clarify
-
గంగా జలంపై జీఎస్టీ.. ట్యాక్స్ బోర్డు స్పందన
ఢిల్లీ: కేంద్రం గంగా జలాన్ని సైతం వదలడం లేదని.. దానిపైనా జీఎస్టీ వేస్తోందంటూ కాంగ్రెస్ సంచలన ఆరోపణకు దిగింది. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ లాంటిదేం లేదని స్పష్టత ఇచ్చింది. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం గంగాజలం గురించి ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఉత్తరాఖండ్‌లో ఇవాళ మీరు పర్యటిస్తున్నారు. కానీ మీ ప్రభుత్వం ఇదే గంగాజలానికి 18 శాతం జీఎస్టీ విధిస్తోంది. ఇంట్లో పెట్టుకునే పవిత్ర గంగా జలానికీ జీఎస్టీ విధించడం తగదు’’ అంటూ ఖర్గే పోస్ట్ పెట్టారు. मोदी जी, एक आम भारतीय के जन्म से लेकर उसकी जीवन के अंत तक मोक्षदायिनी माँ गंगा का महत्त्व बहुत ज़्यादा है। अच्छी बात है की आप आज उत्तराखंड में हैं, पर आपकी सरकार ने तो पवित्र गंगाजल पर ही 18% GST लगा दिया है। एक बार भी नहीं सोचा कि जो लोग अपने घरों में गंगाजल मँगवाते हैं,… pic.twitter.com/Xqd5mktBZG — Mallikarjun Kharge (@kharge) October 12, 2023 అయితే.. ఈ నీటి మీదా 18 శాతం జీఎస్టీ (GST) విధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. కానీ, ఈ గంగాజలానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని సీబీఐసీ పేర్కొంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదని క్లారిటీ ఇచ్చింది. -
తమిళనాడు Vs తమిళగం దుమారం..వివరణ ఇచ్చిన గవర్నర్
తమిళనాడు రాష్ట్రం పేరు విషయంలో గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు పెద దుమారం రేపాయి. ఏకంగా తమిళనాడు వర్సెస్ తమిళగం అనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరదించుతూ గవర్నర్ రవి వివరణ ఇచ్చారు. తాను తమిళనాడుకి వ్యతిరేకిని కానని తాను పేరు మార్చాలని సూచించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని నొక్కి చెప్పారు. తన మాటలను అర్థం చేసుకోకుండా కొందరూ అలా కావాలనే వక్రీకరించారన్నారు. తమిళ ప్రజలు, కాశీకి మధ్య గల చారిత్రక సాంస్కృతిక అనుసంధానం గురించి మాట్లాడుతూ..'తమిళగం' అనే పదాన్న ప్రస్తావించానని చెప్పారు. వాస్తవానికి ఆ రోజుల్లో తమిళనాడు లేదన్నారు. అందుకనే చారిత్రక సాంస్కృతిక సందర్భంలో 'తమిళగం' అనే పదాన్ని సముచితమైనదిగా చెప్పేందుకు యత్నించానన్నారు. అంతేగాదు గవర్నర్ తనపై వస్తున్న వ్యతిరేక వాదనలకు ముంగింపు పలికేలా వివరణ ఇస్తూ.." 'తమిళనాడు' అంటే 'తమిళుల దేశం' అని, 'తమిళగం' అంటే 'తమిళుల ఇల్లు' అని అర్థం. 'నాడు' అనే పదానికి అర్థం 'భూమి'. భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని వర్ణించడానికి ఈ పదాన్ని వాడాలని చాలమంది భావిస్తున్నారు. తమిళనాడు భారతదేశంలో అంతర్భాగం కాదనే కథనాన్ని పురికొల్పే వారికి ఈ వాదన సరితూగవచ్చు. దేశం మొత్తానికి వర్తించేది తమిళనాడు కాదని, అలవాటుగా మారింది. నిజం గెలవాలంటే తమిళగం సరైన పదం. విదేశీయలు పాలన కాలంగా మన సంస్కృతి నాశనమై ఇలా ఈ పదం వచ్చిందని వివరణ ఇచ్చారు. కాగా పొంగల్ వేడుకలకు రాజ్‌భవన్ ఆహ్వానంలో తమిళ వెర్షన్లో గవర్నర్‌ని తమిళగ ఆజునర్ లేదా తమిళగం గవర్నర్ అని ప్రస్తావించడం, దానికి తోడు ఆయన కూడా తమిళనాడు పేరు గురించి మాట్లాడటం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను గవర్నర్ రవి ముందుకు తెచ్చారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. అంతేకాదు రవికి వ్యతిరేకంగా అసెంబ్లీలో క్విట్ తమిళనాడు, గెట్ ఔట్ రవి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కూడా. (చదవండి: పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్.. ఆనందంతో ఆహ్వానించిన కాంతి అళగిరి) -
మమ్మల్ని నమ్మండి.. వాట్సాప్ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత వివరాలు అడుగుతుందని.. ఫోన్లు, సందేశాలు స్టోరేజీ చేసుకుంటుందని.. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు పక్కదారి పడుతున్నాయని వాట్సాప్‌పై వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లనీ.. వాటికి తాము సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని వాట్సాప్ తెలిపింది. దీంతో మంగళవారం సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ స్పష్టత ఇచ్చింది. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ వదంతుల కారణంగా వారం రోజుల్లోనే వాట్సప్‌ను అన్ ఇన్స్టాల్ చేయడం.. అన్‌లైక్ చేయడం చేస్తున్నారు. వాట్సప్ వినియోగం ఆపేసి మిగతా యాప్‌లను వినియోగిస్తున్నారు. పెద్దసంఖ్యలో డౌన్లోడ్స్ ఆగిపోయి.. డిస్ లైక్‌లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ అధికారికంగా స్పందించి కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చివరి వరకు మీ వ్యక్తిగత వివరాలు మేం రక్షణగా ఉంటామని ప్రకటించింది. వాట్సాప్ ప్రకటనలో ముఖ్యమైన అంశాలు ఫేస్‌బుక్‌కు వాట్సాప్ వివరాలు పంపుతామని అబద్ధం. ఎలాంటి వివరాలు పంచుకోం. మీ వ్యక్తిగత చాట్ వివరాలు ఎవరికీ తెలపం. కొత్తగా ప్రైవసీ పాలసీని రూపొందిస్తున్నాం. కొత్త నిబంధనలను అంగీకరిస్తేనే వాట్సప్ వినియోగానికి అర్హులు. లేదంటే వారి ఖాతాను తొలగించేస్తాం. కొత్తగా అప్డేట్ చేసిన వర్షన్ ఫిబ్రవరిలో అమల్లోకి తెస్తాం. 400 మిలియన్ల వినియోగదారులు వాట్సాప్ కు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు మీ పరిచయస్తుల (కాంటాక్ట్స్) వివరాలు పంచుకోం. వ్యక్తిగత వివరాలు ఎవరికీ షేర్ చేయం. మీ వివరాలన్నింటి విషయంలో గోప్యత పాటిస్తాం. మీరు సందేశాలు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు పంపిన లోకేషన్స్ కూడా వాట్సప్ పర్యవేక్షించదు. -
రూ. 1000 నాణెం వస్తుందా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ లభ్యత, రూ.2 వేలనోటు రద్దుపై వస్తున్న వదంతులు, అంచనాలపై రాజ్యసభలో దుమారం రేగింది. ముఖ్యంగా రూ. 2వేల నోటు రద్దు వార్తల ఆందోళన, వెయ్యి రూపాయల నాణెం ప్రవేశం లాంటి పుకార్ల నేపథ్యంలో పెద్దల సభలో ప్రతిపక్షాలు బుధవారం ప్రశ్నలు గుప్పించాయి. ఈ వార్తలపై ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాయి. ముఖ్యంగా ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ 1,000 రూపాయల నాణేలను ప్రవేశపెడుతున్నారా లేదా అనే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ."1,000, 100 , 200 నాణాలపై తాము ప్రతిరోజూ చదువుతున్నామనీ అసలు వాస్తవం ఏమిటో తమకు తెలియాలన్నారు. వీటిపై ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఆజాద్ చేశారు. 1,000 రూపాయల నాణాలను మోసుకెళ్లడానికి ఒక బ్యాగ్ కొనుగోలు చేయాలా? తమకు తెలియాలంటూ చమత్కరించారు. అటు జీరో అవర్‌లో ఎస్పీ నాయకుడు నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వం రూ .2,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ రూ .2,000 లను ప్రింట్ చేయకూడదని ఆదేశించింది. ఇలాంటి విధాన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రకటించడం సాంప్రదాయమని గుర్తు చేశారు. అయితే దీనికి డిప్యూటీ ఛైర్మన్ పి.కె. కురియన్ జోక్యం చేసుకుని ఇది ఆర్బీఐ పని వివరించారు. దీనికి స్పందించిన అగర్వాల్ ఆర్బీఐ వ్యతిరేకించిన డీమానిటైజేషన్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చురకలేశారు. ఇదే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తిరుచి శివ (డిఎంకె) డిమాండ్ చేయగా, పుకార్లు బలంగా ఉన్నందున ఈ సమస్య తీవ్రమైనదని శరద్ యాదవ్ (జెడి-యు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వివరణ ద్వారా పుకార్లకు చెక్ పెట్టాలని కోరారు. కాగా ప్రతిపక్ష సభ్యులు ఎంత వాదించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మౌనాన్నే ఆశ్రయించడం గమనార్హం. -
నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలి
నకిరేకల్ : నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. నకిరేకల్‌లో బుధవారం జరిగిన ఆ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిమ్మ మార్కెట్‌ను పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని హామీలు తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఇప్పటికే ఈ ప్రాంత రైతాంగం దళారులను ఆశ్రయించి మోసపోతుందన్నారు. ఏఎమ్మార్పీకాల్వ ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కందాళ ప్రమీళ, మర్రి వెంకటయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, ఆకుల బాస్కర్, కొప్పుల అందయ్య, వంటెపాక కృష్ణ, కృష్ణమోహిని, తాజేశ్వర్ పాల్గొన్నారు. -
'పూర్తి పేరు రాసినా.. పొట్టి పేరైనా ఓకే'
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పొట్టి పేరు రాసినా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పూర్తి పేరు రాసినా వారిని ఆ పార్టీ అభ్యర్థులుగా గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, రిటర్నింగ్ అధికారులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా తమ పార్టీ పేరు బాగా ప్రాచుర్యం పొందినందున తమ పార్టీ అభ్యర్థులు పూర్తి పేరు రాసినా, పొట్టిపేరు రాసినా వారిని తమ అభ్యర్థులుగా పరిగణించాలని ఆ పార్టీ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందిందని తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పార్టీ అభ్యర్థులందరికీ సీలింగ్ ఫ్యాన్ గుర్తును కేటాయించాలని నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
షిండేను కలిసి తెలంగాణ పై నోట్ ఇచ్చిన ఎంపి వివేక్