న్యూఢిల్లీ: స్పీకర్లు, సిమ్ ట్రే వంటివి అమర్చిన మొబైల్ ఫోన్ డిస్‌ప్లే యూనిట్ల దిగుమతులపై 15 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) వర్తిస్తుందని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది.
డిస్‌ప్లే అసెంబ్లీని దిగుమతి చేసుకునేటప్పుడు, సుంకాల ఎగవేత కోసం తప్పుడు డిక్లరేషన్లను ఇవ్వకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణంగా మొబైల్ ఫోన్ డిస్‌ప్లే అసెంబ్లీలో టచ్ పానెల్, కవర్ గ్లాస్, ఎల్‌ఈడీ బ్యాక్‌లైట్ వంటివి ఉంటాయి. వీటి దిగుమతులపై ప్రస్తుతం 10% సుంకం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment