Gangajalam
-
గంగా జలంపై జీఎస్టీ.. ట్యాక్స్ బోర్డు స్పందన
ఢిల్లీ: కేంద్రం గంగా జలాన్ని సైతం వదలడం లేదని.. దానిపైనా జీఎస్టీ వేస్తోందంటూ కాంగ్రెస్ సంచలన ఆరోపణకు దిగింది. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ లాంటిదేం లేదని స్పష్టత ఇచ్చింది. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం గంగాజలం గురించి ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఉత్తరాఖండ్‌లో ఇవాళ మీరు పర్యటిస్తున్నారు. కానీ మీ ప్రభుత్వం ఇదే గంగాజలానికి 18 శాతం జీఎస్టీ విధిస్తోంది. ఇంట్లో పెట్టుకునే పవిత్ర గంగా జలానికీ జీఎస్టీ విధించడం తగదు’’ అంటూ ఖర్గే పోస్ట్ పెట్టారు. मोदी जी, एक आम भारतीय के जन्म से लेकर उसकी जीवन के अंत तक मोक्षदायिनी माँ गंगा का महत्त्व बहुत ज़्यादा है। अच्छी बात है की आप आज उत्तराखंड में हैं, पर आपकी सरकार ने तो पवित्र गंगाजल पर ही 18% GST लगा दिया है। एक बार भी नहीं सोचा कि जो लोग अपने घरों में गंगाजल मँगवाते हैं,… pic.twitter.com/Xqd5mktBZG — Mallikarjun Kharge (@kharge) October 12, 2023 అయితే.. ఈ నీటి మీదా 18 శాతం జీఎస్టీ (GST) విధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. కానీ, ఈ గంగాజలానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని సీబీఐసీ పేర్కొంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదని క్లారిటీ ఇచ్చింది. -
కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం..
హరిద్వార్: శ్రావణ మాసం ప్రారంభంలో జరిగే కన్వర్ యాత్రలో ఓ శివ భక్తుడు భుజం మీద కావడితో ఒక ఉట్టెలో తన తల్లిని కూర్చోబెట్టి మరో ఉట్టెలో మూడు బిందెల పవిత్ర గంగాజలాన్ని కాలినడకన మోసుకుంటూ హరిద్వార్ నుండి బయలుదేరాడు. కన్వర్ యాత్రలో భాగంగా ప్రతి ఏటా శ్రావణమాసం ఆరంభంలో దేశవ్యాప్తంగా శివభక్తులు హరిద్వార్ నుండి పవిత్ర గంగా జలాన్ని భుజాన మోసుకుంటూ మైళ్లకు మైళ్ళు కాలినడకన తమతో పాటు తమ ఊళ్లలోని శివాలయానికి తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ఏళ్లుగా వస్తోన్న ఆచారం. ఉత్తరాఖండ్ లోని గోముఖ, గంగోత్రి నుండి బీహార్ లోని సుల్తాన్ గంజ్ నుండి గంగానది నీళ్లను తీసుకెళుతూ ఉంటారు శివభక్తులు. ఈ క్రమంలోనే ఓ శివభక్తుడు తన తల్లి శ్రేయస్సు కోసం ఒక కావడిని భుజాన తగిలించుకుని రెండు ఉట్టెల్లో ఒకదాంట్లో తన కన్నతల్లిని మరో దాంట్లో మూడు బిందెల గంగా జలాన్ని మోసుకుంటూ కన్వర్ యాత్రలో పాల్గొని తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. Kanwar Yatra 2023: A youth carries his mother on one shoulder and water of the river Ganga on the other shoulder in Haridwar pic.twitter.com/83vuUxVT83 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి -
పోలీస్ మాట: శానిటైజర్ బదులు గంగాజలం, గంధం
లక్నో: మహమ్మారి కరోనా వైరస్ రెండోసారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్ వినియోగం పెంచాలి. అవన్నీ కూడా కరోనా సోకకుండా తీసుకునే ముందస్తు చర్యలు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా శానిటైజర్ ఉపయోగపడదు.. గంగాజలమే కరోనాను దూరం చేస్తుంది అని సాక్షాత్తు పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు గంధం కూడా అదే పని చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో శానిటైజర్ బదులు గంగాజలం సీసాలను పంచుతున్నారు. స్టేషన్‌కు వచ్చేవారికి గంధం బొట్టు పెట్టడంతో పాటు గంగాజలం కొద్దిగా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో. ఉత్తరప్రదేశ్‌లోని నౌచందీలో ఉన్న మీరట్ పోలీస్‌స్టేషన్‌లో శానిటైజర్ బదులు గంగాజలం వినియోగిస్తున్నారు. స్టేషన్‌కు ఎవరైనా వచ్చినా మొదట గంధం బొట్టు పెడతారు. అనంతరం గంగాజలం చేతులకు వేస్తారు. శానిటైజర్ మాదిరి రుద్దుకోవాలి. ఎందుకంటే కరోనాను వ్యాప్తి చెందకుండా గంగాజలం దోహదం చేస్తుందని ఆ స్టేషన్ అధికారి ప్రేమ్‌చంద్ శర్మ చెబుతున్నారు. చేతులపై ఉన్న వైరస్‌ను గంగాజలం చంపుతుందని చెప్పారు. నుదుటన గంధం బొట్టు పెడితే ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుందని ప్రేమ్‌చంద్ శర్మ వివరిస్తున్నారు. ఇదే పాటించాలని తోటి సిబ్బందికి సూచిస్తున్నారు. అంతటితో ఆగకుండా పోలీస్‌స్టేషన్ అంటే జాతీయ నాయకుల చిత్రపటాలు ఉండాల్సిన చోట దేవుడి ప్రతిమలు ఉన్నాయి. ఈ విధంగా స్టేషన్ స్వరూపం మార్చివేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. Sneak peek inside his office at Nauchandi police station in UP's Meerut district. SHO Prem Chand Sharma arrived with a bottle of Gangajal and soon several bottles were lined up on the table. pic.twitter.com/fQ4XzDAJVY — Piyush Rai (@Benarasiyaa) March 28, 2021 -
ఇంటింటికీ గంగాజలం
సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. జనం వద్దకు గంగాజలం తీసుకువచ్చేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇంటింటికీ గంగాజలాన్ని సీసాల్లో అందించే పథకానికి శ్రీకారం చుడుతోంది. గంగానదీ జలాన్ని శాస్త్రీయపద్ధతిలో శుద్ధి చేసి సీసాల్లో నింపి కోరినవారి ఇంటికే బట్వాడా చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ బాట్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చే సేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ప్రేరణ కలిగించింది మాత్రం ఇటీవలి గోదావరి పుష్కరాలే కావటం విశేషం. ‘గాడ్‌జల్’ సూపర్ సక్సెస్‌తో...: జూలై 14 నుంచి 25 వరకు జరిగిన గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని తపాలాశాఖ గోదావరి నీటిని శుద్ధి చేసి సీసాల్లో నింపి ‘గాడ్‌జల్’ పేరుతో కోరిన వారికి అందజేసింది. పుష్కరాలకు వెళ్లలేని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, దూరభారాన్ని మోయలేనివారికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని నిర్ణయించి తపాలాశాఖ ఏపీ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) ఈ ఆలోచన చేసింది. ఇందుకోసం రాజమండ్రిలోని ఓ చిన్న బాట్లింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దీనికి అనూహ్య స్పందన లభించింది. పుష్కరాలు మొదలయ్యేనాటికి ఏడున్నర లక్షల మంది ఆర్డర్ నమోదు చేసుకున్నారు. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా ఒత్తిడి రావటంతో ఆన్లైన్ ఆర్డర్లకు అవకాశం క ల్పించారు. గోదావరి పుష్కర నీటికి వచ్చిన డిమాండ్‌తో తపాలా శాఖకు కొత్త ఆలోచన తట్టింది. దేశవ్యాప్తంగా పుణ్యజలంగా భావించే గంగాజలాన్ని ఇంటింటికీ సరఫరా చేయాలని భావించింది. దీంతో గంగానది ప్రారంభమయ్యే గంగోత్రి వద్ద నీటిని సేకరించి శుద్ధి చేసి సీసాల్లో నింపి విక్రయించాలని నిర్ణయించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో చర్చించి సంయుక్తంగా సొంత ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే నిరంతరాయంగా వాటిని సరఫరా చేయొచ్చని భావిస్తోంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్రముఖ్యమంత్రితో త్వరలో తపాలాశాఖ అధికారులు భేటీ కాబోతున్నారు. తపాలాశాఖ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా ఉన్న సుధాకర్ త్వరలోనే తపాలాశాఖ బోర్డు సభ్యుడిగా పదోన్నతిపై ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ గంగాజలం ప్రాజెక్టు బాధ్యతను ఆయన పర్యవేక్షించనున్నట్టు సమాచారం. ఆయనే స్వయంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంది. తపాలాశాఖ కేంద్రకార్యాలయం ముందు ఈ ప్రతిపాదనను ఉంచింది ఆయనే.