తమిళనాడు రాష్ట్రం పేరు విషయంలో గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు పెద దుమారం రేపాయి. ఏకంగా తమిళనాడు వర్సెస్ తమిళగం అనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరదించుతూ గవర్నర్ రవి వివరణ ఇచ్చారు. తాను తమిళనాడుకి వ్యతిరేకిని కానని తాను పేరు మార్చాలని సూచించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని నొక్కి చెప్పారు. తన మాటలను అర్థం చేసుకోకుండా కొందరూ అలా కావాలనే వక్రీకరించారన్నారు.
తమిళ ప్రజలు, కాశీకి మధ్య గల చారిత్రక సాంస్కృతిక అనుసంధానం గురించి మాట్లాడుతూ..'తమిళగం' అనే పదాన్న ప్రస్తావించానని చెప్పారు. వాస్తవానికి ఆ రోజుల్లో తమిళనాడు లేదన్నారు. అందుకనే చారిత్రక సాంస్కృతిక సందర్భంలో 'తమిళగం' అనే పదాన్ని సముచితమైనదిగా చెప్పేందుకు యత్నించానన్నారు. అంతేగాదు గవర్నర్ తనపై వస్తున్న వ్యతిరేక వాదనలకు ముంగింపు పలికేలా వివరణ ఇస్తూ.." 'తమిళనాడు' అంటే 'తమిళుల దేశం' అని, 'తమిళగం' అంటే 'తమిళుల ఇల్లు' అని అర్థం. 'నాడు' అనే పదానికి అర్థం 'భూమి'. భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని వర్ణించడానికి ఈ పదాన్ని వాడాలని చాలమంది భావిస్తున్నారు. తమిళనాడు భారతదేశంలో అంతర్భాగం కాదనే కథనాన్ని పురికొల్పే వారికి ఈ వాదన సరితూగవచ్చు.
దేశం మొత్తానికి వర్తించేది తమిళనాడు కాదని, అలవాటుగా మారింది. నిజం గెలవాలంటే తమిళగం సరైన పదం. విదేశీయలు పాలన కాలంగా మన సంస్కృతి నాశనమై ఇలా ఈ పదం వచ్చిందని వివరణ ఇచ్చారు. కాగా పొంగల్ వేడుకలకు రాజ్‌భవన్ ఆహ్వానంలో తమిళ వెర్షన్‌లో గవర్నర్‌ని తమిళగ ఆజునర్ లేదా తమిళగం గవర్నర్ అని ప్రస్తావించడం, దానికి తోడు ఆయన కూడా తమిళనాడు పేరు గురించి మాట్లాడటం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను గవర్నర్ రవి ముందుకు తెచ్చారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. అంతేకాదు రవికి వ్యతిరేకంగా అసెంబ్లీలో క్విట్ తమిళనాడు, గెట్ ఔట్ రవి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కూడా.
(చదవండి: పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్.. ఆనందంతో ఆహ్వానించిన కాంతి అళగిరి)
Comments
Please login to add a commentAdd a comment