'ఆ సీఎం చేసేవన్నీ జిమ్మిక్కులే'
న్యూఢిల్లీ: కాలుష్య నివారణ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సరిభేసి విధానం ఓ జిమ్మిక్కు అని సామాజిక ఉద్యమకారుడు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ఆయన ..అరవింద్ కేజ్రీవాల్ వద్ద కీలక సభ్యుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. కాలుష్యం నుంచి ఢిల్లీ ప్రజలను బయటపడేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయని సరి బేసి విధానం మాత్రమే పరిష్కారం కాదన్నారు.
ప్రత్యేక బైక్ మార్గాలు ఏర్పాటు చేయడం, ఉత్తమ ప్రజా రవాణ వ్యవస్థ కల్పన పరిష్కార మార్గాలుగా చూపించవచ్చని ప్రశాంత్ భూష
ణ్ సూచించారు. సరి బేసి విధానం ఒక జిమ్మిక్కు అంటూ ఆయన ట్వీట్ చేశారు. గతంలో ఒకసారి సరి బేసి విధానం ప్రవేశ పెట్టిన ఢిల్లీ ప్రభుత్వం కొంత విరామం అనంతరం శుక్రవారం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.