
నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలి
నకిరేకల్ :
నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. నకిరేకల్‌లో బుధవారం జరిగిన ఆ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిమ్మ మార్కెట్‌ను పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని హామీలు తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఇప్పటికే ఈ ప్రాంత రైతాంగం దళారులను ఆశ్రయించి మోసపోతుందన్నారు. ఏఎమ్మార్పీకాల్వ ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కందాళ ప్రమీళ, మర్రి వెంకటయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, ఆకుల బాస్కర్, కొప్పుల అందయ్య, వంటెపాక కృష్ణ, కృష్ణమోహిని, తాజేశ్వర్ పాల్గొన్నారు.