display goods
-
షార్ప్ ఇండియా చైర్మన్‌గా సుజయ్
న్యూఢిల్లీ: జపాన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం షార్ప్ తమ భారత విభాగం చైర్మన్‌గా సుజయ్ కరమ్పురిని నియమించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచి్చందని సంస్థ తెలిపింది. డిస్ప్లే వ్యాపార విభాగానికి సారథ్యం వహిస్తూ భారత్‌లో షార్ప్ బ్రాండ్‌ను వృద్ధిలోకి తేవడం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. సొల్యూషన్స్ తయారీ, టెక్నాలజీ బదలాయింపునకు వ్యూహాత్మక భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడం తదితర బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సుజయ్ పలు కీలక హోదాల్లో పని చేశారు. -
హైదరాబాద్‌లో ఎల్జీ ఆవిష్కరణల సదస్సు
హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ ఎలక్ట్రా నిక్స్ హైదరాబాద్‌లో ‘ఆవిష్కరణల పునరుద్ధరణ’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.ఇందులో తన డిస్ప్లే ఉత్పత్తి ఎల్జీ మ్యాగ్నిట్తోపాటు 136 ఆల్ ఇన్ వన్ ఎల్ఈడీ, ఎల్జీ వన్: క్విక్ ఫ్లెక్స్, ఎల్జీ వన్: క్విక్వర్క్స్, ఎల్జీ క్రియేట్ బోర్డ్ తదితర ఉత్పత్తులు, సొల్యూషన్లను ప్రదర్శించింది. ఈ వార్షిక సదస్సుకు కస్టమర్లు, భాగ స్వాములు, సిస్టమ్ ఇంటెగ్రేటర్లు విచ్చేసినట్టు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఎల్జీకి సంబంధించి డిస్ప్లే ఉత్పత్తులు, సొల్యూషన్ల గురించి కస్టమర్లు తెలుసుకునే వీలు కల్పించడ మే ఈ సదస్సు ఉద్దేశ్యమని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండి యా బిజినెస్ హెడ్ హేమేందు సిన్హా తెలిపారు. -
మొబైల్ డిస్ప్లే దిగుమతులపై 15 శాతం సుంకాలు
న్యూఢిల్లీ: స్పీకర్లు, సిమ్ ట్రే వంటివి అమర్చిన మొబైల్ ఫోన్ డిస్ప్లే యూనిట్ల దిగుమతులపై 15 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) వర్తిస్తుందని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది. డిస్ప్లే అసెంబ్లీని దిగుమతి చేసుకునేటప్పుడు, సుంకాల ఎగవేత కోసం తప్పుడు డిక్లరేషన్లను ఇవ్వకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణంగా మొబైల్ ఫోన్ డిస్ప్లే అసెంబ్లీలో టచ్ పానెల్, కవర్ గ్లాస్, ఎల్ఈడీ బ్యాక్‌లైట్ వంటివి ఉంటాయి. వీటి దిగుమతులపై ప్రస్తుతం 10% సుంకం ఉంది. -
మొబైల్ రేట్లకు రెక్కలు!
సాక్షి,న్యూఢిల్లీ: డిస్ప్లేల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం 1 శాతం సుంకం విధించిన నేపథ్యంలో మొబైల్ ఫోన్ల ధరలు 3శాతం దాకా పెరిగే అవకాశం ఉందని ఇండి యా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్, హువావే, షావోమి, వివో, విన్స్ట్రాన్ వంటి సంస్థలకు ఇందులో సభ్యత్వం ఉంది. ‘మొబైల్ ఫోన్ల రేట్లపై 1.5-3 శాతం దాకా సుంకాల ప్రభావం ఉంటుంది‘ అని ఐసీఈఏ నేషనల్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుతం దిగుమతులను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్ వాటాను కూడా పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దశలవారీగా తయారీని ప్రోత్సహించే కార్యక్రమంలో (పీఎంపీ) భాగంగా డిస్ప్లే అసెంబ్లీ, టచ్ ప్యానెళ్లపై అక్టోబర్ 1 నుంచి దిగుమతి సుంకాలను అమలు చేయాలని 2016లోనే కేంద్రం నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దేశీయంగా తయారీ పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం పీఎంపీని తెరపైకి తెచ్చింది. వేదాంత గ్రూప్ చైర్మన్ వల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ సుమారు రూ. 68,000 కోట్ల పెట్టుబడితో 2016లో ట్విన్‌స్టార్ డిస్ప్లే టెక్నాలజీస్ పేరుతో దేశీయంగా తొలి ఎల్సీడీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు మొదలుకాలేదు. -
షాప్‌లో అన్ని వస్తువులూ డిస్ప్లేలో..
చిన్న వర్తకులకు స్నాప్‌బిజ్ టెక్నాలజీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తువుల ప్రదర్శన రిటైల్ రంగంలో అత్యంత కీలక అంశం. అన్ని వస్తువులూ కనపడేలా డిస్ప్లే ఉంటేనే అమ్మకాలు పెరుగుతాయి. చిన్న దుకాణాలకు ఇది అతిపెద్ద అడ్డంకి. స్థలాభావంతో అన్ని ప్రొడక్టులను డిస్ప్లే చేయలేరు. ఇటువంటి సమస్యకు చెక్ పెడుతూ రిటైల్ టెక్నాలజీ కంపెనీ స్నాప్‌బిజ్ వినూత్న పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ప్రతి దుకాణంలో 24 అంగుళాల స్మార్ట్ హెచ్డీ ఎల్ఈడీ డిస్ప్లేను అమర్చుతారు. బిల్లింగ్ కౌంటర్ వద్ద స్నాప్‌బిజ్ టర్బో పేరుతో కంప్యూటర్ తెర వంటి 15.6 అంగుళాల టచ్ స్క్రీన్‌ను వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రింటర్, బార్కోడ్ స్కానర్‌ను దీనికి అనుసంధానిస్తారు. ఈ స్క్రీన్ ద్వారా ఎల్ఈడీ డిస్ప్లేను దుకాణదారు ఆపరేట్ చేయవచ్చు. షాప్‌లో ఉన్న వస్తువులతోపాటు డిస్కౌంట్లు, ప్రమోషన్ ఆఫర్లను ఎల్ఈడీ డిస్ప్లేలో ప్రదర్శించవచ్చు. 4 బిల్లులు ఒకేసారి పూర్తి చేయవచ్చు. ఇక కస్టమర్లు స్నాప్ ఆర్డర్ యాప్ ద్వారా సమీప దుకాణంలో లభించే వస్తువుల జాబితాను చూడొచ్చు. ఆర్డరు ఇవ్వొచ్చు. వ్యాపారం పెరుగుతుంది డిస్ప్లే ఆకర్షణీయంగా ఉంటే అమ్మకాలు పెరుగుతాయని స్నాప్‌బిజ్ సహ వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ముంబై, పుణేలో 3,000 దుకాణాల్లో స్నాప్‌బిజ్ టర్బో ఏర్పాటు చేశాం. గతంతో పోలిస్తే వీరి వ్యాపారాల్లో పెరుగుదల కనిపించింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాం. కిరాణా దుకాణాలను డిజిటైజ్ చేస్తాం. వర్తకులు రూ.40,000 చెల్లిస్తే చాలు. నిర్వహణ చార్జీలు లేవు. ఇంటర్నెట్ చార్జీలు మేమే భరిస్తాం. ప్రస్తుతం 25 దిగ్గజ రిటైల్ కంపెనీలు మాతో చేతులు కలిపాయి. ఈ కంపెనీల ఉత్పత్తులు ఎల్ఈడీ డిస్ప్లేలో ప్రదర్శితమవుతాయి. విక్రయాలను బట్టి కంపెనీలు వర్తకులకు ఇన్సెంటివ్ ప్రకటిస్తాయి. స్నాప్ ఆర్డర్ యాప్‌లో కంపెనీతో భాగస్వామ్యం ఉన్న ఎన్ని దుకాణాలనైనా జోడించొచ్చు. స్నాప్‌బిజ్ టర్బోకై 7 పేటెంట్లకు దరఖాస్తు చేశాం’ అని తెలిపారు.