odd even
-
ఢిల్లీ కాలుష్యం : విమర్శలపై సీఎం స్పందన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీలో ఈ పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకుండా పక్క రాష్ట్రాలపై నిందలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా విమర్శలకు సమాధానమిచ్చారు. ‘మేము ఎవరిపైనా ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. మా తాపత్రయమంతా చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుపైనే ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఈ సంవత్సరంలోనే అత్యధికంగా 625 పాయింట్ల కాలుష్యం నమోదైనట్టు చెప్పింది. పక్క రాష్ట్రాల పంట దహనం కారణంగా ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయిందనేది అక్షర సత్యం. రాజకీయాలు చేసే ఉద్దేశ్యం తమకు లేదు’అని అన్నారు. జరిమానాలు విధిస్తున్నాం.. నిర్మాణ రంగంలో విపరీతంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న కంపెనీలపై జరిమానాలు విధిస్తున్నామని సీఎం అన్నారు. ఢిల్లీతో పాటు కాలుష్యం బారిన పడిన పంజాబ్, హరియాణ సీఎంలు కూడా కేంద్రంతో చర్చలు జరిపేందుకు తమతో కలిసిరావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రజలంతా తనకు కుటుంబ సభ్యులని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని సూచించారు. కాలుష్యం ముప్పు నుంచి ప్రజలను కాపాడేందుకు సోమవారం నుంచి సరి-బేసి విధానాన్ని పునఃప్రారంబిస్తున్నామని, ప్రజలంతా సహరించాలని ఆయన కోరారు. -
'ఆ సీఎం చేసేవన్నీ జిమ్మిక్కులే'
న్యూఢిల్లీ: కాలుష్య నివారణ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సరిభేసి విధానం ఓ జిమ్మిక్కు అని సామాజిక ఉద్యమకారుడు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ఆయన ..అరవింద్ కేజ్రీవాల్ వద్ద కీలక సభ్యుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. కాలుష్యం నుంచి ఢిల్లీ ప్రజలను బయటపడేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయని సరి బేసి విధానం మాత్రమే పరిష్కారం కాదన్నారు. ప్రత్యేక బైక్ మార్గాలు ఏర్పాటు చేయడం, ఉత్తమ ప్రజా రవాణ వ్యవస్థ కల్పన పరిష్కార మార్గాలుగా చూపించవచ్చని ప్రశాంత్ భూష ణ్ సూచించారు. సరి బేసి విధానం ఒక జిమ్మిక్కు అంటూ ఆయన ట్వీట్ చేశారు. గతంలో ఒకసారి సరి బేసి విధానం ప్రవేశ పెట్టిన ఢిల్లీ ప్రభుత్వం కొంత విరామం అనంతరం శుక్రవారం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. -
మహిళలకు ఆ రూల్ లేదు!
న్యూ ఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇక రెండవ దశ 'సరి-బేసి' విధానాన్ని అమలు చేయడానికి సమాయత్తమయ్యారు. ఎప్రిల్ 15 నుంచి మరోసారి సరి-బేసి ట్రయల్ రన్‌ను అమలు చేయనున్నారు. అయితే ఈ సారి సరి-బేసి నిబంధన నుంచి మహిళలకు మినహాయింపు ఇచ్చారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే మహిళలు సరి, భేసితో సంబంధం లేకుండా ఏ నంబర్ కారుతో అయినా ట్రయల్ రన్ సమయంలో ఢిల్లీ రోడ్ల మీదకు వెళ్లొచ్చు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్కూల్ పిల్లలకు సైతం ఈ సారి సరి- భేసి నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆలోచనలో ఢిల్లీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న చిన్నారులు కారులో ఉంటే చాలు.. సరి- భేసి నిబంధన వర్తించదన్న మాట. అయితే పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి తల్లిదండ్రులు వెళ్లేటప్పుడు పరిస్థితి ఏంటి అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అయితే ఈ విషయంపై మరి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్లు ఢిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. మొదటిసారి ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో.. సరి-భేసి విధానం అమలు చేసినా కాలుష్యంలో మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ సారి ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య పరిమాణాన్ని తెలుసుకోవడానికి ముందుగానే కసరత్తులు ప్రారంభిస్తోంది. గురువారం నుంచి రాజధానిలోని కాలుష్య పరిమానాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. -
'మండే టెస్ట్' పాస్.. ఢిల్లీవాలా రిలీఫ్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్ సర్కార్ అమల్లోకి తెచ్చిన 'సరి-బేసి' అంకెల విధానం 'మండే టెస్ట్'లో దాదాపు పాస్ అయినట్టు కనిపిస్తోంది. 'సరి-బేసి' వాహన నెంబర్ ప్లేట్ల విధానం జనవరి 1 తేదీన అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ మూడురోజులు వారాంతపు సెలవులు కావడంతో దీని ప్రభావం ప్రధానంగా సోమవారం తెలుస్తోందని సర్వత్రా భావించారు. అంతా అనుకున్నట్టే సోమవారం 'సరిసంఖ్య' నెంబర్ కలిగిన వాహనాలు మాత్రమే రోడ్లు ఎక్కాయి. సరిసంఖ్య వాహనం లేనివాళ్లు ప్రజారవాణా వ్యవస్థపై ఆధారపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈ విధానాన్ని ఉల్లంఘిస్తూ 'బేసి' సంఖ్య కలిగిన వాహనాలు రోడ్లు ఎక్కడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 200 మందికి జరిమానా విధించారు. ఈ విధానం అమలు విషయంలో ప్రముఖులకు కూడా ఎలాంటి మినహాయింపు ఉండదని ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ ముక్తేశ్ చందర్ తెలిపారు. ఈ విధానాన్ని ఉల్లంఘించిన ఓ వీఐపీకి ఆయన స్వయంగా చలాన్ విధించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ట్రాఫిక్ విధానానికి అనుగుణంగా తన కారును పక్కనబెట్టారు. రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ టాటా నానో కారులో ఆయనతోపాటు కలిసి కేజ్రీవాల్ సెక్రటేరియట్ కు పయనమయ్యారు. ట్రాఫిక్ చిక్కులు తప్పడంతో రిలీఫ్ ఢిల్లీ రోడ్ల మీద సాధారణంగా భారీ ట్రాఫిక్ ఉంటుంది. అందుకు భిన్నంగా సోమవారం దర్శనమిచ్చింది. సహజంగా ట్రాఫిక్ ఉండే జంక్షన్లు కూడా 'సరి-బేసి' విధానం కారణంగా సాధారణంగా కనిపించాయి. నూతన విధానం వల్ల భారీ సంఖ్యలో కార్లు రోడెక్కకపోవడంతో హస్తినలో పెద్దగా ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాలేదంటూ ఢిల్లీ వాసులు ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేశారు. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం కార్లను రోడ్లకు మీదకు అనుమతిస్తూ కేజ్రీవాల్ సర్కార్ తెచ్చిన ఈ విధానంపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి ప్రైవేటు వాహనదారులు ప్రయత్నిస్తున్నారని, ముఖ్యంగా క్యాబ్‌ల చార్జీలను విపరీతంగా పెంచారని మరికొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.