మహిళలకు ఆ రూల్ లేదు! | Women are exempted from the odd-even scheme | Sakshi
Sakshi News home page

మహిళలకు ఆ రూల్ లేదు!

Published Wed, Apr 6 2016 7:40 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

మహిళలకు ఆ రూల్ లేదు!

మహిళలకు ఆ రూల్ లేదు!

న్యూ ఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇక రెండవ దశ 'సరి-బేసి' విధానాన్ని అమలు చేయడానికి సమాయత్తమయ్యారు. ఎప్రిల్ 15 నుంచి మరోసారి సరి-బేసి ట్రయల్ రన్ను అమలు చేయనున్నారు. అయితే ఈ సారి సరి-బేసి నిబంధన నుంచి మహిళలకు మినహాయింపు ఇచ్చారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే మహిళలు సరి, భేసితో సంబంధం లేకుండా ఏ నంబర్ కారుతో అయినా ట్రయల్ రన్ సమయంలో ఢిల్లీ రోడ్ల మీదకు వెళ్లొచ్చు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే స్కూల్ పిల్లలకు సైతం ఈ సారి సరి- భేసి నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆలోచనలో ఢిల్లీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. స్కూల్ యూనిఫామ్లో ఉన్న చిన్నారులు కారులో ఉంటే చాలు.. సరి- భేసి నిబంధన వర్తించదన్న మాట. అయితే పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి తల్లిదండ్రులు వెళ్లేటప్పుడు పరిస్థితి ఏంటి అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అయితే ఈ విషయంపై మరి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్లు ఢిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

మొదటిసారి ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో.. సరి-భేసి విధానం అమలు చేసినా కాలుష్యంలో మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ సారి ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య పరిమాణాన్ని తెలుసుకోవడానికి ముందుగానే కసరత్తులు ప్రారంభిస్తోంది. గురువారం నుంచి రాజధానిలోని కాలుష్య పరిమానాన్ని అధికారులు నమోదు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement