ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ, ప్రైవేట్‌రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ సంయుక్తంగా క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి విడుదల చేసింది. మాస్టర్ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్‌పై ఈ కార్డు పనిచేయనున్నట్లు తెలిపింది. స్విగ్గీ ఫుడ్, గ్రాసరీ డెలివరీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుండడం ఈ కార్డు ప్రత్యేకత. అంతేకాకుండా ఇతర కొనుగోళ్లపైనా రివార్డులు, ప్రయోజనాలు లభిస్తాయి.
బెనిఫిట్స్ ఇవే
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, స్విగ్గీ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కిరాణా డెలివరీ, డైనింగ్ అవుట్ మరియు మరిన్నింటిలో ఖర్చులపై 10% క్యాష్‌బ్యాక్‌తో సహా అనేక రకాల ప్రయోజనాలను ఈ కార్డుదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.500. వార్షిక రుసుముగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2 లక్షలు కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపితే వార్షిక రుసుము రద్దు చేస్తారు. రెంట్ పేమెంట్, యుటిలిటీ బిల్స్, ఫ్యూయల్, ఇన్సురెన్స్, ఈఎంఐ, జ్యువెలరీ కొనుగోళ్లకు క్యాష్ బ్యాక్ వర్తించదు. ఒక నెలలో 10 శాతం క్యాష్‌బ్యాక్ కింద రూ.1,500 లభిస్తుంది. 5 శాతం క్యాష్‌బ్యాక్‌కూ అదే పరిమితి వర్తిస్తుంది. 1 శాతం క్యాష్‌బ్యాక్‌కు నెలలో గరిష్ఠ పరిమితి రూ.500గా నిర్ణయించారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా, ఓలా, ఉబెర్, ఫార్మఈజీ, బుక్‌మైషో ఇంకా మరెన్నో ప్లాట్‌ఫారమ్‌లలో షాపింగ్ చేయడంపై కార్డ్ హోల్డర్‌లు 5% క్యాష్‌బ్యాక్‌ను కూడా అందుకుంటారు. ఈ అదనపు 5% క్యాష్‌బ్యాక్ ప్రయోజనం Nike, H&M, Adidas, Zara మొదలైన బ్రాండెడ్ వెబ్‌సైట్‌లకు కూడా వర్తిస్తుంది.ఇంకా, కస్టమర్‌లు ఇతర ఖర్చులపై 1% తిరిగి పొందుతారు. కార్డ్ హోల్డర్‌లు స్విగ్గీ మనీ రూపంలో క్యాష్‌బ్యాక్ పొందుతారు. వీటిని వివిధ లావాదేవీల కోసం స్విగ్గీ అంతటా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా కార్డ్ హోల్డర్‌లు 3-నెలల కాంప్లిమెంటరీ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్‌ను పొందగలరు.
ఇది ఫుడ్, కిరాణా, డైనింగ్ అవుట్, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్‌లలో ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ పొందడంతో పాటు, స్విగ్గీ, HDFC కార్డ్ హోల్డర్‌లు ఉచిత బస, భోజనం, కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్‌షిప్‌లతో పాటు మరిన్ని వంటి ప్రపంచ స్థాయి మాస్టర్‌కార్డ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. స్విగ్గీ యాప్‌లో వారం పది రోజుల్లో దశలవారీగా ఈ క్రెడిట్ కార్డు అందుబాటులోకి రానుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు స్విగ్గి యాప్ లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment