న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్ల మోసాలకు సంబంధించి ప్రభుత్వం మరో అలర్ట్ జారీ చేసింది. మోసపూరిత ఆన్‌లైన్ వ్యాపారుల మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ( సీబీఐసీ)తాజాగా హెచ్చరిక చేసింది. భారతీయ కస్టమ్స్ నుండి వచ్చినట్లు , వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోసపూరిత కాల్‌లు, ఇమెయిల్‌లు, సందేశాలుతో వచ్చే సోషల్ మీడియా పోస్ట్‌లకు బలైపోకండి అని ప్రకటించింది. నకిలీ ఆదాయపు పన్ను రిటర్న్ ( ఐటీఆర్) రీఫండ్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!)
భారత కస్టమ్స్ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ‘‘వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నుంచి కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కస్టమ్స్ విభాగం ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయదు. ఎస్‌ఎంఎస్ పంపదు. దేశ కస్టమ్స్ శాఖ నుండి వచ్చే సమాచారం, సందేశాలు మొత్తం సీబీఐసీ వెబ్‌సైట్ ధృవీకరించబడే డీఐఎన్ (డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్)ను కలిగి ఉంటాయి’ అని ఆర్థిక శాఖ ప్రకటన స్పష్టం చేసింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!)
Comments
Please login to add a commentAdd a comment