దేశీయంగా తయారీ ప్రోత్సహించడానికి 2022-23 బడ్జెట్‌లో 350 ముడిసరుకులపై కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 40కి పైగా ఉత్పత్తుల మీద కస్టమ్స్ మినహాయింపులను ప్రకటించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబిఐసీ) ట్వీట్ చేసింది. మొత్తంగా ఉత్పత్తుల మీద 350 కస్టమ్స్ సుంకాలను ఉపసంహరించుకుంటామని సీబిఐసీ తెలిపింది. వీటిలో మినహాయింపులు పొందుతున్న కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, బట్టలు, వైద్య పరికరాలు, మందులు లాంటివి ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ వస్తువులు, హెడ్ సెట్స్ పరికరాలు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్ల వంటి ఉత్పతులను దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించేందుకు గ్రేడెడ్ రేట్ స్ట్రక్చర్‌ను అందించడానికి కస్టమ్స్ డ్యూటీ రేట్లను రూపొందిస్తామని నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించారు. మొబైల్ ఫోన్ ఛార్జర్‌ల, ట్రాన్స్‌ఫార్మర్ భాగాలు, మొబైల్ కెమెరా మాడ్యూల్ కెమెరా లెన్స్, కొన్ని ఇతర వస్తువులకు కూడా డ్యూటీ రాయితీలు కల్పిస్తామని ఆమె చెప్పారు. రత్నాలు, ఆభరణాల రంగానికి ఊతమిచ్చేందుకు కట్, పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి, సాన్ డైమండ్‌పై సున్నా శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ-కామర్స్ ద్వారా ఆభరణాలను ఎగుమతి చేయడానికి 2022 జూన్ నాటికి సరళీకృత నియంత్రణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఆమె అన్నారు. తక్కువ విలువతో అనుకరణ ఆభరణాల దిగుమతిని అరికట్టేందుకు అనుకరణ ఆభరణాలపై కిలోకు 400 రూపాయల కస్టమ్స్ సుంకాన్ని విధించాలని చూస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment