కేంద్ర బడ్జెట్ 2025-26లో కొన్ని రకాల వస్తువలపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పూర్తీగా మినహాయించింది. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ (BCD) నుండి పూర్తిగా మినహాయించిన వస్తువుల జాబితాలో 36 ప్రాణ రక్షక మందులు, వెట్ బ్లూ లెదర్, లిథియం బ్యాటరీలు ఉన్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) వరుసగా ఎనిమిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ మినహాయింపులు ప్రకటించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుండి పూర్తిగా మినహాయించిన వస్తువులు ఇవే..
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 ముఖ్యాంశాలు
36 ప్రాణ రక్షక ఔషధాలు
ఈవీల తయారీకి ఉపయోగించే 35 రకాల ముడిపదార్థాలు
వెట్ బ్లూ లెదర్
లిథియం బ్యాటరీలు స్క్రాప్
కోబాల్ట్ ఉత్పత్తులు
ఎల్‌ఈడీలు
జింక్
12 క్లిష్టమైన ఖనిజాలు
చేపల పేస్ట్‌పై సుంకం 30% నుంచి 5%కి తగ్గింపు
Comments
Please login to add a commentAdd a comment