customes tax
-
Fraud Alert: కస్టమ్స్ డ్యూటీ, వారికి బలైపోకండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్ల మోసాలకు సంబంధించి ప్రభుత్వం మరో అలర్ట్ జారీ చేసింది. మోసపూరిత ఆన్లైన్ వ్యాపారుల మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ( సీబీఐసీ)తాజాగా హెచ్చరిక చేసింది. భారతీయ కస్టమ్స్ నుండి వచ్చినట్లు , వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోసపూరిత కాల్లు, ఇమెయిల్‌లు, సందేశాలుతో వచ్చే సోషల్ మీడియా పోస్ట్‌లకు బలైపోకండి అని ప్రకటించింది. నకిలీ ఆదాయపు పన్ను రిటర్న్ ( ఐటీఆర్) రీఫండ్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) భారత కస్టమ్స్ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ‘‘వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నుంచి కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కస్టమ్స్ విభాగం ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయదు. ఎస్ఎంఎస్ పంపదు. దేశ కస్టమ్స్ శాఖ నుండి వచ్చే సమాచారం, సందేశాలు మొత్తం సీబీఐసీ వెబ్సైట్ ధృవీకరించబడే డీఐఎన్ (డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్)ను కలిగి ఉంటాయి’ అని ఆర్థిక శాఖ ప్రకటన స్పష్టం చేసింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) -
దుబాయ్ బంగారాన్ని తెస్తున్నారా? లిమిట్ ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారతీయులకు బంగారం అంటే మోజు ఎక్కువ. అందులోనూ తక్కువ ధరకు, ప్రీమియం క్వాలిటీతో లభించే దుబాయ్ బంగారం అంటే మరీ ఇష్టం. ముఖ్యంగా ధంతేరస్ పర్వదినం సందర్బంగా ఎంతో కొంత గోల్డ్‌ను కొనుగోలు చేయడం బాగా అలవాటు. అయితే మన దేశంలో తరుగు మేకింగ్ చార్జీలు బాదుడు ఎక్కువ. దీంతో దుబాయ్ బంగారానికి గిరాకీ ఎక్కువ. ఐకానిక్ భవనాలు, ఎక్సైటింగ్ ఈవెంట్స్ మాత్రమే కాదు షాపింగ్కోసం ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటి దుబాయ్. అందుకే చాలామంది దుబాయ్ నుంచి పుత్తడిని, బంగారు ఆభరణాలను భారత్‌కు తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇండియాలో బంగారంపై దిగుమతి సుంకాన్ని చెల్లించాలి. రోజువారీ ధరించే లైట్ వేర్ బంగారు ఆభరణాలకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఉన్నప్పటికీ, బార్లు లేదా నాణేల రూపంలో బంగారం కస్టమ్ డ్యూటీ చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి గోల్డ్ తెచ్చుకోవాలంటే కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. లేదంటే తిప్పలు తప్పవు. ప్రభుత్వసుంకాలు, ఇతర ఛార్జీలవివరాలను పరిశీలిస్తే.. సెంట్రల్ బోర్డు ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ప్రకారం 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న ఏదైనా భారత సంతతికి చెందిన వ్యక్తులు బ్యాగేజీలో బంగారు ఆభరణాలను భారతదేశానికి తీసుకురావడానికి అర్హులు. దిగుమతి సుంకం విషయానికి వస్తే ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే..వారు తీసుకొచ్చే పసిడికి 12.5 శాతం+సర్‌చార్జ్ 1.25 శాతం వర్తిస్తుంది. అలాగే దుబాయ్నుంచి ఇండియాకు ఒక వ్యక్తి తెచ్చిన పుత్తడిపై 38.5 శాతం కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరానికి పైగా విదేశాలలో నివసిస్తున్న ఒక వ్యక్తి 20 గ్రాముల బంగారు ఆభరణాలను, లేదా 50 వేల రూపాయల విలువకు మించకుండా తీసుకురావచ్చు. అదే మహిళా ప్రయాణికులైతే ఒక లక్ష రూపాయల గరిష్ట విలువ, 40 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకురావచ్చు. కాగా కరెంట్ ఖాతా లోటుకు చెక్ చెప్పేలా బంగారంపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది 15 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు ఇది 10.75 శాతం మాత్రమే. -
గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ..
దొడ్డబళ్లాపురం( బెంగళూరు): కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ దాచిన ఎలక్ట్రిక్ గిటార్‌ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన వ్యక్తి ఎలక్ట్రిక్ గిటార్లోపల స్యూడో ఎఫెడ్రిన్ అనే మత్తుమందును ప్యాక్ చేసి తమిళనాడు తిరుచ్చిలోని కొరియర్ ఏజెన్సీలో కొరియర్ చేశాడు. అది ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. కెంపేగౌడ విమానాశ్రయంలో అధికారులు అనుమానంతో చెక్ చేయగా అందులో మత్తుమందు బయటపడింది. ఈ మత్తుమందు విలువ సుమారు రూ.50 లక్షలని అంచనా. మరో ఘటనలో... లారీ ఢీకొని బైకిస్టు మృతి తుమకూరు: లారీ ఢీ కొట్టడంతో బైకిస్టు మరణించాడు. ఈ ఘటన నగర శివార్లలో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగింది. గుబ్బి నుంచి తుమకూరు వైపు వస్తున్న బైక్‌ను ఎదురుగా మితిమీరిన వేగంతో వెళ్లిన లారీ ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. చదవండి: స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత.. -
ఇక ఈ వాహనాలు ఖరీదే
సాక్షి, న్యూఢిల్లీ: "మేక్ ఇన్ ఇండియా" చొరవలో భాగంగా స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వివిధ రకాల వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2020 - 21 ప్రసంగంలో శనివారం ప్రకటించారు. పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) పై కస్టమ్స్ సుంకాన్ని 40 శాతానికి పెంతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 25 శాతం మాత్రమే. 2020 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. దీంతో దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవిగా మారనున్నాయి. అయితే ఈ మేరకు దేశీయ కంపెనీలకు కాస్త ఊరట లభించనుంది. ప్రయాణీకుల సెమీ నాక్-డౌన్ (ఎస్కెడి) పాసింజర్ వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అదేవిధంగా, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సాంప్రదాయ వాణిజ్య వాహనాల సీబీయూల కస్టమ్స్ సుంకాన్ని 30 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు. ఉత్ప్రేరక (కెటాలిక్) కన్వర్టర్లను తయారు చేయడానికి ఉపయోగించే భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతం నుండి 7.5 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాకుండా, ప్రయాణీకుల ఈవీలు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనాలు, బస్సు మరియు ట్రక్కుల యొక్క పూర్తిగా నాక్-డౌన్ (సికెడి) రూపాలపై కస్టమ్స్ సుంకం ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతం వరకు పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. కాలుష్య ఉద్గారాలు అదుపులేని స్థాయికి పెరగడంతో గ్రీన్మొబిలిటీపై ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో, వివిధ కార్ల తయారీదారులు గత కొన్నేళ్లుగా దేశంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్, ఎంజి మోటార్ ఇండియా కూడా ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టాయి. అదేవిధంగా మెర్సిడెస్ బెంజ్, ఆడి, జెఎల్ఆర్ లాంటి కంపెనీలు కూడా దేశంలో ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
వాణిజ్య సంస్కరణలపై 15 రోజుల్లో నిర్ణయం
హైదరాబాద్: పదిహేను రోజుల్లో మరోసారి సమావేశమై వాణిజ్య పన్నుల సంస్కరణల్లో నిర్ణయాలు తీసుకుంటామని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వాణిజ్య పన్నుల సంస్కరణలపై తెలంగాణ మంత్రివర్గం ఉపసంఘం భేటీ అయింది. ఈ భేటీకి మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, ఉన్నతాధిఆరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో జీరో వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారు. వ్యాపారస్థులంతా విధిగా పన్నులు చెల్లించాలని స్పష్టం చేశారు.