ఢిల్లీ: కేంద్రం గంగా జలాన్ని సైతం వదలడం లేదని.. దానిపైనా జీఎస్టీ వేస్తోందంటూ కాంగ్రెస్ సంచలన ఆరోపణకు దిగింది. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ లాంటిదేం లేదని స్పష్టత ఇచ్చింది.
ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం గంగాజలం గురించి ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఉత్తరాఖండ్‌లో ఇవాళ మీరు పర్యటిస్తున్నారు. కానీ మీ ప్రభుత్వం ఇదే గంగాజలానికి 18 శాతం జీఎస్టీ విధిస్తోంది. ఇంట్లో పెట్టుకునే పవిత్ర గంగా జలానికీ జీఎస్టీ విధించడం తగదు’’ అంటూ ఖర్గే పోస్ట్ పెట్టారు.
मोदी जी,
— Mallikarjun Kharge (@kharge) October 12, 2023
एक आम भारतीय के जन्म से लेकर उसकी जीवन के अंत तक मोक्षदायिनी माँ गंगा का महत्त्व बहुत ज़्यादा है।
अच्छी बात है की आप आज उत्तराखंड में हैं, पर आपकी सरकार ने तो पवित्र गंगाजल पर ही 18% GST लगा दिया है।
एक बार भी नहीं सोचा कि जो लोग अपने घरों में गंगाजल मँगवाते हैं,… pic.twitter.com/Xqd5mktBZG
అయితే.. ఈ నీటి మీదా 18 శాతం జీఎస్టీ (GST) విధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. కానీ, ఈ గంగాజలానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని సీబీఐసీ పేర్కొంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదని క్లారిటీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment