wants
-
రూ. 1000 నాణెం వస్తుందా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ లభ్యత, రూ.2 వేలనోటు రద్దుపై వస్తున్న వదంతులు, అంచనాలపై రాజ్యసభలో దుమారం రేగింది. ముఖ్యంగా రూ. 2వేల నోటు రద్దు వార్తల ఆందోళన, వెయ్యి రూపాయల నాణెం ప్రవేశం లాంటి పుకార్ల నేపథ్యంలో పెద్దల సభలో ప్రతిపక్షాలు బుధవారం ప్రశ్నలు గుప్పించాయి. ఈ వార్తలపై ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాయి. ముఖ్యంగా ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ 1,000 రూపాయల నాణేలను ప్రవేశపెడుతున్నారా లేదా అనే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ."1,000, 100 , 200 నాణాలపై తాము ప్రతిరోజూ చదువుతున్నామనీ అసలు వాస్తవం ఏమిటో తమకు తెలియాలన్నారు. వీటిపై ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఆజాద్ చేశారు. 1,000 రూపాయల నాణాలను మోసుకెళ్లడానికి ఒక బ్యాగ్ కొనుగోలు చేయాలా? తమకు తెలియాలంటూ చమత్కరించారు. అటు జీరో అవర్‌లో ఎస్పీ నాయకుడు నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వం రూ .2,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ రూ .2,000 లను ప్రింట్ చేయకూడదని ఆదేశించింది. ఇలాంటి విధాన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రకటించడం సాంప్రదాయమని గుర్తు చేశారు. అయితే దీనికి డిప్యూటీ ఛైర్మన్ పి.కె. కురియన్ జోక్యం చేసుకుని ఇది ఆర్బీఐ పని వివరించారు. దీనికి స్పందించిన అగర్వాల్ ఆర్బీఐ వ్యతిరేకించిన డీమానిటైజేషన్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చురకలేశారు. ఇదే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తిరుచి శివ (డిఎంకె) డిమాండ్ చేయగా, పుకార్లు బలంగా ఉన్నందున ఈ సమస్య తీవ్రమైనదని శరద్ యాదవ్ (జెడి-యు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వివరణ ద్వారా పుకార్లకు చెక్ పెట్టాలని కోరారు. కాగా ప్రతిపక్ష సభ్యులు ఎంత వాదించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మౌనాన్నే ఆశ్రయించడం గమనార్హం. -
ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం పుత్తూరు రూరల్: ఫైవ్ స్టార్, ఫోర్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు, ప్రముఖ రెస్టారెంట్లు, రిసార్టులు, క్రూజ్ లైన్స్, హాస్పిటాలిటీ రంగంలో షెఫ్(కుక్)లుగా రాణించడానికి కావలసిన స్కిల్స్ పెంపొందించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గచ్చిబౌలి, హైదరాబాద్‌లో ఉచిత ట్రైనింగ్, వసతి, ప్లేస్మెంట్ సదుపాయం కల్పించడానికి 1 సంవత్సరం డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ కోర్సుకోసం షెడ్యూల్డ్ కులాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంపీడీవో నిర్మలాదేవి తెలిపారు. సదరు అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డీగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయినవారు వయస్సు 18 నుండి 30 సంవత్సరాల లోపు వారు అర్హులని అన్నారు. ఈ నెల 25వ తేదీ లోగా అప్లికేషన్లు పొందాలని తెలిపారు. -
'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే'
-
'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే'
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు తాను నమ్మడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. నిజం నిర్ధారించలేకపోవడం మన దేశానికే సిగ్గు చేటని, ఆయన గురించి రష్యన్ కోణంలో దర్యాప్తు చేపట్టాలని కోల్ కతాలో జరిగిన నేతాజీ 75వ వార్షికోత్సవ సందర్భంలో ఆమె డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ జాతి పిత అయితే, స్వాతంత్ర్యం రాకముందు నేతాజీ జాతి నేత అని ఆమె అన్నారు. నేతాజీ ప్రమాదంలో చనిపోయి ఉంటే... స్వాతంత్ర్యం తర్వాత ఆయన కుటుంబం రహస్యంగా ఎందుకు బతకాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి సమాధానం కావాలంటే రష్యన్ కోణంలో దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా నేతాజీ మనవడు ఆశిష్ రే నిర్వహిస్తున్న బ్రిటిష్ కు చెందిన వెబ్ సైట్ www.bosefiles.info అదే విషయంపై అధ్యయనాలు నిర్వహించి, నివేదికలను వెల్లడించింది. ఏళ్లకాలంగా ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు నేతాజీ చివరి రోజుల్లోని వివరాలు, ప్రత్యక్ష సాక్ష్యాలను సేకరించి వెబ్ సైట్ లో పొందుపరిచింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు ఆ వెబ్ సైట్‌లోని నాలుగు నివేదికలూ నిర్ధారిస్తున్నాయి. ఆగస్టు 18, 1945లో తైపీ దగ్గర జరిగిన విమాన ప్రమాదం తర్వాత సుభాష్ చంద్రబోస్ మరణించారని, అయితే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ విషయాన్ని నమ్మడం లేదని, రష్యన్ కోణంలో దర్యాప్తును కోరుకుంటున్నారని రే అంటున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగింది? బోస్ ప్రమాదం నుంచి బయట పడ్డారా లేదా అన్న వివరాలపై ఆయన అనుచరుడు కల్నల్ హాబిబర్ రెహ్మాన్ చెప్పిన విశేషాలు సహా మరిన్ని వివరాలను ఆశిష్ రే... తాజాగా వెబ్ సైట్లో పోస్ట్ చేశారు. బోస్ అనుచరుడు చెప్పిన ప్రకారం ఎయిర్ క్రాష్ నుంచి బోస్ తో పాటు రెహ్మాన్ కూడా బయట పడ్డారని, ఆరోజు ఫిన్నే, డేవిస్... అనే ఇద్దరు పోలీసు అధికారుల నేతృత్వంలో ఇండియానుంచి దర్యాప్తు కోసం హెచ్ కె రాయ్, కెపి డే నిఘాజట్లు సైగాన్, తైపీలలో దర్యాప్తు చేపట్టడం కోసం బ్యాంకాక్ కు వెళ్ళారని, జపనీస్ అధికారిక డాక్టర్ ట్సురుతాను విచారించామని రే చెప్తున్నారు. బోస్ చనిపోయే ముందు నర్స్ ట్సాన్ పై షా చికిత్స అందించారని, డాక్టర్ యోష్మి ని రే స్వయంగా కలిశానని కూడ అంటున్నారు. విమాన ప్రమాదం తర్వాత బోస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఈ వివరాలన్నీ నిర్ధారిస్తున్నాయని రే స్పష్టం చేస్తున్నారు. నోనోమియా అనే లెఫ్టినెంట్... సుభాష్ చంద్రబోస్ ఓ ప్రత్యేకమైన, ప్రముఖమైన వ్యక్తి అని చెప్పారని, అందుకే ఆయన్ను ఎలాగైనా బతికించాలని ప్రయత్నించామని డాక్టర్ యోష్మి అన్నట్లు కూడా రే వెల్లడించారు. అయితే బోస్ పరిస్థితి విషమంగా మారుతున్న సమయంలో ఆయన్ను ఎలా ఉంది అని అడిగితే... తలలో తీవ్ర రక్తప్రసరణ జరుగుతున్నట్లనిపిస్తోందన్నారని, ఓ ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే ఆయన ప్రాణంపోయిందని డాక్టర్ రేష్మి వివరించినట్లు 'రే' చెప్తున్నారు. మమతా బెనర్జీకి ఈ విషయాలపై నమ్మకం కుదరడం లేదని అందుకే ఆమె రష్యన్ కోణంలో దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారని ఆశిష్ రే అంటున్నారు. -
'చంచల్‌గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి'
-
సవతి తండ్రి పేరే కావాలి
న్యూఢిల్లీ: కన్నతండ్రి కంటే.. సవతి తండ్రే తనకు ముఖ్యమంటున్నాడు ఢిల్లీకి చెందిన ఓ బాలుడు. కన్నకొడుకు కంటే మిన్నగా ఆదరించిన ఆయననే తనకు చట్టబద్ధమైన తండ్రిగా గుర్తించాలంటున్నాడు. అతని కొడుకుగానే తనకు విదేశాల్లో చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలంటున్నాడు. ఇంటర్ చదువుతున్న ఢిల్లీకి చెందిన విద్యార్థి (17) పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. అందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేశాడు. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. దరఖాస్తు ఫారంలో తండ్రి పేరు స్థానంలో తన సవతి తండ్రి పేరు రాశాడు. దీంతో అధికారులు పాస్‌పోర్టును తిరస్కరించారు. అంతే.. వివాదం మొదలైంది. దీనిపై సదరు బాలుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. సవతి తండ్రినే తనకు నిజమైన గార్డియన్‌గా గుర్తించాలని కోర్టును కోరుతున్నాడు. తల్లిదండ్రులుగా.. అసలు తల్లిదండ్రులు లేదా పెంపుడు తల్లిదండ్రులు లేదా సవతి తల్లిదండ్రుల పేర్లను పేర్కొనే అవకాశాన్ని అభ్యర్థులకే వదిలేయాలంటూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశాడు. తండ్రి నుంచి తను, తన తల్లి ఎపుడో విడిపోయామని, ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. విడాకుల పత్రంలో ఈ విషయం స్పష్టం ఉందని అతడు చెప్పాడు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆ విద్యార్థి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేమని నిపుణులంటున్నారు. చట్ట ప్రకారం దత్తత తీసుకుంటే తప్ప వారి బంధాన్ని అంగీకరించలేమంటున్నారు. అందునా ఆ విద్యార్థికి ఇంకా 18 ఏళ్లు నిండలేదు కనుక కన్నతండ్రే గార్డియన్ అవుతాడంటున్నారు. ఇలాంటి చిక్కు సమస్యలు చాలాసార్లు వస్తున్నాయని మరికొందరు అంటున్నారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళల పిల్లలు తరచు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ చట్టంలోని నిబంధనను మార్చాలని న్యాయవాది ఫ్లావియా ఏగ్రెస్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బాలుని తండ్రి స్పందిస్తూ.. ఒక్క బర్త్ సర్టిఫికెట్లో తప్ప, మిగిలిన అన్ని సర్టిఫికెట్లలో తండ్రిగా తన పేరే ఉందన్నారు. ఈ పాస్‌పోర్ట్ వ్యవహారంలో ఒకవేళ కన్నతండ్రి పేరును ప్రస్తావిస్తే మరింత గందరగోళంగా మారేదన్నారు. అటు నిబంధనలకు విరుద్ధంగా తామేమీ చేయలేమని పాస్‌పోర్టు జారీ అధికారులు తెలిపారు. మరి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. -
రాజ్యసభ సీటు ఆశిస్తున్న హరికృష్ణ
-
వి.వి వినాయక్ డైరెక్షన్లో మహేష్ బాబు ?
-
పవన్‌తో తెగదెంపులకు టీడీపీ సిద్దం..!