అక్టోబర్‌ 7న జీఎస్‌టీ మండలి కీలక భేటీ | 52nd Gst Council Meeting Is To Be Held On October 07 | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 7న జీఎస్‌టీ మండలి కీలక భేటీ

Published Wed, Sep 27 2023 8:05 AM | Last Updated on Wed, Sep 27 2023 8:09 AM

52nd Gst Council Meeting Is To Be Held On October 07 - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో వచ్చే నెల 7వ తేదీన జీఎస్‌టీ మండలి కీలక సమావేశం జరగనుంది. న్యూఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో ఈ జీఎస్‌టీ మండలి 52వ సమావేశం జరగనుందని ఎక్స్‌లో ఒక అధికారిక ప్రకటన పోస్టయ్యింది.

జీఎస్‌టీ మండలి నిర్ణయాల్లో కేంద్ర ఆర్థికమంత్రితోపాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు కూడా భాగస్వాములుగా ఉండే సంగతి తెలిసిందే. ఆగస్టు 2వ తేదీన జరిగిన గత జీఎస్‌టీ మండలి భేటీలో క్యాసినోలు, గుర్రపు పందాలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ల పన్ను విధానాలపై కీలక నిర్ణయాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడింటికి సంబంధించిన పందాల పూర్తి ఫేస్‌ వ్యాల్యూపై 28 శాతం జీఎస్‌టీ విధించాలని ఈ సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement