న్యూఢిల్లీ: కంపెనీ డైరెక్టర్లకు చెల్లించే వేతనాలపై జీఎస్‌టీ వసూలు ఉండదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టత ఇచ్చింది. డైరెక్టర్లకు చెల్లించే పారితోషికంపై కంపెనీలు జీఎస్‌టీ చెల్లించాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజస్థాన్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ తీర్పునిచ్చిన నేపథ్యంలో సీబీడీటీ నుంచి ఈ స్పష్టత రావడం గమనార్హం. ‘‘డైరెక్టర్లకు ఇచ్చే పారితోషికాన్ని వేతనాలుగా కంపెనీలు పుస్తకాల్లో చూపించినట్టయితే, ఈ మొత్తంపై ఐటీ చట్టంలోని సెక్షన్ 192 కింద టీడీఎస్ అమలు చేస్తున్నట్టు అయితే.. జీఎస్‌టీ పరిధిలోకి రాదు’’ అంటూ సీబీడీటీ పేర్కొంది. ఒకవేళ డైరెక్టర్ల పారితోషికం వేతనం రూపంలో కాకుండా.. వృత్తిపరమైన ఫీజులుగా చెల్లిస్తుంటే మాత్రం జీఎస్‌టీ చెల్లించాలని సీబీడీటీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment