పండగలు రాబోతున్నాయి. ఇంటిల్లిపాదికి బట్టలు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలన్న ప్లాన్‌లో ఉంది రోజా. ఆన్‌లైన్ షాపింగ్ అయితే సులువైన పని అనుకుంటూనే వాటిలోని ఆఫర్లను చెక్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వస్తువుల అమ్మకాలలో ఇచ్చే డీల్స్ చూస్తోంది. అనుకున్న బ్రాండ్‌లో ఓ ఫోన్ డీల్ కనపడింది. అత్యంత తక్కువ ధరకే వస్తోంది, నిమిషాల్లోనే ఆ డీల్ ముగుస్తుంది. అందుకే వెంటనే క్లిక్ చేసింది. అక్కడ నుంచి పోర్టల్‌లోకి వెళ్లడం, ఫోన్ బుక్ చేయడం చకచకా జరిగిపోయాయి.
అమౌంట్ డెబిట్ అయ్యింది. కానీ, వస్తువు బుక్ అయినట్టుగా చూపించడం లేదు. ఆ తర్వాత చెల్లించిన డబ్బు గురించి ప్రయత్నించింది. కానీ, ఆ డబ్బు తిరిగి తన అకౌంట్‌లోకి రాలేదు. ఆన్‌లైన్‌లో నకిలీ పండగ ఆఫర్ మోసాలు అధికంగా జరుగుతుంటాయి. వాటిలో... ప్రీ డెలివరీ నోటిఫికేషన్ స్కామ్, ఫేక్ షాపింగ్ సైట్లు, ఫేక్ గిఫ్ట్ కార్డులు, వోచర్లు, కూపన్లు, ఫేక్ స్వచ్ఛంద సంస్థలు, ఫేక్ ప్రయాణ ఆఫర్లు ఉంటాయి. ఇవన్నీ. డీల్ ఆఫ్ ది డే, ఆఫర్స్ అంటూ ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. తక్కువ ధరకు వస్తువులు, సేవలు లభిస్తాయన్న మన ఆశ స్కామర్ల చేతికి చిక్కేలా చేస్తుంది.
నకిలీ షాపింగ్ సైట్‌లను గుర్తించడానికి సులభమైన మార్గాలు
- యుఆర్‌ఎల్ ప్రక్కన ప్యాడ్‌లాక్ ఉన్న //http చెక్ చేయడం ద్వారా సైట్ సురక్షితమైనదో కాదో తెలుసుకోవచ్చు.
- సైట్ యుఆర్‌ఎల్ సందేహంగా నిజమైన రిటైలర్ అధికారిక చిరునామాకు దగ్గరగా ఉండి, కొన్ని అక్షరాలలో తేడా ఉండటం మరొక సంకేతం.
- బ్రౌజ్ చేస్తున్నప్పుడు రిటైలర్ యుఆర్‌ఎల్‌ని మాన్యువల్‌గా టైప్ చేయడం ద్వారా నకిలీ డొమైన్‌లను అడ్డుకోవచ్చు.
- ఇ–మెయిల్, టెక్ట్స్ లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా షార్ట్ లింక్స్ వస్తుంటాయి.
- మీ ఆర్డర్ గురించి మీకు సందేహాలు ఉంటే ఆన్‌లైన్‌లో అమ్మకందారు ఏరియా చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నంబర్‌ను నిర్ధారించుకోవాలి. సైట్‌లో కస్టమర్ సర్వీస్, సంప్రదింపు వివరాలు లేనట్లయితే సందేహించాలి.
మీరు షాపింగ్ స్కామ్‌కు గురైతే...
- వెంటనే మీ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఫిర్యాదు చేయాలి. స్కామర్ మీ అకౌంట్స్‌కి యాక్సెస్ తీసుకున్నట్లు వారికి తెలియజేయాలి.
- మీ బ్యాంక్ అకౌంట్‌పై కంట్రోల్‌కి ఆన్‌లైన్ పాస్‌వర్డ్‌లను మార్చండి. రెండు కారకాల ప్రమాణీకరణను (2ఊఅ)ని పాటించాలి. ∙అనుమానిత సైట్ నుంచి ఏదైనా డౌన్‌లోడ్ చేసినట్లయితే, స్కామర్‌లు ఇన్‌స్టాల్ చేసిన మాల్వేర్, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్ కోసం మీ పరికరాలను స్కాన్ చేయడానికి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి.
- మీరు ఇంతకు ముందెన్నడూ ఆర్డర్ చేయని సైట్‌ని సందర్శిస్తున్నట్లయితే, వెబ్‌సైట్‌లోని ‘అబౌట్’ సెక్షన్‌ని చెక్ చేయాలి. వెబ్‌సైట్ ఎంత పాతదో దానితోపాటు కొన్ని కస్టమర్ రివ్యూలను చూడాలి.
- ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు స్కామ్‌కు గురైనట్లయితే వెంటనే పోలీసు రిపోర్ట్ ఫైల్ చేయాలి. https://cybercrime.gov.in/ కూ రిపోర్ట్ చేయచ్చు.
--అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
(చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేలా..మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు!)
Comments
Please login to add a commentAdd a comment