exempted
-
Mahila Samman Scheme: గుడ్‌న్యూస్: మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్లో మహిళా సమ్మాన్ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది. అయితే ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తాజాగా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! అదే సమయంలో రాబడిపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) అమలు చేయరని పేర్కొంది. సీబీడీటీ ఆదేశాల ప్రకారం మహిళా సమ్మాన్ సర్టిఫికెట్లో వచ్చే వడ్డీ ఆదాయం రూ.40వేలు మించకపోతే టీడీఎస్ వర్తించదని స్పష్టమవుతోందని నాంజియా అండర్సన్ ఇండియా పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై ఒక ఏడాదిలో 7.5 శాతం మేరకు రాబడి రూ.15,000గానే ఉంటుందని, కనుక టీడీఎస్ వర్తించదన్నారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు
సాక్షి, విజయవాడ: ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు లభించింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుతో మినహాయింపు దక్కింది. 5 రాష్ట్రాలకు వేల కోట్ల పెనాల్టీ వేసిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. ఏపీలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ వల్ల పెనాల్టీ విధించలేదు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఎన్జీటీ సంతృప్తి చెందింది. తెలంగాణకు 3,800 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కి 3 వేల కోట్లు, మహారాష్ట్రకు 12 వేల కోట్లు, రాజస్థాన్‌కి 3 వేల కోట్లు, కర్ణాటకకు 2, 900 కోట్లు ఎన్జీటీ పెనాల్టీ విధించింది. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
ఏపీ: ఆ భూములకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు
సాక్షి, అమరావతి: గోడౌన్ల నిర్మాణం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు లీజుకిస్తున్న భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం మినహాయించింది. ఈ సొసైటీలను గ్రామ స్థాయిలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు వాటి పరిధిలో గోడౌన్లను నిర్మిస్తున్నారు. వీటి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను లీజుకు ఇస్తోంది. ఈ భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవీ చదవండి: ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే.. -
డీజిల్ కార్లకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2000 సీసీ కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన కొత్త కార్ల వినియోగానికి మంగళవారం సుప్రీంకోర్టు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. డీజిల్ కార్లు సాధారణ వాహనాల కంటే ఎక్కువ వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తాయని కోర్టు నమ్మిందనీ... ఈ విషయం తప్పు కూడా కావొచ్చని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంజన్ సామర్థ్యం, కారు ధరను బట్టి ఓనర్లందరూ వన్ టైమ్ పర్యావరణ సెస్ కట్టాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. రాజధాని ప్రాంతం నుంచి డీజిల్ కార్లను తొలగించడంపై ఢిల్లీ ప్రభుత్వం, వాతావరణ కాలుష్య పర్యవేక్షణ సంస్థ, టాక్సీ ఓనర్ అసోసియేషన్లను రోడ్ మ్యాప్ చూపాలని ఆదేశించింది. డీజిల్ కార్లు మాత్రమే వాతావరణ కాలుష్యానికి కారణం కాదని.. పెట్రోల్, సీఎన్జీలు కూడా కాలుష్యానికి కారణమవుతాయని, పెట్రోలు కార్లు కార్బన్ మోనాక్సైడ్, సీఎన్జీ కార్లు నైట్రోజన్ ఆక్సైడ్ లను విడుదల చేస్తాయని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. మేక్ ఇన్ ఇండియా పాలసీలో ఆటో మొబైల్ రంగానికి ప్రాధాన్యతనిచ్చారని, కాలుష్యం కారణంగా పాలసీని విరమించుకోలేమని రంజిత్ కోర్టుకు తెలిపారు. 2015లో ఐఐటీ కాన్పూర్ చేసిన సర్వే ఆధారాలను చూపుతూ.. దుమ్ము, సహజంగా మంటల కారణంగా వచ్చే కాలుష్యాన్ని ఎవరూ ఆపలేరని, డీజిల్ కార్లకు రాజధాని ప్రాంతంలో సడలింపునివ్వాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం లగ్జరీ కార్ల వినియోగానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. -
మహిళలకు ఆ రూల్ లేదు!
న్యూ ఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇక రెండవ దశ 'సరి-బేసి' విధానాన్ని అమలు చేయడానికి సమాయత్తమయ్యారు. ఎప్రిల్ 15 నుంచి మరోసారి సరి-బేసి ట్రయల్ రన్‌ను అమలు చేయనున్నారు. అయితే ఈ సారి సరి-బేసి నిబంధన నుంచి మహిళలకు మినహాయింపు ఇచ్చారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే మహిళలు సరి, భేసితో సంబంధం లేకుండా ఏ నంబర్ కారుతో అయినా ట్రయల్ రన్ సమయంలో ఢిల్లీ రోడ్ల మీదకు వెళ్లొచ్చు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్కూల్ పిల్లలకు సైతం ఈ సారి సరి- భేసి నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆలోచనలో ఢిల్లీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న చిన్నారులు కారులో ఉంటే చాలు.. సరి- భేసి నిబంధన వర్తించదన్న మాట. అయితే పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి తల్లిదండ్రులు వెళ్లేటప్పుడు పరిస్థితి ఏంటి అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అయితే ఈ విషయంపై మరి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్లు ఢిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. మొదటిసారి ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో.. సరి-భేసి విధానం అమలు చేసినా కాలుష్యంలో మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ సారి ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య పరిమాణాన్ని తెలుసుకోవడానికి ముందుగానే కసరత్తులు ప్రారంభిస్తోంది. గురువారం నుంచి రాజధానిలోని కాలుష్య పరిమానాన్ని అధికారులు నమోదు చేయనున్నారు.