలో ట్రేడవుతున్నప్పుడు ఆయిల్ కంపెనీలకు ఆకస్మికంగా వచ్చే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ముడిచమురు బ్యారెల్ రేటు పరిమితిని 75 డాలర్లుగా నిర్ణయించారు. ఇతర దేశాల బాటలోనే, భారత్ గతేడాది జూలై 1న దీన్ని తొలిసారిగా విధించింది. క్రితం రెండు వారాల్లో ఆయిల్ సగటు ధరల ప్రకారం ప్రతి పక్షం రోజులకోసారి ఈ ట్యాక్స్ రేట్లను సమీక్షిస్తుంది. -
జనవరి 1 నుంచే.. అమల్లోకి జీఎస్టీ కౌన్సిల్ కొత్త నిర్ణయాలు
డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయాలే జనవరి 1 (నేటి నుంచి) అమలు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) విభాగం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ చెల్లింపు దారులు వారు అద్దెకు ఇచ్చే ఇంటిపై జీఎస్టీ చెల్లించాల్సి అవసరం లేదని తెలిపింది. దీంతో పాటు స్పిరిట్ (పెట్రోల్)లో కలిపేందుకు రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కహాల్ 5శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది. చిల్కా, సహా పప్పుధాన్యాల పొట్టుపై విధించిన 5శాతం జీఎస్టీని తొలగించింది. డిసెంబర్ 17న జరిగిన చివరి కౌన్సిల్ సమావేశంలో.. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపై జీఎస్టీ వర్తింపుపై కేంద్రం, రాష్ట్రాలు స్పష్టత ఇచ్చాయి. చట్టంలోని కొన్ని నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించాయి. -
మొబైల్ డిస్ప్లే దిగుమతులపై 15 శాతం సుంకాలు
న్యూఢిల్లీ: స్పీకర్లు, సిమ్ ట్రే వంటివి అమర్చిన మొబైల్ ఫోన్ డిస్ప్లే యూనిట్ల దిగుమతులపై 15 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) వర్తిస్తుందని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది. డిస్ప్లే అసెంబ్లీని దిగుమతి చేసుకునేటప్పుడు, సుంకాల ఎగవేత కోసం తప్పుడు డిక్లరేషన్లను ఇవ్వకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణంగా మొబైల్ ఫోన్ డిస్ప్లే అసెంబ్లీలో టచ్ పానెల్, కవర్ గ్లాస్, ఎల్ఈడీ బ్యాక్‌లైట్ వంటివి ఉంటాయి. వీటి దిగుమతులపై ప్రస్తుతం 10% సుంకం ఉంది. -
'మేక్ ఇన్ ఇండియా' కోసం భారీగా కస్టమ్స్ సుంకం మినహాయింపులు!
దేశీయంగా తయారీ ప్రోత్సహించడానికి 2022-23 బడ్జెట్లో 350 ముడిసరుకులపై కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 40కి పైగా ఉత్పత్తుల మీద కస్టమ్స్ మినహాయింపులను ప్రకటించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబిఐసీ) ట్వీట్ చేసింది. మొత్తంగా ఉత్పత్తుల మీద 350 కస్టమ్స్ సుంకాలను ఉపసంహరించుకుంటామని సీబిఐసీ తెలిపింది. వీటిలో మినహాయింపులు పొందుతున్న కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, బట్టలు, వైద్య పరికరాలు, మందులు లాంటివి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, హెడ్ సెట్స్ పరికరాలు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్ల వంటి ఉత్పతులను దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించేందుకు గ్రేడెడ్ రేట్ స్ట్రక్చర్‌ను అందించడానికి కస్టమ్స్ డ్యూటీ రేట్లను రూపొందిస్తామని నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించారు. మొబైల్ ఫోన్ ఛార్జర్ల, ట్రాన్స్ఫార్మర్ భాగాలు, మొబైల్ కెమెరా మాడ్యూల్ కెమెరా లెన్స్, కొన్ని ఇతర వస్తువులకు కూడా డ్యూటీ రాయితీలు కల్పిస్తామని ఆమె చెప్పారు. రత్నాలు, ఆభరణాల రంగానికి ఊతమిచ్చేందుకు కట్, పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి, సాన్ డైమండ్‌పై సున్నా శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ-కామర్స్ ద్వారా ఆభరణాలను ఎగుమతి చేయడానికి 2022 జూన్ నాటికి సరళీకృత నియంత్రణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఆమె అన్నారు. తక్కువ విలువతో అనుకరణ ఆభరణాల దిగుమతిని అరికట్టేందుకు అనుకరణ ఆభరణాలపై కిలోకు 400 రూపాయల కస్టమ్స్ సుంకాన్ని విధించాలని చూస్తున్నట్లు తెలిపారు. (చదవండి: Elon Musk: అపర కుబేరుడు మరీ ఇంత పిచ్చోడా?) -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేత.. లెక్కించేందుకు నాలుగు రోజులు?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకలపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. తనిఖీల్లో భాగంగా పీయూష్ ఇంట్లోని రెండు బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ డబ్బును లెక్కించేందుకే దాదాపు నాలుగు రోజులు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 257కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్: ఒక్కరోజే 156 కొత్త కేసులు, మహారాష్ట్రను దాటేసిన ఢిల్లీ ఇక, సోదాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లో 4, కన్నౌజ్‌లో 7, ముంబయిలో 2, దిల్లీలో ఒక ఆస్తికి చెందిన పత్రాలను గుర్తించారు. మరో రెండు ఆస్తులు దుబాయిలో ఉన్నట్లు తేలింది. కన్నౌజ్‌లో పీయూష్ జైన్ పూర్వీకుల ఇంట్లో 18 లాకర్లను అధికారులు గుర్తించారు. మరో 500 తాళాలు కూడా దొరికాయని సమాచారం. పన్ను ఎగవేత మొత్తంగా 1000కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ముందు ప్రేమ, ఆపై దూరం.. తట్టుకోలేక ఒకరినొకరు పొడుచుకున్న ప్రేమికులు సంబంధిత వార్త: గుట్టల్లా నోట్ల కట్టలు.. రూ.150 కోట్లకు పైనే, షాక్‌లో అధికారులు.. ఫోటోలు వైరల్! -
చైనాకు భారత్ మరో భారీ షాక్.. ఆ ఉత్పత్తులపై ఐదేళ్లపాటు..!
చైనాకు భారత్ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి చైనా నుంచి చౌక ధరలకు దిగుమతి అవుతున్న ఐదు రకాల చైనా ఉత్పత్తులపై యాంటీడంపింగ్ సుంకాలను విధించింది. ఈ యాంటీడంపింగ్ సుంకాలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి. ఈ మేరకు ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) ఒక ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. సీబీఐసీ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ వస్తువుల జాబితాలో అల్యూమినియం, సోడియం హైడ్రోసల్ఫేట్(డై పరిశ్రమలో వినియోగిస్తారు), సిలికాన్ సీలెంట్(సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్, థర్మల్ పవర్ అప్లికేషన్ తయారీ కోసం వాడుతారు), హైడ్రోఫ్లోరో కార్బన్, కాంపొనెంట్ ఆర్-32, హైడ్రోఫ్లోరో కార్బన్‌మిశ్రమాలు ఈ సుంకాల పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్(డీజీటిఆర్) సిఫార్సుల నేపథ్యంలో ఈ సుంకాలు విధించారు. ఈ ఉత్పత్తులు భారతీయ మార్కెట్లలో సాధారణ విలువ కంటే తక్కువ ధరకు ఎగుమతి అవుతున్నాయని, దీని ఫలితంగా డంపింగ్ జరిగిందని డీజీటిఆర్ వేర్వేరు దర్యాప్తులలో నిర్ధారించింది. "ఈ నోటిఫికేషన్ కింద విధించిన యాంటీ డంపింగ్ సుంకం(సిలికాన్ సీలెంట్ పై) ప్రచురించిన తేదీ నుంచి 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఈ సుంకం భారతీయ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుంది" అని సీబీఐసీ తెలిపింది. చౌకైన చైనా దిగుమతుల నుంచి దేశీయ తయారీదారులను రక్షించడానికి ట్రయిలర్స్ కోసం యాక్సిల్ - వాహన భాగంపై కూడా సీబీఐసీ సుంకాన్ని విధించింది. అదేవిధంగా ఇరాన్, ఒమన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) నుంచి దిగుమతి అవుతున్న కాల్సినేడ్ జిప్సమ్ పౌడర్ దిగుమతులపై కూడా ఐదేళ్లపాటు సుంకాన్ని విధించింది. సాధారణంగా యాంటీ డంపింగ్ డ్యూటీలను ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకే విధిస్తారు. చౌకరకం దిగుమతుల కారణంగా దేశీయ పరిశ్రమలు దెబ్బతినే పరిస్థితుల్లో వీటిని వసూలు చేస్తారు. ఫలితంగా దేశీయ పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి అవసరమైన మార్కెట్ పరిస్థితులు ఏర్పడతాయి. భారత్, చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ( (డబ్ల్యుటిఓ))లో రెండూ సభ్యులుగా ఉన్నాయి. ఏప్రిల్-సెప్టెంబర్ 2021 కాలంలో చైనాకు భారతదేశం 12.26 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, ఆదేకాలంలో 42.33 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. (చదవండి: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ.600కే డైలీ 5జీబీ డేటా!.. ఇంకా డైలీ?) -
Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు!
న్యూఢిల్లీ: వంటనూనెల వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్(సీబీఐసీ) తన గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ కస్టమ్స్ సుంకం తగ్గింపు అనేది మార్చి 2022 వరకు వర్తిస్తుందని సీబీఐసీ తెలిపింది. సీబీఐసీ జారీ చేసిన నోటిఫికేషన్లో ఇలా.. "శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని మార్చి 31, 2022 వరకు 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించనున్నట్లు" పేర్కొంది. పామాయిల్ కొత్త రేట్లు మంగళవారం(డిసెంబర్ 21) నుంచి అమల్లోకి రానున్నాయి. భారతదేశం నవంబర్ 2020 - అక్టోబర్ 2021 మధ్య కాలంలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. వంట నూనె ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం శుద్ధి చేసిన & ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాలను ఈ సంవత్సరం అనేకసార్లు తగ్గించింది. వంటనూనె ధరల తగ్గిపుపై దృష్టి సారించిన కేంద్రం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలు అదుపులో పెట్టడంతోపాటు.. రైతులకు చేయూతనిచ్చేలా రూ.11 వేల 40 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీనికి కేంద్రమంత్రి వర్గం 2021 ఆగస్టులో ఆమోదం తెలిపింది. (చదవండి: 5జీ స్మార్ట్ ఫోన్ పై బంపరాఫర్, మరికొన్ని గంటలు మాత్రమే!) -
పైసా వసూల్, జీఎస్టీ పన్ను లక్షకోట్లను దాటేసింది!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం. కోవిడ్ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం. జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వేర్వేరుగా ఇలా... ►సెంట్రల్ జీఎస్టీ రూ.20,522 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884 కోట్లుసహా) ► సెస్ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా). అప్పడానికి జీఎస్టీ వర్తించదు కాగా అప్పడానికి జీఎస్టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్‌కు జీఎస్టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్‌కు జీఎస్టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్‌కు జీఎస్టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
వివాదాలన్నీ సుప్రీం ఉత్తర్వుల పరిధిలోకి రావు!
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు విషయంలో సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులపై పరోక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డు (సీబీఐసీ) బుధవారం వివరణ ఇచ్చింది. అరెస్ట్, సెర్చ్, సమన్ల వంటివి సుప్రీంకోర్టు లిమిటేషన్ పొడిగింపు ఉత్తర్వుల పరిధిలోనికి రావని స్పష్టం చేసింది. కేవలం పిటిషన్లు, అప్లికేషన్లు, సూట్స్, అప్పీళ్లు వంటి ప్రొసీడింగ్స్‌కు మాత్రమే సుప్రీం ఉత్తర్వుల పరిధిలోనికి వస్తాయని తెలిపింది. పెండింగ్ కేసులను పన్నుల అధికారులు వేగవంతంగా పరిష్కరించడానికి తాజా సీబీఐసీ వివరణ దోహదపడుతుందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజిత్ మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిఫండ్, రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ లేదా రద్దు అప్లికేషన్లపై అధికారులు నిర్ణయాలు తీసుకోవడంసహా డిమాండ్ నోటీసుల ప్రొసీడింగ్స్ నిర్వహణ, ఇప్పటికే దాఖలైన అప్పీళ్ల విచారణ వంటివి కొనసాగించడానికి అధికారులకు వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
గుడ్‌న్యూస్: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చెమటలు పట్టిస్తున్న క్రమంలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. సమయం వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు పన్నుల్లో కోత పెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అజిత్ కుమార్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల ఆదాయంలో భారీ వృద్ధిని చూపించింది. దీనికి ప్రధాన కారణం ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ ఆదాయం భారీగా పెరగడమే. ‘‘రానున్న నెలల్లో ఆదాయంలో బలమైన వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావంతో ఉన్నాము’’ అని కుమార్ చెప్పారు. కేంద్ర సర్కారు గతేడాది పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13, డీజిల్‌పై లీటర్‌కు రూ.16 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.32.90కు చేరింది. విక్రయ ధరలో సుమారు 39 శాతం ఎక్సైజ్ సుంకమే. అదే విధంగా డీజిల్ లీటర్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.31.80గా ఉంది. రాష్ట్రాల్లో వ్యాట్, ఇతర పన్నులు కూడా కులుపుకుంటే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరల్లో పన్నుల వాటా 55-60 శాతంగా ఉంటోంది. వెరసి కొనుగోలుదారులకు ధరలు భారంగా పరిణమించాయి. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తామన్న సీబీఐసీ చీఫ్ అందుకు నిర్ధిష్ట కాలపరిమితిని మాత్రం వెల్లడించలేదు. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్ -
ప్రత్యక్ష తనిఖీ తర్వాతే జీఎస్టీ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదు చేసుకునే వ్యాపార సంస్థలు ఆధార్ గుర్తింపు ధ్రువీకరణను ఇవ్వలేకపోతే.. ఆయా సంస్థల వ్యాపార స్థలాలను పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ మంజూరు అవుతుందని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర మండలి(సీబీఐసీ) స్పష్టం చేసింది. ఈ నెల 21 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుదారులు ఆధార్ ఆథెంటికేషన్‌ను ఎంచుకోవచ్చని సీబీఐసీ తన నోటిఫికేషన్లో తెలిపింది. ఆథార్ గుర్తింపు ధ్రువీకరణలో విఫలమైనా లేక ఆధార్ అథెంటికేషన్‌ను ఎంచుకోకపోయినా.. అటువంటి దరఖాస్తులకు సంబంధించి వ్యాపార కేంద్రాలను పరిశీలించిన తర్వాతే జీఎస్టీ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని పేర్కొంది. దీనిపై పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ నేషనల్ లీడర్ ప్రతీక్ జైన్ స్పందిస్తూ.. ‘పన్ను చెల్లింపుదారు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోరుకుంటే ఆధార్ అథెంటికేషన్‌ను ఎంచుకోవచ్చు. దీనికి ప్రత్యక్ష పరిశీలన అవసరం లేకుండా 3 రోజుల్లో రిజిస్ట్రేషన్ మంజూరు అవుతుంది. లేదంటే 21 రోజులు పడుతుంది. అధికారులు ప్రత్యక్షంగా ఆయా వ్యాపార కేంద్రాలను తనిఖీ చేసి, పత్రాల పరిశీలన తర్వాతే రిజిస్ట్రేషన్ మంజూరు చేస్తారు’’ అని వివరించారు. -
డైరెక్టర్ల వేతనాలపై జీఎస్టీ ఉండదు: సీబీడీటీ
న్యూఢిల్లీ: కంపెనీ డైరెక్టర్లకు చెల్లించే వేతనాలపై జీఎస్టీ వసూలు ఉండదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టత ఇచ్చింది. డైరెక్టర్లకు చెల్లించే పారితోషికంపై కంపెనీలు జీఎస్టీ చెల్లించాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజస్థాన్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ తీర్పునిచ్చిన నేపథ్యంలో సీబీడీటీ నుంచి ఈ స్పష్టత రావడం గమనార్హం. ‘‘డైరెక్టర్లకు ఇచ్చే పారితోషికాన్ని వేతనాలుగా కంపెనీలు పుస్తకాల్లో చూపించినట్టయితే, ఈ మొత్తంపై ఐటీ చట్టంలోని సెక్షన్ 192 కింద టీడీఎస్ అమలు చేస్తున్నట్టు అయితే.. జీఎస్టీ పరిధిలోకి రాదు’’ అంటూ సీబీడీటీ పేర్కొంది. ఒకవేళ డైరెక్టర్ల పారితోషికం వేతనం రూపంలో కాకుండా.. వృత్తిపరమైన ఫీజులుగా చెల్లిస్తుంటే మాత్రం జీఎస్టీ చెల్లించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. -
వచ్చే నెలలో ‘కృష్ణపట్నం నోడ్’ టెండర్లు
సాక్షి, అమరావతి: బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్ (సీబీఐసీ)లో భాగంగా ప్రతిపాదిత కృష్ణపట్నం నోడ్ (పారిశ్రామిక ప్రాంతం) పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 13,882.9 ఎకరాల్లో ఉద్దేశించిన ఈ పారిశ్రామిక నోడ్‌లో సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధంచేసింది. తొలిదశలో రూ.2,139 కోట్ల పెట్టుబడి అంచనాతో 3,090 ఎకరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్)తో కలిసి 50 : 50 భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా నిక్‌డిట్ కృష్ణపట్నం ఇండ్రస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్‌ను సర్కారు ఏర్పాటుచేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ, పర్యావరణ తుది అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ మొదలుపెడతామని ఏపీఐఐసీ ఎండీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ తెలిపారు. కాగితాల్లో నుంచి కార్యరూపంలోకి.. గత కొన్నేళ్లుగా కేవలం కాగితాలకే పరిమితమైన ఈ కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్ పనులపై వైఎస్ జగన్ సీఎం కాగానే దృష్టిసారించారు. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, ఏప్రిల్‌లో ఈపీసీ టెండర్లు పిలిచి సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వెళ్లే సీబీఐసీ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం జపాన్‌కు చెందిన జైకా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. మూడు క్లస్టర్ల అభివృద్ధి.. కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌లో వివిధ రంగాల పరిశ్రమలను ఆకర్షించేందుకు వీలుగా మూడు రకాల క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. అవి.. - ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, మినరల్స్ తదితర పరిశ్రమల కోసం క్లస్టర్–1ను అభివృద్ధి చేస్తారు. - ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమలకు క్లస్టర్–2ను ఏర్పాటుచేస్తారు. - ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ పరికరాల కోసం కస్టర్–3ను అభివృద్ధి చేస్తారు. 5.15 లక్షల మందికి ఉపాధి ఈ పారిశ్రామిక నోడ్‌లో పరిశ్రమలకు సుమారు 7,785 ఎకరాలు, నివాసాల కోసం 1,699 ఎకరాలు.. మిగిలిన మొత్తాన్ని మౌలిక వసతుల కల్పన.. ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. - ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు రూ.37,500 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని అంచనా. - తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5.15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. మొత్తం 99,400 కుటుంబాలు నివాసం ఉండటం ద్వారా ఈ నోడ్‌లో 3.12 లక్షల మంది నివాసం ఉంటారన్న అంచనాతో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. -
జీఎస్టీ రిటర్ను ఎగవేస్తే.. ఖాతా జప్తే
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) రిటర్నులు దాఖలు చేయని అసెసీలు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి రానుంది. ప్రభుత్వం.. అలాంటి అసెసీల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం లేదా ఏకంగా రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయని సంస్థలతో వ్యవహరించాల్సిన విధానాలకు సంబంధించి కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించింది. ఇందులో నిర్దిష్ట కఠిన చర్యలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది. దఫదఫాలుగా నోటీసులు... కాంపొజిషన్ స్కీమ్ ఎంచుకున్న అసెసీలు.. మూడు నెలలకోసారి, మిగతా వారు నెలకోసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటోంది. అయితే, జీఎస్టీ అసెసీల్లో 20 శాతం మంది రిటర్నులు దాఖలు చేయడం లేదని, దీనివల్ల పన్ను వసూళ్లు గణనీయంగా దెబ్బతింటున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐసీ... ఎస్‌వోపీని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం గడువులోగా చెల్లింపులు జరపని పక్షంలో డిఫాల్టరుకు ముందు సిస్టమ్ నుంచి ఒక నోటీస్ వెడుతుంది. ఆ తర్వాత అయిదు రోజుల్లోగా చెల్లించకపోతే.. ఫారం 3–ఎ కింద మరో నోటీసు జారీ అవుతుంది. ఇది వచ్చాక 15 రోజుల్లోగానైనా చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికీ కట్టకపోతే.. అధికారులు సదరు అసెసీ కట్టాల్సిన పన్ను బాకీలను మదింపు చేసి, ఫారం ఏఎస్‌ఎంటీ–13 జారీ చేస్తారు. -
పన్ను వేధింపులకు చెక్
సాక్షి, హైదరాబాద్: మీరు సక్రమంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చెల్లిస్తున్నారా? మీ వ్యాపారానికి అనుగుణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని సకాలంలో జమ చేస్తున్నారా? సమాజంలో పలుకుబడి, ప్రతిష్ట ఉన్న మీ పరపతి దెబ్బతినే విధంగా మీరు సకాలంలో జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ పన్ను కట్టడం లేదంటూ నోటీసులు వస్తున్నాయా? సమన్లూ అందుతున్నాయా? అరెస్టు చేస్తామంటూ వారెంట్లు విడుదలవుతున్నాయా? ఈ వేధింపులన్నింటికీ కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. పన్ను చెల్లింపు సక్రమంగా లేదంటూ డీలర్లపై ఎలాంటి విచారణ చేపట్టాలన్నా ఇక నుంచి మాన్యువల్‌గా చేస్తే ఒప్పుకోబోమని, ప్రతి డీలర్‌కు డాక్యుమెంటేషన్ ఐడింటిఫికేషన్ నెంబర్ (డీఐఎన్) ఇచ్చి ఆ నెంబర్ ద్వారా విచారణ ప్రక్రియకు సంబంధించిన లావాదేవీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) దేశంలోని అన్ని రాష్ట్రాల అధికారులకు లేఖలు రాసింది. పరోక్ష పన్నుల వసూళ్లలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు గాను సీజీఎస్టీ– 2017 చట్టంలోని సెక్షన్ 168 (1), కేంద్ర ఎక్సైజ్ చట్టం – 1944, సెక్షన్ (37), కస్టమ్స్ చట్టం – 1961లోని సెక్షన్ 151(ఏ)ల ప్రకారం డీఐఎన్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్టు ఈ లేఖలో పేర్కొంది. నంబర్ జనరేట్ చేసిన తర్వాతే జీఎస్టీ పరిధిలో రిజిస్టర్ అయిన ప్రతి డీలర్‌కు ఈ చట్టం ప్రకారం డీఐఎన్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈనంబర్‌ను కేవలం విచారణ ప్రక్రియకు మాత్రమే పరిమితం చేస్తున్నా, మరో నెలరోజుల వ్యవధిలో అన్ని రకాల లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఈ నెంబర్ ద్వారానే తెలియజేయాలని సీబీఐసీ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది కూడా. తాజాగా వచి్చన ఉత్తర్వుల ప్రకారం డీలర్ల నుంచి పన్ను వసూలు చేసేందుకుగాను సోదాలకు అనుమతివ్వడం, సమన్లు జారీ చేయడం, అరెస్టు మెమోలివ్వడం, తనిఖీ నోటీసులు పంపడం, విచారణ పేరుతో లేఖలు పంపడం లాంటివి ఈ నంబర్ ద్వారానే ఎల్రక్టానిక్ పద్ధతిలో జరపాల్సి ఉంటుంది. అలా చేయని ఎలాంటి లావాదేవీ అయినా చెల్లుబాటు కాదని రాష్ట్రాలకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. చాలా పరిమితమైన కేసుల్లో మాత్రమే మాన్యువల్ పద్ధతిలో విచారణ చేపట్టవచ్చని, ఇందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయడంతో పాటు విచారణ ప్రక్రియ ప్రారంభించిన 15 రోజుల్లోపు సంబంధిత ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఉన్నతాధికారులు అనుమతి ఇస్తున్న మాన్యువల్ ప్రక్రియను కూడా 15 రోజుల్లోగా కంప్యూటరైజేషన్ చేయాల్సిందే నని స్పష్టం చేసింది. ఈ తాజా ఉత్తర్వులతో çపన్ను ఎగవేతదారుల నుంచి పన్ను వసూలు చేసే క్రమంలో ఇటు జీఎస్టీ, అటు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు జరిపే ప్రతి లావాదేవీ ఆన్లైన్లోనే జరగనుంది. దీంతో పన్ను వేధింపుల నుంచి తమకు ఊరట లభిస్తుందని రాష్ట్రంలోని కొందరు బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రెవెన్యూకి రక్షణ ‘ఈ విధానం ద్వారా ప్రభుత్వం నుంచి పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి లెటర్ వచి్చనా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవీని ప్రభుత్వం స్రూ్కటినీ చేస్తుంది. నోటీసులు లేదా ఇతర లేఖలు జారీ చేసే అధికార్లకు బాధ్యత ఉంటుంది. గతంలో ఈ విధానం లేకపోవడంతో అవినీతికి ఆస్కారం ఉండేది. అక్రమార్కులు, అధికారులు కుమ్మక్కయి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు పన్ను ఎగవేతకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ రెవెన్యూకి ఈ విధానం రక్షణగా ఉంటుంది.’ సుదీర్ వి.ఎస్, చార్టర్డ్ అకౌంటెంట్, హీరెగంగే అండ్ అసోసియేట్స్ ప్రతి లావాదేవీ ట్రాక్.. ‘ఈ విధానం అమల్లోకి రావడం ద్వారా పన్ను చెల్లింపుదారుడు జరిపే ప్రతి లావాదేవీ ట్రాక్ అవుతుంది. లావాదేవీల తారుమారుకు అవకాశముండదు. పన్ను వసూలులో ఇది మంచి సంస్కరణ. దీని ద్వారా అసలైన డీలర్ ఎవరనేది నిర్ధారణ అవుతుంది. పన్ను చెల్లింపు విధానంలో వేధింపులు తగ్గిపోతాయి.’ గడ్డం రామకృష్ణ, చార్టర్డ్ అకౌంటెంట్, ఎస్‌వీఆర్‌ఎల్ అసోసియేట్స్ -
సీబీఈసీ.. ఇక సీబీఐసీ
♦ జూన్ 1వ తేదీ నాటికి ఏర్పాటు ♦ సీబీఐసీ కింద దేశవ్యాప్తంగా 21 జీఎస్టీ జోన్లు, 102 కమిషనరేట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్రంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెచ్ఆర్డీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్’(సీబీఈసీ) స్థానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ను తీసుకు వస్తున్నారు. జూన్ మొదటి తేదీ లోగా ఇది ఏర్పాటు కానుంది. సీబీఐసీలో ఛైర్మన్‌తో పాటు జీఎస్టీ అండ్ సెంట్రల్ ట్యాక్స్, ఐటీ లీగల్, ఇన్వెస్టిగేషన్, ట్యాక్స్ పాలసీ, కస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ విజిలెన్స్ విభాగాలకు చెందిన ఆరుగురు సీబీఐసీలో కీలక సభ్యులుగా ఉంటారు. ఇకపోతే సీబీఐసీ నూతన స్వరూపంలో దేశవ్యాప్తంగా∙21 జీఎస్టీ జోన్లు, 102 జీఎస్టీ పన్ను చెల్లింపు సర్వీస్ కమిషనరేట్లు ఉండడంతో పాటు 14 జీఎస్టీ సబ్ కమిషనరేట్లు, 768 డివిజన్లు, 3969 రేంజి కార్యాలయాలు పని చేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా 49 జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్లు, 50 జీఎస్టీ అప్పీల్ కమిషనరేట్లు, 11 కస్టమ్స్ జోన్లు, 60 కస్టమ్స్ కమిషనరేట్లు, 10 కస్టమ్స్ అప్పీల్లు కస్టమ్స్ కమిషనరేట్లు సీబీఐసీ పరిధిలోనే ఉంటాయి. కొత్త సీబీఐసీ క్రింద చిన్నచిన్న కేంద్రాల్లో సైతం జీఎస్టీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటిని విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిల్లో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చెల్లతో పాటు మరో పట్టణంలో వీటిని ఏర్పాటుచేస్తారన్నది సమాచారం. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్లు ఇకపై జీఎస్టీ పన్ను చెల్లింపు సర్వీసు కమిషనరేట్లుగా మారనున్నాయి. కొత్తపన్ను చెల్లింపుదారులందరూ కొత్త సీబీఐసీ పరిధిలోకే వస్తారని కేంద్ర ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను వ్యవస్థ విజయవంతం కావాలంటే సంస్కరణలు అవసరమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ భావిస్తోంది.