Import Duty Changes
-
ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపు
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై 12-30% మధ్య సుంకం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా, వియత్నాం ఎగుమతి చేసే వెల్డెడ్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబ్‌లకు ఈ సుంకం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ పన్ను నిబంధన అమలులో ఉంటుందని పేర్కొంది. దేశీయ స్టీల్ కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దిగుమతి సుంకం అధికంగా ఉంటే ఖర్చులు పెరిగి విదేశాల నుంచి కొనుగోలు చేసే ఉక్కును తగ్గిస్తారని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపాయి.ఇదీ చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీఇండియా ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 12.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. 2024లో అది 14.4 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. 2029 నాటికి దీని ఉత్పత్తి 20.9 కోట్ల టన్నులు అవుతుందని మార్కెట్ భావిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమ ఏటా 9.18 శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. -
మొబైల్ డిస్ప్లే దిగుమతులపై 15 శాతం సుంకాలు
న్యూఢిల్లీ: స్పీకర్లు, సిమ్ ట్రే వంటివి అమర్చిన మొబైల్ ఫోన్ డిస్ప్లే యూనిట్ల దిగుమతులపై 15 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) వర్తిస్తుందని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది. డిస్ప్లే అసెంబ్లీని దిగుమతి చేసుకునేటప్పుడు, సుంకాల ఎగవేత కోసం తప్పుడు డిక్లరేషన్లను ఇవ్వకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణంగా మొబైల్ ఫోన్ డిస్ప్లే అసెంబ్లీలో టచ్ పానెల్, కవర్ గ్లాస్, ఎల్ఈడీ బ్యాక్‌లైట్ వంటివి ఉంటాయి. వీటి దిగుమతులపై ప్రస్తుతం 10% సుంకం ఉంది. -
సుంకాల్లో మార్పులు.. చిన్న కార్లకు లాభం
కొలంబో : శ్రీలంక ప్రభుత్వం దిగుమతి సుంకాల్లో మార్పులు తీసుకొచ్చింది. 800 నుంచి 1000 సీసీ కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. అదేవిధంగా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కార్లపై మాత్రం దిగుమతి డ్యూటీని పెంచేసింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ లో తయారయ్యే చిన్న కార్ల కంపెనీలు ఎక్కువగా లాభపడనున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదలచేసింది. శ్రీలంకకు 800 నుంచి 1000 సీసీ వెహికిల్స్ ఎక్కువగా ఎగుమతి చేస్తున్నది భారత మార్కెటే కావడంతో, ఈ వెహికిల్స్ కు లాభం చేకూరనుందని డీలర్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక రూపాయల్లో 1.5 నుంచి 1.6 మిలియన్లగా ఉన్న టాక్స్ రేంజ్, ఈ దిగుమతి సుంకం తగ్గింపుతో ఆ కార్లకు టాక్స్ రేంజ్ 1.35 మిలియన్లు ఉండనుందని కారు డీలర్లు చెప్పారు. అయితే ఎస్ యూవీ లాంటి ఎక్కువ రేంజ్ ఉన్న వెహికిల్స్ కు దిగుమతి సుంకాలు పెరిగాయి. ఈ సుంకాలు శ్రీలంక రూపాయల్లో 5.4 మిలియన్ నుంచి 7.6 మిలియన్లకు పైగా పెరిగాయి. 1000 క్యూబిక్ సెంటీమీటర్ పైగా ఇంజీన్ సామర్థ్యమున్న వెహికిల్స్ పన్ను రేట్లను పెంచడంతో, ఆ కార్ల ధరలు కూడా పన్నులతో పాటు పైకి ఎగబాకనున్నాయని శ్రీలంక వాహన దిగుమతిదారుల అసోసియేషన్ తెలిపింది. త్రీ వీలర్ ఆటో టాక్సీలకు కూడా కస్టమ్ డ్యూటీ రేట్లను పెంచినట్టు డీలర్లు పేర్కొన్నారు. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయంతో క్షీణిస్తున్న విదేశీ నిల్వలు ఆ ప్రభుత్వం పెంచుకోనుంది.