ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పుత్తూరు రూరల్: ఫైవ్ స్టార్, ఫోర్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు, ప్రముఖ రెస్టారెంట్లు, రిసార్టులు, క్రూజ్ లైన్స్, హాస్పిటాలిటీ రంగంలో షెఫ్(కుక్)లుగా రాణించడానికి కావలసిన స్కిల్స్ పెంపొందించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ గచ్చిబౌలి, హైదరాబాద్‌లో ఉచిత ట్రైనింగ్, వసతి, ప్లేస్‌మెంట్ సదుపాయం కల్పించడానికి 1 సంవత్సరం డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ కోర్సుకోసం షెడ్యూల్డ్ కులాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంపీడీవో నిర్మలాదేవి తెలిపారు. సదరు అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డీగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయినవారు వయస్సు 18 నుండి 30 సంవత్సరాల లోపు వారు అర్హులని అన్నారు. ఈ నెల 25వ తేదీ లోగా అప్లికేషన్లు పొందాలని తెలిపారు.
ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
Published Sat, Jul 23 2016 10:48 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM
Advertisement
Advertisement