
న్యూఢిల్లీ: జనవరిలో వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇంత అత్యధికంగా వసూలు కావడం ఇది రెండోసారి. జనవరి 31 సాయంత్రం 5 గం.ల వరకు రూ. 1,55,922 కోట్ల స్థూల జీఎస్‌టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో సీజీఎస్‌టీ రూ. 28,963 కోట్లు కాగా, ఎస్‌జీఎస్‌టీ రూ. 36,730 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 79,599 కోట్లుగా ఉన్నట్లు వివరించింది.
గత ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ కాలంతో ఈ ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ వ్యవధి పోలిస్తే జీఎస్‌టీ ఆదాయం 24 శాతం పెరిగినట్లు పేర్కొంది. వసూళ్లు రూ. 1.50 లక్షల కోట్లు దాటడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది మూడోసారి. ఏప్రిల్‌లో అత్యధికంగా రూ. 1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి.
చదవండి: Union Budget 2023: నిర్మలమ్మా ప్రధానంగా ఫోకస్ పెట్టే అంశాలు ఇవేనా!