
రూ. 1000 నాణెం వస్తుందా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ లభ్యత, రూ.2 వేలనోటు రద్దుపై వస్తున్న వదంతులు, అంచనాలపై రాజ్యసభలో దుమారం రేగింది. ముఖ్యంగా రూ. 2వేల నోటు రద్దు వార్తల ఆందోళన, వెయ్యి రూపాయల నాణెం ప్రవేశం లాంటి పుకార్ల నేపథ్యంలో పెద్దల సభలో ప్రతిపక్షాలు బుధవారం ప్రశ్నలు గుప్పించాయి. ఈ వార్తలపై ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాయి.
ముఖ్యంగా ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ 1,000 రూపాయల నాణేలను ప్రవేశపెడుతున్నారా లేదా అనే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ."1,000, 100 , 200 నాణాలపై తాము ప్రతిరోజూ చదువుతున్నామనీ అసలు వాస్తవం ఏమిటో తమకు తెలియాలన్నారు. వీటిపై ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఆజాద్ చేశారు. 1,000 రూపాయల నాణాలను మోసుకెళ్లడానికి ఒక బ్యాగ్ కొనుగోలు చేయాలా? తమకు తెలియాలంటూ చమత్కరించారు.
అటు జీరో అవర్లో ఎస్పీ నాయకుడు నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వం రూ .2,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ రూ .2,000 లను ప్రింట్ చేయకూడదని ఆదేశించింది. ఇలాంటి విధాన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రకటించడం సాంప్రదాయమని గుర్తు చేశారు. అయితే దీనికి డిప్యూటీ ఛైర్మన్ పి.కె. కురియన్ జోక్యం చేసుకుని ఇది ఆర్‌బీఐ పని వివరించారు. దీనికి స్పందించిన అగర్వాల్ ఆర్‌బీఐ వ్యతిరేకించిన డీమానిటైజేషన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చురకలేశారు.
ఇదే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తిరుచి శివ (డిఎంకె) డిమాండ్ చేయగా, పుకార్లు బలంగా ఉన్నందున ఈ సమస్య తీవ్రమైనదని శరద్ యాదవ్ (జెడి-యు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వివరణ ద్వారా పుకార్లకు చెక్ పెట్టాలని కోరారు.
కాగా ప్రతిపక్ష సభ్యులు ఎంత వాదించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మౌనాన్నే ఆశ్రయించడం గమనార్హం.